Chandrababu At Srikalahasti: తిరుపతి : వైఎస్ వివేకానంద రెడ్డి లాగ గొడ్డలితో హత్యచేస్తే చచ్చేందుకు ఇక్కడ ఎవడు సిద్ధంగా లేడని, మర్యాదగా ఉంటే మర్యాదగా ఉంటా అని వైసీపీ శ్రేణులను హెచ్చరించారు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు. సిగ్గులేని నాయకులు బంద్‌కు పిలుపు‌నిస్తారా అన్నారు. పుంగునూరు పుడింగి చెప్తే నువ్వు నమ్ముతావా డిఐజీ, ఎప్పుడు నా ప్రాణానికి భయపడలేదని, ప్రజల కోసమే పనిచేశా అన్నారు. గుమ్మడికాయ దొంగ అంటే బియ్యపు మధుసూదన్ రెడ్డి భుజాల తడుముకుంటారని, గోపాలకృష్ణారెడ్డి బతికున్నంతవరకు బియ్యపురెడ్డిని ఎప్పుడైనా, ఎవరైనా చూశారా.. బొజ్జల ఫ్యామిలీకి బియ్యపు రెడ్డి ఫ్యామిలీకి పోలిక ఉందా అన్నారు. 


శ్రీకాళహస్తిలో సాగు నీటి విధ్వంసంపై యుద్దభేరిలో శనివారం చంద్రబాబు ప్రసంగించారు. తనపై జరిగిన మీద దాడి ప్రజాసామంపై, ప్రజలపై దాడి లాంటిదని, పరిస్థితి ఇలాగే ఉంటే ఆంధ్రప్రదేశ్ నార్త్ కొరియా, తెలంగాణ సౌత్ కొరియాల తయారవుతుందన్నారు. చాలా సార్లు శ్రీకాళహస్తికి వచ్చాను.. 45 ఏళ్లగా ఇక్కడ మీటింగ్ పెట్టాను కానీ గతంలోల తనను ఎవరూ అడ్డుకోలేదన్నారు. శ్రీకాళహస్తి ప్రజల ఉత్సాహం చూస్తుంటే ఎప్పుడు ఎప్పుడు ఎన్నికలు వస్తాయా అని ఎదురుచూస్తున్నారని, బియ్యపురెడ్డిని ఎక్కడకు పంపించాలో నిర్ణయించుకోవాలన్నారు. నమ్మకానికి మారుపేరు గోపాలకృష్ణారెడ్డి అని, ఎస్వీ యూనివర్సిటీ నుంచి తనకు పరిచయం ఉందన్నారు. గోపాలకృష్ణారెడ్డి ఐటీ మంత్రిగా ఉన్నప్పుడే మొట్టమొదటిసారి హైటెక్ సిటీ కట్టాం అన్నారు.


జిల్లాలో ఎక్కువ చెరువులు ఉండే నియోజకవర్గం శ్రీకాళహస్తి నియోజకవర్గం. అన్ని గొలుసు కొట్టు చెరువులు ఒక్క చెరువు తెగితే అన్ని చెరువులు తెగిపోతాయి.. మళ్లీ ఆ చెరువులను మరమ్మతులు చేసే లోపే అన్ని నీళ్లు వెళ్లిపోయే పరిస్థితి ఉందన్నారు. మొన్నే కావేరీ నీటి కోసం కర్ణాటక,‌ తమిళనాడు రాష్ట్రాలు పోరాడే పరిస్థితి వచ్చింది. ఎన్టీఆర్ మొట్టమొదటి సారి సీఎం అయినప్పుడే రాళ్ల సీమ గా మారిన రాయలసీమకు నీళ్లు ఇవ్వాలని కంకణం కట్టారు. రాయలసీమకు కాలువ ద్వారా నీరు అందించిన తర్వాతే తమిళనాడుకు ఎన్టీఆర్ నీళ్లు ఇచ్చారని గుర్తుచేశారు. ఎన్టీఆర్ ఆధ్వర్యంలోనే గాలేరు- నగరి, హంద్రీనీవా రాయలసీమకు ఒక వరప్రదాయని అన్నారు.


