Telangana MLC Election Results | తెలంగాణలో ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి. మొత్తం మూడు చోట్ల ఎన్నికలు జరగగా, రెండు చోట్ల ఫలితం తేలింది. టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో PRTU టీఎస్, మరస్థానంలో బిజెపి మద్దతు తెలిపిన అభ్యర్థి విజయం సాధించారు.
ఉమ్మడి వరంగల్- నల్గొండ- ఖమ్మం టీచర్ నియోజకవర్గం ఎమ్మెల్సీ స్థానంలో పిఆర్టియు టీఎస్ అభ్యర్థి ఎంగిలి శ్రీపాల్ రెడ్డి గెలుపొందారు. ఉమ్మడి కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ టీచర్ ఎమ్మెల్సీ నియోజకవర్గం లో బిజెపి అభ్యర్థి మల్క కొమరయ్య విజయం సాధించారు. సిట్టింగ్ అభ్యర్థులు ఈ రెండు చోట్ల ఓటమి చెందారు. మూడో స్థానమైన ఉమ్మడి కరీంనగర్- నిజామాబాదు- ఆదిలాబాద్- మెదక్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం ఫలితం మంగళవారం తేలనుంది.
బీజేపీ అభ్యర్థి కొమరయ్య విజయం.. కాషాయ శ్రేణుల సంబరాలు..
ఉమ్మడి కరీంనగర్ నిజామాబాద్ అదిలాబాద్ మెదక్ టీచర్ నియోజకవర్గం ఎమ్మెల్సీగా మల్కా కొమరయ్య విజయం సాధించారు. టిఆర్ఎస్ మద్దతు తెలిపిన అభ్యర్థి కొమరయ్య సమీప ప్రత్యర్థి, పిఆర్టియు (టీఎస్) అభ్యర్థి వంగ మహేందర్ రెడ్డి పై 5 వేల 777 ఓట్ల తేడాతో గెలుపొందారు. మొత్తం 15 మంది అభ్యర్థులు పోటీ చేయగా తొలి ప్రాధాన్యత ఓట్లతోనే ఫలితం వచ్చింది. సిటింగ్ ఎమ్మెల్సీ ప్రభుత్వం రెడ్డి కి కేవలం 428 ఓట్లు పోలయ్యాయి. ఏంఎల్సి స్థానంలో మొత్తం 25,041 ఓట్లు పోలవగా అందులో 897 ఓట్లు చెల్లుబాటు కాలేదు. విజేత కావాలంటే 50 శాతానికి నుంచి కోట్లు రావాలి. మల్కా కొమరయ్యకు 12959 ఓట్ల రావడంతో రిటర్నింగ్ అధికారి, కరీంనగర్ కలెక్టర్ విజేత కొమరయ్యకు ఎమ్మెల్సీగా ధ్రువీకరణ సర్టిఫికెట్ అందించారు.
పీఆర్‌టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీపాల్ రెడ్డి విజయం
ఉమ్మడి నల్గొండ వరంగల్ ఖమ్మం టీచర్ నియోజకవర్గం ఎమ్మెల్సీగా పి ఆర్ టి యు టీఎస్ (PRTU TS) రాష్ట్ర అధ్యక్షుడు పింగిలి శ్రీపాల్ రెడ్డి గెలుపొందారు. సమీప ప్రత్యర్థి, యుటిఎఫ్ నకు చెందిన సిటింగ్ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి పై శ్రీపాల్ రెడ్డి రెండో ప్రాధాన్యత ఓట్లలో విజయం సాధించారు. విజయానికి 50 శాతం ఓట్లు రావాల్సి ఉండగా మొదటి ప్రాధాన్యతలలో ఎవరికి అన్ని ఓట్లు రాలేదు. రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కిస్తూ ఎలిమినేషన్ ప్రక్రియ నిర్వహించారు. రెండో ప్రాధాన్యత హోటల్ లెక్కింపులో శ్రీపాల్ రెడ్డికి 13 వేల 969 ఓట్లు రావడంతో విజేతగా ప్రకటించారు. తొలి ప్రాధాన్యత ఓట్లలో విజేత శ్రీపాల్ రెడ్డికి 6,035 ఓట్లు రాగా . ఆయన సమీప ప్రత్యర్థి, చీటింగ్ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి కి 4820 ఓట్లు రాగా, TPRTU అభ్యర్థి హర్షవర్ధన్ రెడ్డికి 4,437 ఓట్లు పోలయ్యాయి.
Also Read: AP MLC Elections: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర విజయం
తెలంగాణలో ఎన్నికలు జరిగిన మూడో ఎమ్మెల్సీ స్థానం ఫలితం మంగళవారం రానుంది. ఉమ్మడి కరీంనగర్ నిజామాబాద్ మెదక్ ఆదిలాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సోమవారం ప్రారంభమైంది. పొలైన మొత్తం ఓట్లు 2.5 లక్షలు కాగా, తొలి రోజు లక్షల ఓట్లను విభజించారు, మరో లక్ష నర ఓట్లను వేరు చేయాల్సి ఉంది.