Luxury wristwatches drew ED to Ponguleti doorstep : తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇళ్లు , కార్యాలయలపై సోదాల విషయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆయన బడా కాంట్రాక్టర్ కావడంతో టీడీఎస్ అవకతవకల విషయంలో సోదాలు జరిగాయని అనుకున్నారు. కానీ అసలు కారణం మాత్రం కుమారుడికి ఉన్న లగ్జరీ వాచ్‌ల మోజే. ఆ వాచ్‌లను నేరుగా కొనకుండా స్మగ్లింగ్ ద్వారా తెప్పించుకోవడమే అసలు తప్పిదంగా మారింది. ఈడీ కేసుల్లో ఇరుక్కునేలా చేసింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందే హర్షారెడ్డికి కస్టమ్స్ నోటీసులు
అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే పొంగులేటి కుమారుడు హర్షారెడ్డి వాచ్‌ల స్మగ్లింగ్‌లో కస్టమ్స్ అధికారుల నుంచి నోటీసులు అందుకున్నారు. చెన్నై కస్టమ్స్ అధికారులు ఓ వ్యక్తిని ఎయిర్ పోర్టులో పట్టుకున్నారు. ఆ వ్యక్తి వద్ద రెండు ఖరీదైన వాచ్‌లుఉన్నాయి. పటెక్ ఫిలిప్, బ్రిగెట్ బ్రాండ్ లకు చెందిన వాచ్‌లు అవి. అత్యంత ఖరీదైన ఆ బ్రాండ్ వాచ్‌లు ఇండియాలో దొరకవు. పట్టుబడిన వారి వద్ద నుంచి వివరాలు సేకరిస్తే.. వాటిని ఆలోకం నవీన్ అనే వ్యక్తి ద్వారా అవి పొంగులేటి కుమారుడు హర్షారెడ్డి తెప్పించుకుంటున్నారని గుర్తించారు. రెండు వాచ్‌ల ఖరీదు మూడు కోట్ల వరకూ ఉంటుందని అంచనా.
రూ. వంద కోట్ల విలువైన వాచ్‌లను తెప్పించినట్లుగా లెక్కలు
దీనిపై కేసు నమోదు చేసుకున్న చెన్నై కస్టమ్స్ అధికారులు విచారణ చేపట్టారు. దర్యాప్తు చేసిన కస్టమ్స్ అధికారులు ఈ వాచ్‌ల కోసం బిట్ కాయిన్ల రూపంలో హర్షా రెడ్డి డబ్బు చెల్లించినట్లు సమాచారం. ముందుగా ఆలోకం నవీన్‌కుమార్‌ను విచారించిన చెన్నై కస్టమ్స్ అధికారులు చాలా కాలంగా ఈ లగ్జరీ వాచ్‌ల దిగుమతి జరుగుతోందని రూ. వంద కోట్ల విలువైన వాచ్‌లు తెప్పించినట్లగగాా చెప్పారు. దీంతో హర్షా రెడ్డికి కస్టమ్స్ అధికారులు నోటీసులు ఇచ్చారు.కానీ హర్షా రెడ్డి వివిధ కారణాలతో హాజరు కావడం మానేశారు.
అవకతవకలను గుర్తించిన ఈడీ
ఖరీదైన వాచ్‌లను పన్నులు కట్టకుండా... తీసుకు వచ్చే బిజినెస్ వ్యవస్థీకృతంగా నడుస్తూ ఉంటుందని చాలా కాలంగా ప్రచారం ఉంది. ఈ క్రమంలో వివరాలను తెప్పించుకున్న ఈడీ అధికారులు బ్యాక్ గ్రౌండ్ వెరీఫికేషన్ పూర్తి చేసి.. వెంటనే దాడులు చేశారు. ఈ దాడుల్లో ఎంత బయటపడ్డాయి అన్నది ఇంకా స్పష్టత రాలేదు. కానీ వాచ్‌ల స్మగ్లింగ్ విషయంలో ఈడీ అధికారులు సంచలన విషయాలు కనిపెట్టినట్లుగా చెబుతున్నరాు. అలాగే ఈ సోదాల్లో ఇంకా ఆయన వ్యాపారాలకు సంబంధించిన లొసుగులు ఏమైనా ఉన్నాయా అన్నది కనిపిస్తే అధికారిక ప్రకటన చేయనున్నారు.
మొత్తంగా లగ్జరీ వాచ్‌లను పన్నులు కట్టకుండా ఇండియాలోకి తీసుకు రావడమే .. పొంగులేటిపై ఐటీ దాడులకు ప్రధాన కారణంగా మారింది.