Top 5 Telugu Headlines Today 6 August 2023: 

ఉత్కంఠకు తెర! ఆర్టీసీ బిల్లుకు గవర్నర్ తమిళిసై గ్రీన్ సిగ్నల్, కాసేపట్లో సభలోకి బిల్లురెండు రోజులుగా ఆర్టీసీ బిల్లును గవర్నర్ ఆమోదిస్తారా లేదా అనే ఉత్కంఠకు తెరపడింది. నేడు గవర్నర్‌తో తెలంగాణ ఆర్ అండ్ బీ అధికారులు సమావేశం అయిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం తరఫున రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా గవర్నర్ తో భేటీ అయ్యారు. వారి వివరణ అనంతరం ఆర్టీసీ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపారు. అయితే, కొన్ని సూచనలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి గవర్నర్ ఆమోదం తెలపడంతో ఆర్టీసీ బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి మార్గం సుగమం అయింది. తెలంగాణ ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయడంలో భాగంగా సంబంధిత ఆర్టీసీ బిల్లును గవర్నర్‌కు పంపించారు. మామూలుగా అయితే ముందు అసెంబ్లీలో ప్రవేశపెట్టి అక్కడ పాసైన బిల్లులను గవర్నర్ ఆమోదం కోసం పంపుతారు. కానీ ఆర్థిక బిల్లులకు మాత్రం ముందుగానే గవర్నర్ అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. ఆర్టీసీ విలీనం ఆర్థిక బిల్లు కిందికి వస్తుండడం వల్ల గవర్నర్ వద్దకు వెళ్లింది.  పూర్తి వివరాలు

వచ్చేసారి అసెంబ్లీకి వస్తానో లేదో? ఎమ్మెల్యే రాజాసింగ్ ఆసక్తికర వ్యాఖ్యలుగోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆదివారం సంచలన వాఖ్యలు చేశారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మూడవ రోజైన ఆదివారం మొదలయ్యాయి. ఈ సందర్భగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో గోషామహల్ నుంచి ఎవరు గెలుస్తారో తెలియదన్నరు. తాను మాత్రం తిరిగి అసెంబ్లీకి రాననే నమ్మకం ఉందన్నారు. తనను అసెంబ్లీలో అడుగు పెట్టకుండా తన చుట్టూ చాలా రాజకీయాలు జరుగుతున్నాయని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గంలో పరిస్థితులు అన్నీ మారిపోయాయని, తన సొంత వారు, బయటి వారు తనను గెలవకుండా చేసేందుకు కుట్రలు చేస్తున్నారని వాపోయారు.  పూర్తి వివరాలు

భూమా ఫ్యామిలీలో వారసుల పోరాటం - పోటీకి అందరూ రెడీ మధ్యలో మనోజ్ కూడా !కర్నూలు జిల్లాలో భూమా ఫ్యామిలీ వారసులు రాజకీయ భవిష్యత్ కోసం సిగపట్లు పడుతున్నారు. భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి అకాల మరణాలతో కుటుంబంలో పిల్లలు ఒంటరి  వారయ్యారు. తల్లి మరణం తర్వాత తండ్రి వేలు  పట్టుకుని రాజకీయాలు నేర్చుకున్న  భూమా అఖిలప్రియ, నంద్యాల ఉపఎన్నికల సమయంలో రాజకీయాల్లోకి వచ్చిన భూమా నాగిరెడ్డి అన్న కుమారుడు బ్రహ్మానందరెడ్డిలతో పాటు తాజాగా  జగత్ విఖ్యాత్ రెడ్డి, భూమా మౌనికా రెడ్డిలు కూడా ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కానీ ఎవరికి సీటు అనేది మాత్రం స్పష్టత లేకుండా పోయింది.  పూర్తి వివరాలు

హోంమంత్రి ఎక్కడ! మాటలదాడిలో కనిపించని తానేటి వనిత - ఆఖర్లో ముక్తసరిగా స్పందన!ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన పుంగనూరు ఘటనపై అధికార ప్రతిపక్ష పార్టీల మద్య పెద్ద ఎత్తున వివాదం జరిగింది. దీని పై పోలీసులు, పోలీసుల అధికారుల సంఘం కు చెందిన నాయకులు సైతం రియాక్ట్ అయ్యారు. డీఐజీ అమ్మిరెడ్డి, ఎస్పీ సైతం ప్రెస్ మీట్ పెట్టి మరి, ఘటనపై కారణాలను గురించి వివరణ ఇచ్చారు. కేసులు నమోదు చేయటం, ఘటనకు కారకులయిన వారిపై చర్యలు తీసుకునే విషయాలపై డీఐజీ మీడియాతో మాట్లాడారు. అంతేకాదు విజయవాడ కేంద్రంగా పోలీసు అధికారుల సంఘానికి చెందిన నాయకులు కూడా పుంగనూరు ఘటనలో తెలుగు దేశం పార్టీ వైఖరిని తప్పుబట్టారు. పూర్తి వివరాలు