35 Chinna Katha Kaadu Movie OTT Release Date: నివేదా థామస్‌, విశ్వదేవ్‌ రాచకొండ, ప్రియదర్శి పులికొండ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన రీసెంట్ మూవీ ‘35: చిన్న కథ కాదు’. నంద కిశోర్ ఇమాని దర్శకత్వం వహించిన ఈ సినిమాకు టాలీవుడ్ నటుడు రానా నిర్మాతగా వ్యవహరించారు. సెప్టెంబర్ 6న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో విడుదల అయ్యింది. చిన్న మూవీగా విడుదలై పెద్ద విజయాన్ని అందుకుంది. నివేదా థామస్ తల్లి పాత్రలో కనిపించిన... ఈ సినిమా బాక్సాఫీస్‌ దగ్గర అద్భుతంగా వసూళ్లు రాబట్టించింది. అంతే కాదు... విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు దక్కాయి.


ఆహాలో అక్టోబర్ 2 నుంచి  స్ట్రీమింగ్..


బ్లాక్ బస్టర్ ‘35: చిన్న కథ కాదు’ మూవీ త్వరలో ఓటీటీలోకి అడుగు పెట్టబోతోంది. అక్టోబర్ 2 నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ కు తీసుకు రాబోతున్నట్లు తెలుగు ఓటీటీ సంస్థ ఆహా వెల్లడించింది. ఈ మేరకు ఓ పోస్టర్ ను షేర్ చేసింది. “ఈ చిన్న కథ వెనుక పెద్ద పాఠం ఉంది! మన ఇంటి కథలా అనిపిస్తుంది. ఈ బ్యూటీఫుల్ బ్లాక్ బస్టర్ మూవీ ఆక్టోబర్ 2 నుంచి ఆహాలో అందుబాటులోకి వస్తుంది” అని రాసుకొచ్చింది. 






‘35: చిన్న కథ కాదు’ స్టోరీ ఏంటంటే?


నివేదా థామస్ చాలా రోజుల తర్వాత నటించిన ఈ తెలుగు సినిమా ఓ మధ్య తరగతి కుటుంబ కథతో తెరకెక్కింది. ప్ర‌సాద్ (విశ్వ‌దేవ్) తిరుపతిలో బ‌స్ కండ‌క్టర్‌ గా పని చేస్తారు. ఆయ‌న భార్య స‌ర‌స్వ‌తి (నివేదా థామ‌స్) తన భర్త, ఇద్దరు పిల్లలే ప్రపంచంగా ఆమె జీవితాన్ని కొనసాగిస్తుంది. చిన్నోడు చదువులో ముందున్నా, పెద్ద పిల్లాడికి అస్సలు లెక్కలు రావు. ఆ అబ్బాయి అడిగే ప్రశ్నలు చాలా లాజిక్ గా ఉంటాయి. సున్నాకు విలువ లేనప్పుడు దాని పక్కిన 1 పెడితే ఎందుకు పది అవుతుందో అర్థం కాదు. టీచర్లు కూడా అతడి ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేకపోతారు. పైగా అతడినే మందలిస్తారు. మ్యాథ్స్ టీచర్ చాణక్య(ప్రియ‌ద‌ర్శి) కూడా అతడికి మొద్దు అనే ముద్ర వేసి క్లాస్ లో చివరి బెంచీలో కూర్చోబెడతాడు. ఆరో తరగతిలోనూ ఆ అబ్బాయి ఫెయిల్ అవుతాడు. తన తమ్ముడి క్లాస్ లో కూర్చోవాల్సి వస్తుంది. చివరకు ఆ అబ్బాయి స్కూల్ లో ఉండాలంటే మ్యాథ్స్ లో 35 మార్కులు తెచ్చుకోవాలని యాజమాన్యం నిర్ణయిస్తుంది. ఇంతకీ అతడు 35 మార్కులు తెచ్చుకున్నాడా? లేదా? కొడుకు పాస్ అయ్యేందుక తల్లి ఏం చేసింది.? అనేది సినిమాలో అద్భుతంగా చూపించారు దర్శకుడు నంద కిశోర్ ఇమాని. మధ్య తరగతి బతుకును మార్కులతో లింక్ చేసి చూపించిన ఈ సినిమా ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకుంది. థియేటర్లలో చూడని అభిమానులు త్వరలో ఓటీటీలో చూడవచ్చు. ఈ సినిమాకు వివేక్ సాగర్ సంగీతం అందించారు.  


Also Readతెలుగు రాష్ట్రాల్లో 'దేవర'కు ఫస్ట్ డే ఏ ఏరియాలో ఎన్ని కోట్ల షేర్‌ వచ్చిందో తెలుసా?