Top 5 Telugu Headlines Today 28 October 2023: 


చంద్రబాబును చంపేస్తామని బాహాటంగానే చెబుతున్నారు - కక్షతోనే అరెస్ట్ చేశారన్న లోకేశ్
టీడీపీ అధినేత చంద్రబాబును వ్యక్తిగత కక్షతోనే వైసీపీ ప్రభుత్వం అరెస్ట్ చేయించిందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. రాజమండ్రి జైలులో శనివారం చంద్రబాబుతో ములాఖత్ అనంతరం ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో వ్యక్తిగత కక్ష సాధింపులు ప్రత్యక్షంగా చూస్తున్నామని అన్నారు. చంద్రబాబును అరెస్ట్ చేసి నేటికి 50 రోజులు పూర్తైందని, ఆయన ఏ తప్పూ చేయకపోయినా కక్షతోనే అరెస్ట్ చేయించి ప్రజల మధ్యకు రానీయకుండా కుట్ర పన్నారని ఆరోపించారు. 'రాజకీయ ప్రత్యర్థులు ఓడిపోయేందుకు కష్టపడడం సహజమే. కానీ చంద్రబాబు చనిపోవాలి. ఆయన్ను చంపేస్తామని బాహాటంగానే వైసీపీ నేతలు చెబుతున్నారు.' అంటూ లోకేశ్ వ్యాఖ్యానించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


'తలసరి ఆదాయంలో తెలంగాణే నెం.1' - తొమ్మిదేళ్లలో కరువు, కర్ఫ్యూ లేవన్న మంత్రి కేటీఆర్
తలసరి ఆదాయంలో తెలంగాణ దేశంలోనే నెంబర్ 1గా నిలిచిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో శనివారం ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో కరువు, కర్ఫ్యూ లేవని, వృద్ధి రేటులో తెలంగాణ ఐదో స్థానంలో నిలిచిందని ప్రశంసించారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారన్న ప్రతిపక్షాల ఆరోపణలను ఆయన ఖండించారు. తెచ్చిన రుణాలను సాగునీరు, మిషన్ భగీరథ, విద్యుత్ రంగంలో సంస్కరణలు, సంపద సృష్టి కోసం వినియోగించినట్లు వివరించారు. దేశంలో మూడో వంతు ఉద్యోగాలు హైదరాబాద్ నుంచే వచ్చాయన్న కేటీఆర్, రాబోయే ఎన్నికల్లో గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


ఇటలీకి పవన్ - తెలంగాణ బీజేపీతో పొత్తులు లేనట్లేనా ?
తెలంగాణలో జనసేన, బీజేపీ పొత్తులపై సస్పెన్స్ కొనసాగుతోంది. కిషన్ రెడ్డి, పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లి అమిత్ షాతో అర గంట సేపు చర్చలు జరిపినా క్లారిటీ రాలేదు. ఎన్ని  సీట్లు కేటాయిస్తారు.. ఏఏ సీట్లు ఇస్తారన్నదానిపై రెండు పార్టీల మధ్య అసలు సంప్రదింపులు జరగడం లేదు. మరో వైపు తన సోదరుడు నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ పెళ్లి ఇటలీలో జరుగుతూండటంతో  కుటుంబసమేతంగా పవన్  కల్యాణ్ ఆ పెళ్లి కోసం ఇటలీ వెళ్లిపోయారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పెళ్లి కార్యక్రమాలు నాలుగు రోజుల పాటు జరగనున్నాయి. ఒకటో తేదీన పెళ్లి జరుగుతుంది. రెండో తేదీన పవన్ కల్యాణ్ తిరిగి  వచ్చే అవకాశం ఉంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి



ఏపీలో ఎన్నికల సమరానికి సన్నాహాలు- ఓటర్ల జాబితాలో మీ పేరుందా?, చెక్ చేసుకోండిలా!
తెలంగాణ సహా 5 రాష్ట్రాల్లో ఎన్నికలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయగా ఇప్పుడు ఏపీలోనూ సాధారణ ఎన్నికల సమరానికి సన్నాహాలు మొదలయ్యాయి. రాష్ట్రంలో 2024, మార్చిలో సాధారణ ఎన్నికల నిర్వహించే అవకాశం ఉందని ఆ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనా తెలిపారు. శుక్రవారం డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను విడుదల చేశారు. మొత్తం ఓటర్ల సంఖ్య 4,02,21,450 ఉండగా, కొత్తగా ఓటర్ల చేరిక, మరణించిన వారి పేర్ల తొలగింపు, ఓ నియోజకవర్గం నుంచి మరో చోటుకు బదిలీ వంటి ప్రక్రియ అనంతరం పూర్తి స్థాయి జాబితాను 2024, జనవరి 5న విడుదల చేస్తామని చెప్పారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


రెండో లిస్ట్‌తో కాంగ్రెస్‌లో అసంతృప్తుల లొల్లి, విష్ణు, నగేష్ రెడ్డి, ఎర్ర శేఖర్ కార్యకర్తలతో సమావేశం
కాంగ్రెస్ పార్టీ 45 మంది అభ్యర్థులతో రెండో జాబితాను ప్రకటించింది. ఇందులో పాత కొత్త నేతలకు సీట్లు కేటాయించింది. కాంగ్రెస్ పార్టీలో మొదలైన అసంతృప్తుల లొల్లి షురూ అయింది. అందరూ ఊహించినట్లే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మునుగోడు టికెట్ దక్కింది. ఎల్బీ నగర్ టికెట్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ రెడ్డికి కేటాయించింది. పలువురు నేతలు హస్తం పార్టీ తరపున పోటీ చేసేందుకు ఆసక్తి చూపించారు. కొందరికి టికెట్ దక్కగా, మరికొందరికి నిరాశే ఎదురైంది.  నిజామాబాద్ రూరల్ నుంచి హీరో నితిన్ మామ నగేష్ పోటీ చేయాలని భావించారు. కాంగ్రెస్ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి