ఆంధ్రప్రదేశ్‌లో డూప్లికేట్ రిజిస్ట్రేషన్లు, దళారీ వ్యవస్థ ఉండని సీఎం జగన్ ప్రకటించారు. శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకాన్ని సీఎం 37 గ్రామాల్లో ప్రారంభించారు. ఈ గ్రామాల్లో స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ చేయనున్నారు. గ్రామ కంఠాల్లోని స్థిరాస్తుల సర్వే, యాజమాన్య ధ్రువీకరణ పత్రాలు ఇస్తారు. శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం ద్వారా శాస్త్రీయ పద్దతిలో సమగ్ర భూసర్వే నిర్వహించి పత్రాలు ఇవ్వనున్నారు. ఇప్పటికి 51 గ్రామాల్లో భూ సర్వే పూర్తి అయిందని ఏడాది చివరి నాటికి 11,501 గ్రామాల్లో రీసర్వే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. వివాదాలకు తావు లేకుండా సమగ్ర సర్వే చేపట్టామన్నారు.
Also Read: పీఆర్సీని అంగీకరించే ప్రశ్నే లేదన్న ఏపీ ఉద్యోగ సంఘాలు.. సమ్మెకు సిద్ధమని ప్రకటన !
భూములకు సంబంధించి ట్యాంపరింగ్ జరుగుతోందన్న ఫిర్యాదులు చాలా కాలంగా ఉన్నాయని సీఎం తెలిపారు. భూమికి చెందిన నిర్ధిష్టమైన హద్దులు, హక్కులు ఇప్పటివరకు లేవని... శాస్త్రీయ పద్దతుల్లో భూములకు నిర్థిష్టంగా మార్కింగ్ చేసి ప్రతి ఒక్కరికీ ఐడెంటిఫికేషన్ నంబర్ ఇస్తే ల్యాండ్ వివాదాలకు చెక్ పెట్టొచ్చన్న ఉద్దేశంతో ఈ పథకం చేపట్టామన్నారు. దాదాపు రూ.1,000 కోట్ల ఖర్చుతో 4,500 సర్వే బృందాలు, 70 కార్స్ బేస్ స్టేషన్లు, 2 వేల రోవర్లతో అత్యాధునిక సాంకేతికతను వినియోగించి సమగ్ర భూసర్వేను నిర్వహిస్తున్నారు.
Also Read: ఏపీ ఉద్యోగులకు జగన్ సర్కార్ బిగ్ షాక్! డిమాండ్లు పట్టించుకోకుండానే వరుస జీవోలు
సర్వే ప్రతి అడుగులో భూ యజమానులను భాగస్వాములను చేశారు. మండల మొబైల్ మెజిస్ట్రేట్ బృందాల ద్వారా అభ్యంతరాలను పరిష్కరిస్తున్నారు. ప్రతి భూకమతానికి ఉచితంగా భూరక్ష హద్దు రాళ్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. సమగ్ర భూసర్వే పూర్తయిన వాటికి సంబంధించి సింగిల్ విండో పద్ధతిలో ప్రతి ఆస్తికీ ప్రభుత్వ హామీతో కూడిన శాశ్వత భూహక్కు పత్రం జారీ చేస్తున్నారు. శాశ్వత భూహక్కు పత్రం ఉండటం వల్ల ఇకపై భూలావాదేవీలు పారదర్శకంగా జరగడానికి అవకాశం ఉంటుందని.. నకిలీ రిజిస్ట్రేషన్లు జరగవని సీఎం తెలిపారు.
Also Read: Chandrababu Naidu Corona Positive: చంద్రబాబుకు కరోనా పాజిటివ్.. ఇంట్లోనే క్వారంటైన్‌లోకి..
భూ యజమానులకు తెలియకుండా రికార్డుల్లో ఎలాంటి మార్పులు వీలుపడవని.. ఇకపై గ్రామ సర్వేయర్ల ద్వారానే ఎఫ్ లైన్ దరఖాస్తులను 15 రోజుల్లో, పట్టా సబ్ డివిజన్ దరఖాస్తులను 30 రోజుల్లో పరిష్కరిస్తారని ప్రభుత్వం తెలిపింది. భూ సమాచారాన్ని ఎవరైనా, ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా పొందొచ్చు. ప్రభుత్వ హామీతో కూడిన శాశ్వత భూమి హక్కు పత్రం అందడం వల్ల భూములు, ఆస్తులు సురక్షితంగా ఉంటాయని చెబుతున్నారు.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి.