Chandrababu : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ప్రాజెక్టుల యాత్ర కొనసాగుతోంది. రేణిగుంట వై కన్వెన్షన్ హాల్ లో సాగునీటి ప్రాజెక్టులపై యుద్దభేరి ప్రజెంటేషన్ ఇచ్చారు.
రాయలసీమను రాళ్ళ సీమగా చేశారని.. వైసీపి నాయకులు దౌర్జన్యాలు చేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. దౌర్జన్య కాండలో పోలీసులు సమిధలు కావొద్దని సూచించారు. కొంత మంది రాజకీయ నాయకులతో చేతులు కలిపి అపహాస్యం పాలు కావద్దని సూచించారు. తాను ఇక్కడే పుట్టా, ఇక్కడే పెరిగా, ఇక్కడే రాజకీయం చేశానని.. ఎక్కడా నాపై జరగని దాడి జిల్లాలో జరిగిందన్నారు.
గోదావరిలో పుష్కలంగా నీరున్నా నిర్లక్ష్యం
వైసీపి నాయకులకు భయం పెరిగిందని.. ఐదు సంవత్సరాలు తీరని అన్యాయం చేశారని మండిపడ్డారు. త్రాగునీరుపై ప్రజల్లో చైతన్యం కలిగించాలని కృషి చేస్తున్నానని.. వంశదార, గోదావరి, కృష్ణ, పెన్నా ఆల్ మండీ ఐదు నదులు ఉన్నాయన్నారు. గోదావరిలో పుష్కలంగా నీళ్ళు ఉన్నాయని.. ఆ నీళ్ళు సక్రమంగా వాడుకుంటే ఎంతో ఉపయోగపడుతుందన్నారు. నాగావళి , వంశధార అనుసంధానం తానే ప్రారంభించానని గుర్తు చేశారు. పోలవరంలో పట్టుసీమ అనుసంధానం చేస్తామన్నారు. 120 టిఎంసీల నీటిని రాయలసీమకు ఇస్తున్నామని.. కృష్ణ డెల్టా, నాగార్జున సాగర్ లో నీటిని ఆదా చేశామన్నారు. నాగార్జున సాగర్ లెప్ట్ మెతిన్ కెనాల్ ఖమ్మం నుండి నూజివీడుకి నీళ్లు వస్తాయన్నారు.
శ్రీకాళహస్తిలో ప్రసంగం
పర్యటనలో భాగంగాఈ రోజు శ్రీకాళహస్తిలో చంద్రబాబు సభలో ప్రసంగించనున్నారు. చంద్రబాబు పర్యటనను పురస్కరించుకుని టీడీపీ నేతలు శ్రీకాళహస్తిలో భారీగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే చంద్రబాబు పర్యటన ఉండగా ఫ్లెక్సీలను తొలగించేందుకు మున్సిపల్ సిబ్బంది ప్రయత్నించారు. విషయం తెలిసిన టీడీపీ నేతలు మున్సిపల్ సిబ్బందిని అడ్డుకున్నారు. ఫ్లెక్సీలు తొలగించవద్దని వారిని అడ్డుకొని వాగ్వివాదానికి దిగారు. అనుమతి తీసుకుని ఫ్లెక్సీలను ఏర్పాటు చేసినప్పటికీ వాటిని తొలగించేందుకు మున్సిపల్ కమిషనర్ ఆదేశాలు ఇవ్వడం ఏంటని టీడీపీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు.
సాయంత్రం నెల్లూరు జిల్లాకు చంద్రబాబు
త్తూరులో పర్యటన ముగిసిన అనంతరం ఈరోజు నెల్లూరు జిల్లాలో చంద్రబాబు పర్యటించనున్నారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నుంచి నాయుడుపేట, గూడూరు మీదుగా ఈరోజు సాయంత్రం నెల్లూరుకు బాబు చేరుకోనున్నారు. నగరంలోని కస్తూర్భా గార్డెన్స్‌లో యుద్ధభేరి కార్యక్రమంలో భాగంగా సమావేశం నిర్వహించనున్నారు. రిటైర్డ్ ఇంజనీర్లు, ప్రముఖులు, రైతులతో చంద్రబాబు సమావేశంకానున్నారు. కస్తూర్బా గార్డెన్స్‌లోనే రాత్రి బస చేసి... ఆదివారం రోడ్డు మార్గాన ప్రకాశం జిల్లాకు చంద్రబాబు వెళ్లనున్నారు.