మార్చి 04 రాశిఫలాలు


మేష రాశి


ఈ రోజు మీ ఆదాయం పెరిగే మార్గాలు కనిపిస్తాయి. చేసే పనిలో ఉత్సాహం ఉంటుంది.  అధునాతన సాంకేతిక పరిజ్ఞానంపై పనిచేసే వ్యక్తులు ఈ రోజు మంచి ఫలితాలు సాధిస్తారు. ఇంట్లో సరదా వాతావరణం ఉంటుంది. మీ రహస్య విషయాలను ఎవరితోనూ పంచుకోవద్దు , ప్రణాళికలు బహిర్గతం చేయొద్దు.


వృషభ రాశి


ఈ రోజు మీకు గందరగోళంగా అనిపిస్తుంది. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా సక్సెస్ అందుకుంటారు. మనసులో ఏదో తెలియని భయం ఉంటుంది. అధిక ఆలోచనల కారణంగా మీరు అనుకున్న పనులు పూర్తికావు. ప్రేమ వ్యవహారాలలో గౌరవానికి భంగం కలగకుండా చూసుకోండి.
 
మిథున రాశి


మీ విధేయత , సామర్థ్యం ప్రజలకు ప్రేరణగా మారుతాయి. చిన్న వ్యాపారులకు ఈ రోజు చాలా మంచిది. కష్టమైన ఒప్పందాన్ని కూడా సులభంగా పూర్తిచేస్తారు. ప్రత్యర్థులు యాక్టివ్ గా ఉన్నారు మీరు అప్రమత్తంగా వ్యవహరించండి. పోటీ పరీక్షలకు సంబంధించి మీరు గొప్ప విజయాన్ని పొందవచ్చు.


Also Read: ఇలాంటి పనులు చేస్తే తొందరగా పోతారు.. మహాభారతంలో ఉంది!


కర్కాటక రాశి


ఈ రోజంతా మీరు సంతోషంగా ఉంటారు. కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయస్తారు. మనసులో ఉత్సాహం పెరుగుతుంది. చిన్న పిల్లల తప్పులు విస్మరించొద్దు. ఉద్యోగం, వ్యాపారంలో సాధారణ ఫలితాలుంటాయి. 


సింహ రాశి


ఈ రోజు మీపై మీకు విశ్వాసం తగ్గుతుంది. పెద్ద కంపెనీలో పనిచేసే వ్యక్తులు తమ ఉద్యోగాలపై అసంతృప్తి చెందుతారు. ఈ రోజు మీరు ఇంట్లో విశ్రాంతి తీసుకోవాలి. ఇతరుల ప్రభావంతో మీ నిర్ణయాలు తీసుకోవద్దు. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. 


కన్యా రాశి


ఈ రోజు మీకు సాధారణంగా ఉంటుంది. ఎవరినీ గుడ్డిగా నమ్మేయవద్దు. ఉన్నతాధికారులతో అనవరస వాగ్వాదానాకి దిగొద్దు. కష్టమైన పరిస్థితుల్లో సహనంగా వ్యవహరించండి. ధైర్యంగా ఉండేందుకు ప్రయత్నించండి.  


Also Read: శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మీ నక్షత్రానికి ఎన్ని సున్నాలు ఉన్నాయి.. ఉంటే ఏమవుతుంది!


తులా రాశి


ఈ రోజు మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. పిల్లలు మీ ఆదేశాలను పాటిస్తారు. పాత స్నేహితులను కలుస్తారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు కలిసొస్తాయి. ఉద్యోగం కోసం వెతుక్కుంటున్నవారి ప్రయత్నం ఫలిస్తుంది.


వృశ్చిక రాశి


ఈ రోజు సానుకూలంగా ఉంటుంది...కానీ మీరు చెప్పిన అబద్ధం కారణంగా ఓ ఇబ్బంది ఎదుర్కోవాల్సి రావొచ్చు. మీపై శత్రువుల కుట్రలు విఫలమవుతాయి. మీ ప్రణాళికల ద్వారా ఎప్పటి నుంచో రావాల్సిన డబ్బు చేతికందుతుంది. 


ధనస్సు రాశి


ఎప్పటి నుంచో వెంటాడుతున్న వివాదాల నుంచి ఉపశమనం లభిస్తుంది. మీ వ్యక్తిగత జీవితంలో ఇతరుల ప్రమేయాలు వద్దు. మతపరమైన సంఘటనలు ప్లాన్ చేసుకుంటారు. పిల్లల భవిష్యత్తు గురించి కొంత ఆందోళన ఉంటుంది. దీర్ఘకాలిక వ్యాధులు మళ్లీ బయటపడవచ్చు.  


మకర రాశి


ఈ రోజు  మీరు అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి కానీ ఇబ్బందులు ఎదుర్కొంటారు. నూతన పెట్టుబడులు పెట్టాలనుకుంటే అనుభవజ్ఞుల సలహాలు స్వీకరించండి. విద్యార్థులు కెరీక్ కి సంబంధించిన మంచి అవకాశాలు పొందుతారు. వ్యాపారస్తులు చట్టపరమైన విషయాల గురించి ఆందోళన చెందుతారు. 


Also Read: 2025లో ఉగాది ఎప్పుడొచ్చింది - రాబోతున్న తెలుగు నూతన సంవత్సరం పేరు తెలుసా!


కుంభ రాశి


వెంటాడుతున్న సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ప్రియమైనవారికి సంబంధించి శుభవార్త వింటారు. సామాజిక కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. ప్రేమ వ్యవహారాలకు తగిన సమయం ఇవ్వండి. మీరు మీ పనులన్నింటినీ నిశితంగా పూర్తిచేస్తారు.


మీన రాశి


మీరు ఈ రోజు వ్యాపారం కోసం రుణం తీసుకోవాలనుకుంటే అన్ని పత్రాలను జాగ్రత్తగా అధ్యయనం చేయండి. కార్యాలయంలో టీమ్ వర్క్ తో మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబ జీవితంలో చిన్న చిన్న సమస్యలు తప్పవు. మీ దినచర్యలో మార్పులు వద్దు. 


Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. 


మీ నక్షత్రం ఏంటో తెలియకపోతే...మీ పేరులో మొదటి అక్షరం ఆధారంగా మీ నక్షత్రం తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి...