ICC T20 Womens World Cup:  మహిళల టీ 20 ప్రపంచకప్‌నకు మరో వారం రోజులే సమయం ఉంది. డిఫెండింగ్  ఛాంపియన్ ఆస్ట్రేలియా మరోసారి కప్పుపై కన్నేయగా... భారత జట్టు  తొలిసారి విశ్వ విజేతగా నిలవాలన్న పట్టుదలతో ఉంది. అయితే మిగిలిన జట్లు కూడా ఈసారి కప్పును తేలిగ్గా వదలకూడదని గట్టి కసితో ఉన్నాయి. పురుషులతో సమానంగా మహిళల జట్టుకు కూడా ప్రపంచకప్‌లో సమానమైన ప్రైజ్‌మనీని ఇస్తామన్న ఐసీసీ ప్రకటనతో... ఈసారి ఐసీసీ ప్రపంచకప్‌పై మరింత ఆసక్తి పెరిగింది. అయిదే ఐసీసీ మహిళల కోసం... గతంలో కంటే ఎక్కువ క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో క్రికెట్ ప్రపంచం అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో ఐసీసీ పొట్టి ప్రపంచకప్‌ ఎక్కడ జరుగుతుంది.. ఎప్పటినుంచి జరుగుతుందన్న విషయాలను ఓసారి తెలుసుకుందాం...


Read Also : మహిళల టీ 20 ప్రపంచకప్‌లో అద్భుత పోరాటాలు చారిత్రక క్షణాలు



ఐసీసీ మహిళల T20 ప్రపంచ కప్ ఎక్కడ జరుగుతుంది? 

మహిళల ఐసీసీ T20 ప్రపంచ కప్ 2024... యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని షార్జా, దుబాయ్‌లోని రెండు ప్రదేశాల్లో జరుగుతుంది. 

 

ఎప్పటినుంచి ఎప్పటివరకు? 

ICC మహిళల టీ20 ప్రపంచకప్ అక్టోబర్ 3 నుంచి అక్టోబర్ 20 వరకు జరగనుంది. 

 

ప్రస్తుత ఛాంపియన్ ఎవరు? 

గత మహిళల టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లో దక్షిణాఫ్రికాపై ఆస్ట్రేలియా విజయం 

 

మొత్తం ఎన్ని జట్లు ఉన్నాయి..?

మహిళల T20 ప్రపంచకప్‌లో గ్రూప్ A, గ్రూప్ Bల్లో మొత్తం పది జట్లు ఉన్నాయి.  గ్రూప్ Aలో భారత్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, శ్రీలంక ఉన్నాయి. గ్రూప్ Bలో ఇంగ్లండ్, స్కాట్లాండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా ఉన్నాయి.

 

గతంలో భారత్‌ ప్రపంచకప్ గెలిచిందా? 

మహిళల టీ20 ప్రపంచకప్‌ను భారత్ ఎప్పుడూ గెలవలేదు. మహిళల టీ20 క్రికెట్ 2020లో భారత్ ఫైనల్స్‌కు చేరుకుంది. ఇదే భారత జట్టు అత్యుత్తమ ప్రదర్శన. 2020 ఫైనల్లో భారత జట్టు ఆస్ట్రేలియా చేతిలో ఓడి ట్రోఫీని చేజార్చుకుంది. 

 


 

పొట్టి ప్రపంచకప్‌ను అత్యధిక సార్లు గెలుచుకున్న జట్టు..?

మహిళల టీ20 ప్రపంచకప్‌ను అత్యధిక సార్లు గెలుచుకున్న ఘనత ఆస్ట్రేలియా సొంతం. 8 సార్లు జరిగిన మహిళల టీ20 ప్రపంచకప్‌ను ఆస్ట్రేలియా 6 సార్లు గెలుచుకుంది. ఇంగ్లండ్‌, వెస్టిండీస్‌లు ఒక్కోసారి గెలిచాయి. 

 

భారత్ మ్యాచ్ ఎప్పుడు..?

టీ 20 ప్రపంచకప్‌లో భారత్ తొలి మ్యాచ్‌ను న్యూజిలాండ్‌తో తలపడనుంది. అక్టోబర్ నాలుగో తేదీన ఈ మ్యాచ్‌ జరుగుతుంది. న్యూజిలాండ్‌తో గతంలో జరిగిన మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. దీంతో ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించి శుభారంభం చేయాలని భారత్‌ భావిస్తోంది. హర్మన్‌ ప్రీత్‌ సారథ్యంలో భారత్‌ బరిలోకి దిగుతుంది.