కోకాపేట లాగే ఏపీలో చేయాలనుకున్నాను.. కానీ!
కోడూరు నుండి గాలేరు-నగరి రేణిగుంట మండలంకు వస్తోంది. సోమశిల నుండి లిఫ్ట్ పెట్టి స్వర్ణముఖికి నీళ్లు తీసుకువచ్చాం. ముందుగా బాలాజీ రిజర్వాయర్ కు నీళ్లు వచ్చి ఆ తర్వాత మళ్లీమడుకు నీళ్లు వస్తాయన్నారు. తెలుగు గంగ నుండి నీళ్లు తీసుకువచ్చి శ్రీకాళహస్తికి ఇచ్చాం, తొండమనాడు చెరువుకి నీళ్లు ఇచ్చామన్నారు. కోకాపేటలో ఒక ఎకరా భూమి కోట్లు పలుకుతోందని, ఇక్కడ అదే చేయాలనుకున్నానని.. కానీ జనాలు సైకోకు ఓట్లు వేయడంతో భూమి విలువ బాగా పడిపోయిందని సెటైర్లు వేశారు. 


సెల్ ఫోన్లు తీసుకొచ్చింది, టెక్నాలజీనీ ప్రమోట్ చేసింది టిడిపి పార్టీనేనని చెప్పారు. ఢిల్లీ, గురుగ్రామ్ తర్వాత ఎక్కువ సెల్ఫోన్ తయారీ కేంద్రాలను రేణిగుంటకు తీసుకొచ్చానన్నారు. శ్రీ సిటీలో ఇండస్ట్రీస్, హీరో మోటార్స్, రిపబ్లిక్ ఫీవర్, అపోలో టైర్స్, అనంతపురంలో కియా మోటార్స్ ను తీసుకు వచ్చిన ఘనత టిడిపిదే అన్నారు చంద్రబాబు. తాను తీసుకొచ్చిన సంస్థల నుంచి ఎమ్మెల్యే బియ్యపురెడ్డి వసూళ్లకు పాల్పడుతున్నారని, అలాంటి వ్యక్తికి ఎమ్మెల్యే అయ్యే అర్హత ఉందా అని ప్రశ్నించారు.


సాక్షాత్తు వెంకన్న స్వామి నన్ను కాపాడాడు
వైసీపీ నేతల అవినీతిని ప్రశ్నించాననే అంగళ్ళుల్లో తనపై దాడికి వచ్చారని, వైసిపి నాయకులు దాడి చేస్తుంటే టిడిపి కార్యకర్తలు ప్రతిఘటించారు.. పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారని చంద్రబాబు ఆరోపించారు. 2003లో తిరుపతిలో తీవ్రవాదులతో పోరాడితే నాపై హత్యా ప్రయత్నం చేశారు.. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడాడు.. ఎందుకంటే నా అవసరం రాష్ట్రానికి ఉందన్నారు. 


ముఠా నాయకుల అంతు చూసు రాయలసీమలో శాంతిని తీసుకొచ్చా.. రాయలసీమలో సిరులు పండించాలన్నదే నా సంకల్పం. గోదావరి నీళ్లు రాయలసీమకు తీసుకువచ్చి మీ రుణం తీర్చుకుంటా. పోలీసులను క్రైమ్స్ లో పార్ట్ నర్స్‌ను చేయాలని వైసీపీ నేతలు చూస్తున్నారని, పోలీసు సిబ్బందికి టిఏలు‌ ఇచ్చారా అని ప్రశ్నించారు. కానీ నన్ను కొట్టేందుకు లాఠీ ఇచ్చారంటూ సెటైర్లు వేశారు. పోలీసులు మనస్సాక్షితో పని చేయాలని, తప్పు చేసిన వారిని ఎవరిని వదిలిపెట్టను. వ్యవస్థలను నాశనం చేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి.. దుర్మార్గుడికి అధికారం ఇస్తే మీ ఆస్తి కూడా మీకు ఉండదు జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు చంద్రబాబు సూచించారు.