Tirumala Laddu Row: తిరుపతి లడ్డూ వివాదంలో సీఎం చంద్రబాబు చేసిన పాపం పోవాలి- వైసీపీ నేతల ప్రత్యేక పూజలు
తిరుమల లడ్డూ తయారీలో అపవిత్రం జరిగిందన్న సీఎం చంద్రబాబు కామెంట్స్‌కు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ వినూత్న నిరసనలు చేపట్టింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appరాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నేతలు ప్రత్యేక పూజలు చేయాలని జగన్ నాలుగు రోజుల క్రితం పిలుపునిచ్చారు.
వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపుమేరకు ఆయా నియోజకవర్గాల్లో ప్రత్యేక పూజలు చేసిన వైసీపీ నేతలు
తిరుపతి లడ్డూలో అపచారం జరిగిందన్న చంద్రబాబు కామెంట్స్‌తో చేసిన తప్పులు పోవాలని ప్రత్యేక పూజలు చేసిన వైఎస్ఆర్సీపీ నేతలు
వాస్తవంగా ఇవాళ తిరుమలలో జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక పూజలు చేయాలని ప్లాన్ చేసుకున్నారు. ఆఖరి నిమిషంలో పర్యటన రద్దు చేసుకున్నారు.
వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను, నేతలను అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని అడ్డగోలుగా నోటీసులు ఇస్తున్నారని ఆవేదనతో పర్యటన రద్దు చేసుకున్న జగన్
నాణ్యత పరీక్షల్లో ఫెయిల్ అయిన నెయ్యి ట్యాంకర్లను వాడలేదని తెలిసి కూడా చంద్రబాబు అసత్య ఆరోపణలు చేస్తున్నారని వైసీపీ శ్రేణులు విమర్శిస్తున్నారు.
స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు దేవుడిని సైతం రోడ్డుపైకి లాగుతున్నారని మండిపడ్డారు.
చంద్రబాబు చేసిన పాపానికి ప్రక్షాళన కోరుతూ వైయస్ఆర్సీపీ నేతలు రాష్ట్రంలోని అందుబాటులో ఉన్న అన్ని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు.
గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కొరిటిపాడులోని శ్రీ కళ్యాణ రామాలయంలో మాజీ మంత్రులు విడదల రజిని, అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, కార్పొరేటర్లు, నాయకులు ప్రత్యేక పూజలు చేశారు.
చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తూ తిరుమల పవిత్రతతే ప్రమాదం తీసుకొచ్చారని ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల మనోభావాలు దెబ్బతీశారని మండిపడ్డారు నేతలు
ఇకపై అయినా చంద్రబాబు తన తప్పు తెలుసుకొని అలాంటి అసత్య ప్రచారం మానుకోవాలని వైసీపీ నేతలు సూచించారు.