Bhuma Family :    కర్నూలు జిల్లాలో భూమా ఫ్యామిలీ వారసులు రాజకీయ భవిష్యత్ కోసం సిగపట్లు పడుతున్నారు. భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి అకాల మరణాలతో కుటుంబంలో పిల్లలు ఒంటరి  వారయ్యారు. తల్లి మరణం తర్వాత తండ్రి వేలు  పట్టుకుని రాజకీయాలు నేర్చుకున్న  భూమా అఖిలప్రియ, నంద్యాల ఉపఎన్నికల సమయంలో రాజకీయాల్లోకి వచ్చిన భూమా నాగిరెడ్డి అన్న కుమారుడు బ్రహ్మానందరెడ్డిలతో పాటు తాజాగా  జగత్ విఖ్యాత్ రెడ్డి, భూమా మౌనికా రెడ్డిలు కూడా ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కానీ ఎవరికి సీటు అనేది మాత్రం స్పష్టత లేకుండా పోయింది. 


చంద్రబాబును  భూమా మౌనిక, మంచు  మనోజ్ కలవడంతో కలవరం


ఇటీవల చంద్రబాబును భూమా మౌనికారెడ్డి తన భర్త మంచు  మనోజ్ తో కలిసి చంద్రబాబు వద్దకు వెళ్లారు. తమ ఈ సందర్భంగా వారు రాజకీయాలు మాట్లాడలేదని  మీడియాకు చెప్పారు. కానీ భూమా మౌనికారెడ్డి రాజకీయ జీవితంపై ఆసక్తిగా ఉన్నారని అదే విషయాన్ని చంద్రబాబుతో చెప్పారని అంటున్నారు. భూమా నాగిరెడ్డి చనిపోయిన తర్వాత జరిగిన నంద్యాల ఉపన్నికల్లో భూమా మౌనికారెడ్డి ప్రెగ్నెంట్ గా ఉన్నప్పటికీ  విస్తృతంగా ప్రచారం చేశారు. ధాటిగా మాట్లాడగల సామర్థ్యం ఉండటంతో అందరి దృష్టిని ఆకర్షించారు. శోభానాగిరెడ్డి లేని లోటును భర్తీ చేస్తారని అనుకున్నారు. కానీ తర్వాత వ్యక్తిగత కారణాలతో  రాజకీయాలకు దూరమయ్యారు. మళ్లీ ఇప్పుడు  ఆసక్తి చూపిస్తున్నారు. 


నాకు చావంటే భయం లేదు, ఆనాడు వెంకన్న స్వామే నన్ను కాపాడాడు: శ్రీకాళహస్తిలో చంద్రబాబు


నంద్యాల, ఆళ్లగడ్డ స్థానాలకు  నలుగురు పోటీ ! 


ప్రస్తుతం  నంద్యాల, ఆళ్లగడ్డ స్థానాల్లో భూమా కుటుంబం నంచి ఇద్దరు ఇంచార్జులుగా ఉండగా. టిక్కెట్ల కోసం నలుగురు పోటీ పడుతున్నారు. ఆళ్లగడ్డకు భూమా అఖిలప్రియ ఇంచార్జ్ గా ఉన్నారు. నంద్యాలకు భూమా బ్రహ్మానందరెడ్డి ఇంచార్జ్ గా ఉన్నారు.  ఆళ్లగడ్డలో పోటీకి మౌనికారెడ్డి ఆసక్తి చూపిస్తున్నారని..  నంద్యాలలో పోటీకి..  భూమా వారసుడు జగత్ విఖ్యాత్ రెడ్డి రెడీగా ఉన్నారు.  ఆయన నంద్యాలలోపర్యటిస్తున్నారు. తన సోదరుడు బ్రహ్మానందరెడ్డి గురించి పట్టించుకోకుండానే తిరుగుతున్నారు. తనకు పోటీ చేసే ఆసక్తి ఉందని.. స్పష్టం చేస్తున్నారు. దీంతో భూమా ఫ్యామిలీలో టిక్కెట్లో కంస రచ్చ జరుగుతుందేమో అన్న ఆందోళన టీడీపీ క్యాడర్‌లో కనిపిస్తోంది.                   


రాజకీయ నేతలతో చేతులు కలిపి సమిధలు కావొద్దు - పోలీసులకు చంద్రబాబు సూచన !


వారసుల మధ్య ఆస్తుల వివాదాలు  కూడా ఉన్నాయని ప్రచారం            


భూమా వారసుల మధ్య ఆస్తుల వివాదాలు కూడా ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది. కానీ ఆ వార్తలను వారు ఖండిస్తున్నారు. అయితే రాజకయంగా మాత్రం కలిసి నడవకపోవడం ఎవరి రాజకీయ భవిష్యత్ ను వారు చూసుకోవాలనే ప్రయత్నాల్లో ఉండటం మాత్రం..  భూమా అభిమానులకుఇబ్బంది కలిగించేదే. టీడీపీ అధినేత చంద్రబాబు భూమా కుటుంబ సభ్యులనూ పరిష్కరించాల్సి ఉంది. లేకపోతే.. అవి ఆధిపత్య పోరాటానికి దారి తీసే అవకాశం ఉంది.