Top 5 Telugu Headlines Today 28 August 2023:
అధిక ఫీజులు వసూలు చేస్తే 1902 కాల్ చేయండి- తల్లిదండ్రులకు సీఎం జగన్ సూచన
పిల్లల చదువులు కారణంగా తల్లిదండ్రులు అప్పులు పాలు కాకూడదనే విద్యాదీవెన లాంటి కార్యక్రమం తీసుకొచ్చామన్నారు సీఎం జగన్. చిత్తూరు జిల్లా నగరిలో విద్యాదీవెన పథకం నిధుల విడుదల కార్యక్రమంలో మాట్లాడారు. గతంలో ఎప్పుడూ చేయని విధంగా తమ హయాంలో పిల్లల చదువుపై ఫోకస్ పెట్టామన్నారు జగన్. విద్యార్థుల చదువులు తల్లిదండ్రులకు సమస్య కాకూడదన్న కారణంతో విద్యా దీవెన పథకాన్ని తీసుకొచ్చి ప్రతి 3నెలలకోసారి డబ్బులు జమ చేస్తున్నామని చెప్పారు సీఎం జగన్. పిల్లల తల్లుల ఖాతాల్లో నేరుగా ఈ డబ్బులు పడుతున్నాయని తెలిపారు. నేరుగా వాళ్లే వెళ్లి కళాశాలల ఫీజులు చెల్లించి తమ పిల్లల చదువులపై ఆరా తీయాలన్నారు. పూర్తి వివరాలు
ఎన్టీఆర్‌కు మరో అరుదైన గౌరవం- శకపురుషుడి పేరుతో రూ.100 నాణెం విడుదల
నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాల సందర్భంగా మరో అదురై దృశ్యం సాక్షాత్కారమైంది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఎన్టీఆర్ ముఖ చిత్రం ఉన్న వంద రూపాయల నాణేన్ని విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులందరూ హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం ఆహ్వానం మేరకు నందమూరి కుటుంబ సభ్యులంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్టీఆర్‌తో పరిచయం ఉన్న పలువురు ప్రముఖులు సైతం కార్యక్రమానికి హాజరయ్యారు. షూటింగ్‌లో బిజీగా ఉన్నందున జూనియర్ ఎన్టీఆర్, పాదయాత్రలో ఉన్నందున లోకేష్ హాజరుకాలేదు. ఈ సందర్భంగా ఎన్‌టీఆర్ కుమార్తె, ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాలు
కాంగ్రెస్‌ది డిక్లరేషన్ సభ కాదు-ఫ్రస్ట్రేషన్ సభ : కేటీఆర్
చేవెళ్ల కాంగ్రెస్ సభ తర్వాత... బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం జరగుతోంది. ఎస్సీ, ఎస్టీలకు డిక్లరేషన్ పేరుతో 12 హామీలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొస్తే.. దళిత, గిరిజనులకు న్యాయం జరుగుతుందని... సభా వేదికపై నుంచి విజ్ఞప్తి చేశారు కాంగ్రెస్ నేతలు. పదో తరగతి నుంచి పీహెచ్‌డీ పూర్తి చేసిన విద్యార్థులు నగదు ప్రోత్సాహం కూడా ప్రకటించారు. దళిత, గిరిజనులకు బీఆర్‌ఎస్ ప్రభుత్వం అన్యాయం చేసిందని... కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే వారికి న్యాయం జరుగుతుందని అన్నారు. అయితే, కాంగ్రెస్ డిక్లరేషన్ సభపై బీఆర్‌ఎస్ నేతలు మండిపడుతున్నారు. దీనిపై మంత్రి కేటీఆర్ కూడా స్పందించారు. పూర్తి వివరాలు
కాంగ్రెస్‌కు చావో రేవో- అధికారమే లక్ష్యంగా పావులు- వచ్చే నెలలో మ్యానిఫెస్టో
మూడే మూడు నెలలు. తెలంగాణ కాంగ్రెస్‌కు చావో రేవో. వచ్చే ఎన్నికల్లో గెలిస్తేనే రాష్ట్రంలో హస్తం గుర్తు ఉనికిలో ఉంటుంది. లేకపోతే తెలంగాణ రాష్టంగా ఇచ్చిట్లు చెప్పకుంటున్న కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోయే ప్రమాదంలో ఉంది. అందుకే ఎలాగైనా అధికారాన్ని దక్కించుకునేందుకు టి.కాంగ్రెస్ శత విధాల ప్రయత్నాలు చేస్తోంది. వరసగా హామీలు గుమ్మరిస్తోంది. కర్ణాటక తరహాలో ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది. తన కార్యాచరణను అమలు చేస్తోంది. పూర్తి వివరాలు
పురందేశ్వరిని తరిమికొట్టే వరకు పోరాడుతా- నాణెం విడుదలకు పిలవకపోవడంపై లక్ష్మీపార్వతి ఆగ్రహం
రాష్ట్రం నుంచి పురందేశ్వరిని తరమికొట్టే వరకు వైసీపీ తరఫున పోరాటం చేస్తానన్నారు వైసీపీ నేత లక్ష్మీపార్వతి. ఎన్టీఆర్ నాణెం విడుదల కార్యక్రమానికి ఆమెను ఆహ్వానించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ తనను అధికారికంగా వివాహం చేసుకున్నారని చెప్పుకొచ్చారు. తనను ఇల్లీగల్‌గా పెట్టుకోలేదని తీవ్రంగా మండిపడ్డారు. దీనిపై ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు స్పందించాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ ఫ్యామిలీలోని సొంత కార్యక్రమం అయితే తనను ఆహ్వానించకపోయినా పట్టించుకునేదాన్ని కాదన్నారు లక్ష్మీపార్వతి. ఇది ప్రభుత్వ కార్యక్రమం అని అన్నారు. పూర్తి వివరాలు