ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సైకిల్ సిద్ధం- అడ్డం వస్తే తొక్కుకుంటూ పోతాం: చంద్రబాబు
రాజమహేంద్రవరంలో జరుగుతున్న మహానాడే.. చరిత్రను తిరగరాసే రోజు అని టీడీపీ అధినేత చంద్రబాబు అభివర్ణించారు. ఈ సందర్భంగా తిరిగి రాష్ట్రాన్ని కాపాడటానికి, దేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపాలన్న సంకల్పం తీసుకుంటున్నామని వ్యాఖ్యానించారు. ఈసారి జరిగే మహానాడు చాలా ప్రత్యేకమని బాబు అన్నారు. ఎన్టీ. రామారావు శతజయంతి ఉత్సవాల వేళ జరుగుతున్న ఈ పసుపు పండగకు విశిష్టత ఉందని తెలిపారు. ఎన్నడూ చూడని ఉరకలేసే ఉత్సాహాన్ని ఈ మహానాడులో చూస్తున్నట్లు పేర్కొన్నారు. మామూలుగా కొద్దిగా సహకరించినా.. టీడీపీ శ్రేణులం ముందుకు వెళ్తామని, అడ్డం వస్తే మాత్రం తొక్కుకుంటూ పోతామని అన్నారు చంద్రబాబు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
తెలంగాణ హైకోర్టులో అవినాష్‌కు ఊరట
వివేక హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఆయన్ని బుధవారం వరకు అరెస్టు చేయొద్దని ఆదేశించింది. సుదీర్ఘ వాదనలు విన్న హైకోర్టు మధ్యంతర తీర్పు వెల్లడించింది. తుది తీర్పు బుధవారం చెప్పబోతున్నట్టు తెలిపింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
ఏపీలో జనంలోకి వెళ్తున్న బీజేపీ - వరుస కార్యక్రమాలు ! బలోపేతం అవుతారా ?
వైసీపీ సర్కారు వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండ గట్టేందుకు జిల్లాల వారీగా బీజేపీ కార్యాచరణ రూపొందించుకుంది. ఓ వైపు ప్రభుత్వ వైఫల్యాల ను ఎండగడుతూనే..రాష్ట్ర అభివృద్ధిలో ప్రధాని మోడీ పాత్రను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. ఇప్పటికే ప్రభుత్వ వైఫ ల్యాలు, ప్రజా ప్రతినిధుల అవినీతిపై చార్జిషీటు కార్యక్రమాన్ని చేపట్టారు. పలు జిల్లాల్లో ప్రజలను భాగస్వాములను చేసి అభి యోగపత్రాల నమోదు కార్యక్రమాన్ని ఉధృతంగా నిర్వహిం చారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేస్తోందంటూ పెద్ద ఎత్తున ఉద్యమించేందుకు బీజేపీ సిద్ధమవుతోంది. మరో వైపు నరేంద్ర మోడీ తొమ్మిదేళ్ల పాలనలో ఏపీకి చేసిన సాయం ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. ఇందుకోసం ఈ నెల 30 నుంచి నెల రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
హైదరాబాద్‌లో కేసీఆర్‌తో కేజ్రీవాల్ చర్చలు, కేంద్రంపై పోరాటానికి మద్దతివ్వాలని రిక్వస్ట్
కేంద్ర ప్రభుత్వంపై ప్రత్యక్ష పోరుకు సిద్ధమైన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కాసేపట్లో తెలంగాణ సీఎం కేసీఆర్‌తో సమావేశం కానున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ప్రతిపక్షాల మద్దతును కేజ్రీవాల్ కూడగడుతున్నారు. ఇప్పటికే మమత, నితీష్‌తో సమావేశమై చర్చించారు. ఇప్పుడు సీఎం కేసీఆర్‌తో చర్చలు జరపబోతున్నారు. ఢిల్లీలో సర్వాధికారాలు లెఫ్టినెంట్ గవర్నర్‌కు కట్టబెడుతూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. దీనికి వ్యతిరేకంగా కేజ్రీవాల్ దేశవ్యాప్తంగా విపక్షాల మద్దతును కూడగడుతున్నారు. ఇందుకోసం హైదరాబాద్ చేరుకున్నారు. పంజాబ్ సీఎం భగవంత్‌మాన్‌తో కలిసి సీఎంను కలవనున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
టీడీపీ మహానాడు ఎప్పుడు ప్రారంభమైంది- రాజమండ్రి సెంటిమెంట్ ఏంటీ?
రాజమండ్రి వేమగిరి వద్ద తెలుగుదేశం పార్టీ చేపట్టిన మహానాడు కార్యక్రమం సర్వాంగ సుందరంగా, అంగరంగ వైభవంగా, కనీవినీ ఎరుగని రీతిలో ముస్తాబు చేసింది టీడీపీ. ఈసారి ప్రతినిధుల సభ, బహిరంగ సభ వేర్వేరుగా ఏర్పాటు చేశారు. మహానాడు తొలిరోజు ప్రతినిధుల సభ ఉంటుంది. ఈ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి, తెలంగాణ నుంచి ముఖ్యనాయకులు, ప్రతినిధులు హాజరవుతారు. ప్రతినిధుల సభకు 15,000 మందిని ఆహ్వానించారు. ఆదివారం జరిగే భారీ బహిరంగ సభకు 15 లక్షల మంది జనం వస్తారని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి