Womens T20 World Cup: టీ 20 ఆధిపత్యమంతా ఆస్ట్రేలియాదే , ఎన్నిసార్లు కప్పు గెలిచిందంటే?
ఐసీసీ టీ 20 ప్రపంచకప్ సమీపిస్తున్న కొద్ది క్రికెట్ అభిమానుల్లో ఉత్కంఠ పెరిగిపోతోంది. ఈసారి ఏ జట్టు టీ 20 ప్రపంచకప్ గెలుస్తుందన్న అంచనాలు పెరుగుతున్నాయి.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఇంగ్లండ్ 2009: ఇంగ్లండ్‌లో తొలి టీ 20 మహిళల టీ 20 ప్రపంచకప్ జరిగింది. స్వదేశంలో జరిగిన ఈ టోర్నీలో న్యూజిలాండ్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించి ఇంగ్లండ్ తొలి T20 ప్రపంచ కప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది.
ఆస్ట్రేలియా( 2010): ఆస్ట్రేలియాలో జరిగిన రెండో టీ 20 ప్రపంచకప్‌ను కంగారు జట్టు గెలుచుకుంది. ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై ఆస్ట్రేలియా కేవలం 3 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఆస్ట్రేలియా (2012) : 2012లో శ్రీలంక ఆతిథ్యం ఇచ్చిన టీ 20 ప్రపంచకప్‌ను ఆస్ట్రేలియా రెండోసారి గెలుచుకుంది. ఫైనల్‌లో ఇంగ్లండ్‌ను 4 పరుగుల తేడాతో ఓడించింది.
ఆస్ట్రేలియా ( 2014): బంగ్లాదేశ్‌లో జరిగిన 2014 టీ 20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించి ఆస్ట్రేలియా మరోసారి టీ 20 ప్రపంచకప్ ముచ్చటగా మూడోసారి గెలుచుకుంది.
వెస్టిండీస్ (2016): 2016లో భారత్‌లో జరిగిన టీ 20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాపై 8 వికెట్ల తేడాతో గెలిచిన వెస్టిండీస్ తొలి టైటిల్‌ను గెలుచుకుని చరిత్ర సృష్టించింది.
ఆస్ట్రేలియా(2018): వెస్టిండీస్‌లో జరిగిన 2018 టీ 20 ప్రపంచకప్‌ను మరోసారి ఆస్ట్రేలియా గెలుచుకుంది. ఫైనల్లో 8 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌పై ఆస్ట్రేలియా విజయం సాధించింది.
ఆస్ట్రేలియా( 2020): 2020లోజరిగిన టీ 20 ప్రపంచకప్ ఫైనల్లో భారత్‌ను 85 పరుగుల తేడాతో ఓడించి ఆస్ట్రేలియా మరోసారి టీ 20 ప్రపంచకప్ గెలుచుకుంది.
ఆస్ట్రేలియా (2023): దక్షిణాఫ్రికాలో జరిగిన 2023 టీ 20 ప్రపంచకప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా 19 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించి మరోసారి కప్పు గెలుచుకుంది.