Top Headlines In AP And Telangana:
1. సీఎం పదవిపై పవన్ కల్యాణ్ ఆసక్తికర కామెంట్స్
ప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ కల్యాణ్(Pawan Kalyan) పూర్తి స్థాయిలో ఇచ్చిన ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఇంటర్వ్యూలో చివరి ప్రశ్నకు ఆయన మరింత ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. ఇంతకీ ఆ చివరి ప్రశ్న ఏంటి..? పవన్ దానికి ఎలాంటి సమాధానం ఇచ్చారు..? ఆ సమాధానం కూటమి రాజకీయాలపై ప్రభావం ఏమైనా చూపిస్తుందా..? మీరే చదవండి. మీ పార్టీలో చాలామంది నాయకులు, కార్యకర్తలు మిమ్మల్ని తర్వాతి స్థానంలో అంటే.. సీఎం సీటులో చూడాలనుకుంటున్నారు. భవిష్యత్తులో అది సాధ్యమేనా..? అని అడిగిన ప్రశ్నకు పవన్ కల్యాణ్ ఏమాత్రం తడబాటు లేకుండా సమాధానమిచ్చారు. ఇంకా చదవండి.
2. తన ప్రెస్ మీట్ అంతా వినాలని జగన్ పిలుపు
తిరుమల(Tirumala) పర్యటన రద్దుపై జగన్(Jagan) నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. అయితే ఆ ప్రెస్ మీట్ వీడియోని అందరూ విననాలంటూ బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, శివసేన.. ఇలా దేశవ్యాప్తంగా ఉన్న పార్టీలను ట్యాగ్ చేస్తూ ఆయన ఓ ట్వీట్ వేశారు. ఆమధ్య ప్రధాని నరేంద్రమోదీ(Modi)కి లేఖ రాసి.. ఆ లేఖ ప్రతుల్ని అందరూ చదవాలంటూ ఇతర పార్టీలను, నేషనల్ మీడియాని కూడా జగన్ ట్యాగ్ చేశారు. ఇప్పుడు తన ప్రెస్ మీట్ వినండి అంటూ అన్ని పార్టీలను ఆయన కోరారు. ఇంకా చదవండి.
3. ఏపీ ప్రభుత్వానికి షర్మిల సూచన
గనుల దోపిడీకి పాల్పడిన వారికి అండగా ఉన్నారని ప్రధాన పాత్ర పోషించారని వెంకట్ రెడ్డి అనే అధికారిని ఏసీబీ అరెస్టు చేసింది. ఆయనకు కోర్టు రిమాండ్ విధించింది. ఆయన్ని కస్టడీలోకి తీసుకొని విచారించేందుకు ఏసీబీ ప్రయత్నం చేస్తోంది. ఇంతలో ప్రభుత్వానికి కాంగ్రెస్ పీసీసీ చీఫ్ షర్మిల కీలక సూచనలు చేశారు. పట్టుకోవాల్సింది చిన్న చిన్న వ్యక్తుల్ని కాదని పెద్ద పెద్ద వారిపై ఫోకస్ చేయాలని సూచించారు. ఇంకా చదవండి.
4. సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు సంచలన ఆరోపణలు
తెలంగాణ భవన్‌లో హైడ్రా బాధితుల గోడు విన్న బీఆర్‌ఎస్ నేతలు హరీష్‌రావు, సబితా ఇంద్రారెడ్డి వారికి ధైర్యం చెప్పారు. న్యాయపోరాటం చేసేందుకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని చెప్పిన నేతలు... లీగర్ సెల్ ప్రతినిధుల నెంబర్లు ఇచ్చారు. సమస్యలు వారితో చర్చించాలని సూచించారు. పేదల కన్నీళ్లు తుడవాల్సిన ప్రభుత్వం వారి కన్నీళ్లపై అభివృద్ధి కి బాటలు వేస్తోందని ఆరోపించారు. ఇంకా చదవండి.
5. మంత్రి పొంగులేటి ఇంట్లో ఈడీ సోదాలకు కారణమిదే?
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇళ్లు , కార్యాలయలపై సోదాల విషయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆయన బడా కాంట్రాక్టర్ కావడంతో టీడీఎస్ అవకతవకల విషయంలో సోదాలు జరిగాయని అనుకున్నారు. కానీ అసలు కారణం మాత్రం కుమారుడికి ఉన్న లగ్జరీ వాచ్‌ల మోజే. ఆ వాచ్‌లను నేరుగా కొనకుండా స్మగ్లింగ్ ద్వారా తెప్పించుకోవడమే అసలు తప్పిదంగా మారింది. ఈడీ కేసుల్లో ఇరుక్కునేలా చేసింది. ఇంకా చదవండి.