Alapati Raja Wins in Graduate MLC Elections | ఉమ్మడి కృష్ణా- గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి రాజా విజయం సాధించారు. మొత్తం 2,41,873 ఓట్లు ఓలవగా ఏడవ రౌండ్ లెక్కింపు పూర్తయ్యేసరికి కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర 1,18,070 ఓట్లు సాధించారు. చల్లని ఓట్లు 21,577గా గుర్తించారు. ఏడు రౌండ్లు పూర్తయ్యేసరికి 50% పైగా ఓట్లు సాధించడంతో ఆలపాటి రాజేంద్రను విజేతగా అనౌన్స్ చేశారు. 8 రౌండ్లు పూర్తయ్యేసరికి ఆలపాటి రాజేంద్ర కు 1,34,970 ఓట్లు రాగా, ప్రత్యర్థి లక్ష్మణరావుకు 58,019 ఓట్లు వచ్చాయి. ఆ రౌండ్ పూర్తయ్యేసరికి ఆలపాటి 76 వేల 951 ఓట్ల మెజారిటీతో కొనసాగుతున్నారు.
తొలి రోజే తేలిన ఫలితం..
ఉమ్మడి కృష్ణా - గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో కూటమి అభ్యర్థి హవా కొనసాగింది. ప్రతి రౌండ్ లోను ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆదిక్యం ప్రదర్శించారు. ఫిబ్రవరి 27న ఏపీలోనే మూడు ఎమ్మెల్సీ స్థానాలకి ఎన్నికలు నిర్వహించారు. ఇందులో రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు కాగా, ఒకటి ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ నియోజకవర్గం. సోమవారం ఉదయం 8 గంటలకి గుంటూరులోనే ఏసీ కాలేజీలో ఉమ్మడి గుంటూరు - కృష్ణా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. మొత్తం 25 మంది అభ్యర్థులు పోటీ చేయగా ఇక్కడ రెండు లక్షల 41 వేల 873 ఓట్లు పోలయ్యాయి.
మొత్తం 9 రౌండ్లలో లెక్కింపు జరగనుండగా.. ప్రతి రౌండ్ లోను కూటమి అభ్యర్థి ఆలపాటి రాజా హవా కొనసాగింది. ఏడో రౌండ్ పూర్తయ్యేసరికి విజయానికి అవసరమైన 50% ఓట్లను అలపాటి రాజేంద్ర సాధించారు. కానీ మొత్తం ఓట్లు లెక్కించి, పూర్తి ఫలితాలు ప్రకటించడానికి మరికొంత టైం పడుతుంది. సీటింగ్ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు కు మాత్రమే చెప్పుకోదగ్గ కోట్లు పోలయ్యాయి. మిగిలిన అభ్యర్థులకు చాలా తక్కువ ఓట్లు వచ్చాయి.
ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీగా గాదె శ్రీనివాసులు
Gade Srinivasulu wins Teacher MLC: ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్టీయూ నుంచి పోటీ చేసిన గాదె శ్రీనివాసులు విజయం సాధించారు. మొదటి ప్రాధాన్యతా ఓట్లలో ఎవరికీ 50 శాతం ఓట్లు రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కించారు. ఈ క్రమంలో PRTU అభ్యర్థి గాదె శ్రీనివాసులు విజయం సాధించారు. పీడీఎఫ్ అభ్యర్థిగా బరిలో ఉన్న కోరెడ్ల విజయగౌరికి భారీగా ఓట్లు పోలయ్యాయి. దాంతో ఏపీటీఎఫ్ అభ్యర్థి పాకలపాటి రఘువర్మకు నష్టం జరిగింది. అయితే కూటమి పార్టీలు రఘువర్మతో పాటు గాదె శ్రీనివాసులు మీ తొలి, రెండో ప్రాధాన్యత ఓట్లు వేయాలని కూటమి పార్టీలు మద్దతిచ్చాయి. టీచర్ సంఘాల్లో పీఆర్టీయూకు ఉన్న పట్టు వల్ల పీఆర్‌టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసులను విజయం వరించింది.
ఉమ్మడి గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మూడో రౌండ్ పూర్తి అయ్యేసరికి కూటమి అభ్యర్థి పేరా భక్తుల రాజశేఖరం 48 వేల 923 ఓట్లు రాగా, సమీప ప్రత్యర్థి పిడిఎఫ్ అభ్యర్థి వీర రాఘవులకు 16 వేల 806 ఓట్లు వచ్చాయి. ప్రస్తుతానికి వీర రాఘవులుపై కూటమి అభ్యర్థి రాజశేఖర్ 32 వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఏలూరు సి ఆర్ ఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో ఈ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.