Satyabhama Serial Today September 28th: హగ్గులు 16 రకాలు..సత్యకి క్రిష్ స్పెషల్ క్లాస్ - సత్యభామ సీరియల్ సెప్టెంబరు 28 ఎపిసోడ్ హైలెట్స్!
క్రిష్ ప్రవర్తనకు బాధపడిన సత్య..మహదేవయ్య నిజస్వరూపం ఎలా చెప్పాలా అనే ఆలోచనలో పడుతుంది. ఇంతలో వెనుకనుంచి వచ్చిన క్రిష్ ని చూసి ఉలిక్కిపడుతుంది. ఇలా సైలెంట్ గా వస్తే ఎలా అని స్వీట్ గా కోప్పడుతుంది.
సత్య-క్రిష్ ఇద్దరూ ఆలోచనలో పడతారు..తనది తప్పు అంటే తనది తప్పు అంటూ ఇద్దరూ సారీ చెప్పుకుంటారు. ఓ హగ్ తో సారీ చెప్పుకుందాం అన్న క్రిష్.. హగ్ లు 16 రకాలు..ఒక్కో సందర్భంలో ఒక్కో హగ్..ప్రతిదానికి అర్థంవేరే అంటూ పెద్ద క్లాసే వేస్తాడు..
నేను కూడా మావయ్యగారికి సపోర్ట్ గా ఉంటానంటూ..అటాక్ చేసిన రౌడీల్లో ఒకడి బొమ్మ గీసి ఉంచుతుంది.. అది చూసిన క్రిష్ ఉత్సాహంగా మహదేవయ్య దగ్గరకు తీసుకెళతాడు.. నీపై అటాక్ చేసిన వారిలో ఒకడి ఫొటో ఇది అని చెబుతాడు
ఆ మాట విని రుద్ర భయపడిపోతాడు..తన బండారం ఇకబయటపడినట్టే అనుకుంటాడు. నాకు చెప్పకుండా ఎందుకిలా చేశావ్ అని సత్యని నిలదీస్తాడు మహదేవయ్య. ఈ ఇంట్లో ఆడవారు కొంచెం తెలివిగా ప్రవర్తించడం ఇదే మొదటిసారి అనుకుంటా అని సెటైర్ వేస్తుంది
ఇంతలో పోలీసులు రావడంతో..వాడిని పట్టుకున్నారా? ఎక్కడున్నాడని అడిగితే.. వాడు తప్పించుకునే ప్రయత్నంలో యాక్సిడెంట్ లో చనిపోయాడు అని చెబుతారు. సత్య షాక్ అవుతుంది...
పాతికేళ్లుగా తప్పులు చేయడంలో ముదిరిపోయా..నిజం బయటపడకుండా మ్యానేజ్ చేస్తున్నా అన్న మహదేవయ్యతో ఇక ఆ నిజం బయటపెట్టే పని నేను చూసుకుంటా అంటుంది సత్య..
ముహూర్తం పెట్టాలి శోభనం జరగాలి అంతే అంటుంది బామ్మ... బామ్మ ఒప్పుకుంటే మన ఫస్ట్ నైట్ కి అడ్డులేనట్టే అంటాడు క్రిష్.. మరోవైపు సత్యను చంపేందుకు మహదేవయ్య-రుద్ర కలసి కుట్ర చేస్తారు...