India vs Bangladesh కాన్పూర్ వేదికగా భారత్‌ బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో వరుణుడిదే పై చేయి అవుతోంది. మొదటి రోజు వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైంది. పది గంటలకు టాస్ వేసి.. పదిన్నరకు మ్యాచ్‌ను ప్రారంభించారు. అప్పటి కూడా అవుట్‌ ఫీల్డ్ చాలా చిత్తడిగా ఉంది. అయినా 35 ఓవర్ల మ్యాచ్‌ను కొనసాగించారు. లంచ్ తర్వాత వాతావరణం పూర్తిగా మారిపోయింది. లైటింగ్ లేకపోవడంతో రెండు గంటల ముందుగానే మొదటి రోజు మ్యాచ్‌ను నిలిపేశారు.


రెండో టెస్టు రెండో రోజైనా ఆట సాగుతందని చూసిన సగటు క్రికెట్ అభిమానులకు నిరాశ తప్పలేదు. కనీసం ఒక్క బంతి పడకుండానే రెండో రోజు మ్యాచ్‌ను రద్దు చేశారు. ఆలస్యంగా ప్రారంభమవుతుందని బీసీసీ ఐ ప్రకటించింది. ఎంతకీ వర్షం తగ్గకపోవడంతో గ్రౌండ్‌లో నీరు నిలిచిపోవడంతో రెండో రోజుమ్యాచ్ను నిలిపేశారు. 


రెండో రోజు మ్యాచ్ స్టార్ట్ అవుతుందని వచ్చన ఆటగాళ్లు కూడా నిరాశతో హోటల్ గదికి వెళ్లిపోయారు. జోరు వాన కారణంగా హోటల్ రూమ్‌కే పరిమితం అయ్యారు. రెండు జట్లు కూడా హోటల్‌కు వెళ్లిపోవడంతో రెండో రోజు మ్యాచ్ లేనట్టేనని తెలుస్తోంది.




మొదటి రోజు టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ తీసుకుంది. కేవలం 35 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. మొదటి బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్‌ 35 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 107పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్‌లో 40 పరుగులతో మోమినల్, ఆరు పరుగులతో ముష్ఫికర్ ఉన్నారు. భారత బౌలర్లలో ఆకాశ్ దీప్ 2వికెట్లు పడగొడితే.. అశ్విన్ ఒక వికెట్ తీసుకున్నారు. 




Also Read: జూనియర్ అమ్మాయిలతో కోహ్లీ సమానం -విరాట్‌పై హాకీ వైస్‌ కెప్టెన్ తీవ్ర విమర్శలు