మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Man Of Masses NTR)కు రికార్డులు కొత్త కాదు. 'దేవర' (Devara Movie)తో మరోసారి ఆయన బాక్సాఫీస్ బరిలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేశారు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా మొదటి రోజు హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఏపీ, తెలంగాణ... రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లు సాధించింది. తెలుగు గడ్డ మీద ఫస్ట్ డే ఎన్ని కోట్ల షేర్ వచ్చిందో తెలుసా?

ఏపీ, తెలంగాణలో 'దేవర' ఫస్ట్ డే షేర్... మాస్!
Devara Day 1 AP and Telangana Numbers: తెలుగునాట 'దేవర'కు థియేటర్లలో బ్రహ్మరథం పట్టారు. మిడ్ నైట్ ఒంటి గంట నుంచి తెలంగాణ, ఏపీలో బెనిఫిట్ షోలు పడ్డాయి. దాంతో సినిమా హాళ్ల దగ్గర పండగ వాతావరణం కనిపించింది. ఆ జోరు వసూళ్లలోనూ స్పష్టంగా కనిపించింది. ఏరియాల వారీగా మొదటి రోజు ఏపీ, తెలంగాణలో 'దేవర'కు ఏ ఏరియాలో ఎన్ని కోట్ల షేర్ వచ్చింది? అనేది చూస్తే...   

నైజాం (తెలంగాణ) రూ. 19.32 కోట్లు
విశాఖ రూ. 5.47 కోట్లు
గుంటూరు రూ. 6.27 కోట్లు
నెల్లూరు రూ. 2.11 కోట్లు
కృష్ణ రూ. 3.02 కోట్లు
తూర్పు గోదావరి రూ. 4.02 కోట్లు
పశ్చిమ గోదావరి రూ. 3.60 కోట్లు
సీడెడ్ (రాయలసీమ) రూ. 10.40 కోట్లు
ఏపీ, తెలంగాణలో టోటల్ షేర్ రూ. 54.21 కోట్లు

Also Read: మీ అభిమానానికి నా మనసు పులకరించిపోయింది - ‘దేవర‘ రెస్పాన్స్ గురించి ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్టు!

'ఆర్ఆర్ఆర్' తర్వాత స్థానంలో 'దేవర'
ఏపీ, తెలంగాణలో ఓపెనింగ్ హయ్యస్ట్ షేర్ సాధించిన రికార్డు దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తీసిన 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' సినిమా పేరిట ఉంది. ఆ సినిమా రూ. 74.11 కోట్లు కలెక్ట్ చేసింది. నిన్నటి వరకు ఆ తర్వాత స్థానంలో రెబల్ స్టార్ ప్రభాస్ 'సలార్' సినిమా ఉంది. ఆ సినిమాకు తెలంగాణ, ఏపీలో మొదటి రోజు రూ. 50.49 కోట్ల షేర్ వచ్చింది. ఇప్పుడు రూ. 54.21 కోట్ల షేర్ సాధించి రెండో స్థానంలోకి 'దేవర' వచ్చింది.

Also Read: జపాన్ నుంచి అమెరికా వచ్చిన ఫ్యాన్స్ - ఎన్టీఆర్ అంటే ఆ మాత్రం ఉంటది మరి!


'ఆర్ఆర్ఆర్', 'దేవర'... ఏపీ, తెలంగాణలో ఫస్ట్ హయ్యస్ట్ షేర్ సాధించిన రెండు సినిమాలు ఎన్టీఆర్ (Jr NTR)వే కావడం విశేషం. 'ఆర్ఆర్ఆర్'తో ఆయనతో పాటు రామ్ చరణ్ కూడా హీరోగా నటించారు. 'దేవర'లో ఎన్టీఆర్ సోలో హీరో.