Bengaluru Crime:


బెంగళూరులో ఘటన... 


బెంగళూరులో ఓ 29 ఏళ్ల యువకుడు లివిన్ పార్ట్‌నర్‌ని కుక్కర్‌తో కొట్టి చంపాడు. ఈ నెల 26న ఈ ఘటన జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. తనను మోసం చేసే వేరే వ్యక్తితో యువతి చనువుగా ఉంటోందని అనుమానం పెంచుకున్నాడు యువకుడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య చాలా రోజులుగా వాగ్వాదం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఆగ్రహంతో ప్రెజర్ కుక్కర్‌తో గట్టిగా యువతిని కొట్టాడు. అక్కడికక్కడే ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ ఇద్దరూ కేరళకు చెందిన వాళ్లే. దాదాపు రెండేళ్లుగా బెంగళూరులో ఓ ఇంట్లో అద్దెకి ఉంటున్నారు. కాలేజ్‌ రోజుల నుంచే ఇద్దరికీ పరిచయం ఉంది. కోరమంగళలోని ఒకే కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. అయితే...తనతో సహజీవనం చేస్తూ వేరే వ్యక్తితో చనువుగా ఉంటోందన్న కోపంతో గొడవకు దిగాడు నిందితుడు వైష్ణవ్. మాటామాట పెరిగింది. కుక్కర్‌తో గట్టిగా కొట్టాడు. మృతురాలి ఫోన్ స్విచ్ఛాప్ రావడం వల్ల ఆమె సోదరి కంగారు పడింది. ఇంటికి వెళ్లి చూసింది. అక్కడా కనిపించకపోవడం వల్ల పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు వచ్చాక ఈ దారుణం వెలుగు చూసింది. యువతిని చంపిన తరవాత నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. అన్ని చోట్లా గాలించిన పోలీసులు చివరకు అరెస్ట్ చేశారు. వీళ్లిద్దరూ లివిన్‌లో ఉన్నారని తల్లిదండ్రులకు కూడా తెలుసని వెల్లడించారు పోలీసులు. వాళ్ల మధ్య గొడవలు జరుగుతున్నాయని తెలిసినా పట్టించుకోలేదని, అదే ఈ హత్యకు దారి తీసిందని చెప్పారు. స్థానికులు కూడా ఈ జంట పదేపదే గొడవ పడేదని చెబుతున్నారు. 


ఢిల్లీలోనూ దారుణం..


దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన వెలుగు చూసింది. తనతో సహజీవనం చేసిన ప్రియుడిపై ఓ ప్రియురాలు పగ పెంచుకుంది. ఎవరూ లేని సమయంలో ఇంటికి వెళ్లి అతని 11 ఏళ్ల కొడుకును దారుణంగా హతమార్చింది. వివరాలు.. ఢిల్లీకి చెందిన పూజా కుమారి అనే 24 ఏళ్ల యువతికి జితేందర్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. జితేందర్‌కు ఇది వరకే పెళ్లై భార్యా పిల్లలు ఉన్నారు. 2019 నుంచి పూజా కుమారి, జితేంద్ర మూడేళ్లు సహజీవనం చేశారు. ఆ తర్వాత పూజను వదిలేసి జితేంతర్ తన భార్య వద్దకు వెళ్లిపోయాడు. ఈ క్రమంలో జితేందర్‌‌ను కలిసేందుకు పూజా కుమారి శతవిధాలుగా ప్రయత్నించింది. అయితే అతని గురించి ఏమీ తెలియకపోవడంతో తనను వదిలి వెళ్లిపోయాడని పగ పెంచుకుంది. ఎలాగైనా అతన్ని కలవాలని ప్రయత్నాలు చేస్తూ వచ్చింది. చివరకు ఓ కామన్ ఫ్రెండ్‌ ద్వారా ఆగస్ట్ 10న జితేందర్ ఇంటి అడ్రస్ తెలుసుకుంది. జితేందర్‌ను నిలదీయాలని అక్కడకు వెళ్లింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. తలుపులు తెరిచే ఉన్నాయి. జితేందర్ కొడుకు దివ్యాంష్‌ బెడ్ మీద పడుకుని ఉన్నాడు. కోపం మీద ఉన్న పూజ ఇదే అదనుగా భావించి దివ్యాంష్‌ గొంతు కోసి చంపేసింది. ఆ తర్వాత దుస్తుల్లో బాలుడి డెడ్ బాడీని ఒక బాక్స్ లో దాచి పెట్టి బయటకు తీసుకొచ్చింది. 


Also Read: Vistara Flight: రెండేళ్ల చిన్నారికి గుండెపోటు, ఫ్లైట్‌లోనే CPR చేసి బతికించిన ఢిల్లీ ఎయిమ్స్ డాక్టర్లు