Indian Crowd Attacks Bangladesh Fan : కాన్పూర్‌లో భారత్-బంగ్లాదేశ్(IND vs BAN) మధ్య జరుగుతున్న రెండో టెస్టులో తీవ్ర కలకలం రేగింది. భారత అభిమానులు(Indian Fans)... బంగ్లాదేశ్ అభిమాని(Bangladesh Fans)పై దాడి చేశారన్న ఆరోపణలు సంచలనం సృష్టించాయి. శరీరానికి పులిలా పెయింట్ వేసుకుని బంగ్లాదేశ్‌కు మద్దతుగా నిలుస్తున్న అభిమాని టైగర్ రాబీ(Tiger Robi)పై దాడి జరగడం ఇప్పుడు వైరల్‌గా మారింది. టైగర్ రాబీ బంగ్లాదేశ్ జట్టుకు వీరాభిమానిగా గుర్తింపు ఉంది. అలాంటి వీరాభిమానిపై దాడి జరగడం.. ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో తీవ్ర చర్చకు దారి తీసింది.
Read also: మహిళల టీ 20 ప్రపంచ కప్? - ఈ విషయాలు మీకు తెలుసా?
అసలేం జరిగింది..?
కాన్పూర్‌లో భారత్-బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న టెస్టు తొలి రోజు చివర్లో.. కొందరు స్థానిక ప్రేక్షకులు తనపై దాడి చేశారని బంగ్లాదేశ్ అభిమాని టైగర్ రాబీ ఆరోపించాడు. బంగ్లాదేశ్ అభిమాని ఢాకాకు చెందిన టైగర్ రోబీపై గ్రీన్ పార్క్ స్టేడియంలో ప్రేక్షకులు తీవ్రంగా గాయపరిచారు. దీంతో రాబీని ఆస్పత్రికి తరలించారు. టైగర్ రాబీ బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు అతిపెద్ద అభిమానులలో ఒకడు. కాన్పూర్‌లో జరుగుతున్న మ్యాచ్‌ను తిలకించేందుకు బంగ్లాదేశ్ నుంచి టైగర్ రాబీ... భారత్‌కు వచ్చాడు. ఈరోజు మ్యాచ్‌ను చూసేందుకు టైగర్ రాబీ స్టేడియానికి వచ్చాడు. దాడి తర్వాత టైగర్ రాబీని పోలీసులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. టైగర్ రాబీకి సంబంధించిన వీడియో ఫుటేజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. " కొందరు ప్రేక్షకులు నా వీపు, పొత్తి కడుపుపై కొట్టారు. ఆ దాడితో నేను ఊపిరి పీల్చుకోలేకపోయాను." అని టైగర్ రాబీ తెలిపాడు. అయితే ఈ ఆరోపణలను పోలీసులు ఖండించాడు. " సీ బ్లాక్ ప్రవేశ ద్వారం దగ్గర ప్రేక్షకులు ఎక్కువగా ఉండడంతో టైగర్ రాబీ అందులో చిక్కుకుని ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. అతను మాట్లాడేందుకు ఇబ్బందిపడ్డాడు. వైద్యుల రిపోర్ట్ కోసం మేము ఎదురుచూస్తున్నాం" అని పోలీసులు తెలిపారు.
Read Also: మహిళల టీ 20 ప్రపంచకప్‌లో అద్భుత పోరాటాలు చారిత్రక క్షణాలు
టైగర్ రాబీ ఎవరంటే..?
‘టైగర్ రాబీ... బంగ్లాదేశ్ జట్టు వీరాభిమాని. తన శరీరమంతా పులిలా పెయింట్ వేసుకుని బంగ్లాదేశ్‌ను సపోర్ట్ చేస్తుంటాడు. బంగ్లాదేశ్ ఎక్కడ మ్యాచులు ఆడినా అక్కడికి వచ్చి సందడి చేస్తాడు. అందుకే రాబీని బంగ్లా క్రికెట్ అభిమానులు అందరూ టైగర్ రాబీ అని పిలుస్తుంటారు. బంగ్లాదేశ్ జెండాను ఊపుతూ సందడి చేస్తుంటాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే కాన్పూర్‌లో భారీ వర్షం కారణంగా తొలి రోజు ఆట త్వరగా ముగిసింది. భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. బంగ్లాదేశ్ 35 ఓవర్లలో 107 పరుగులు చేసి మూడు వికెట్లు కోల్పోయింది. ఆకాశ్ దీప్ 10 ఓవర్లలో 34 పరుగులిచ్చి రెండు వికెట్లు, అశ్విన్ తొమ్మిది ఓవర్లలో 22 పరుగులిచ్చి ఒక వికెట్ తీశారు.