దళిత బంధు పథకం అమలు కోసం ప్రభుత్వం తాజాగా అదనపు విధివిధానాలను జారీచేసింది. ఎస్సీ అభివృద్ధి, సంక్షేమశాఖ అదనపు విధివిధానాలను జారీచేసింది. లబ్ధిదారులకు ఇచ్చే రూ.10 లక్షల నిధులతో సాధ్యమైతే రెండు యూనిట్లు ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఇద్దరు లేదా ఎక్కువ మంది కలిసి పెద్ద యూనిట్‌ను ఏర్పాటు చేసుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించింది. యూనిట్ల ఎంపిక పూర్తయ్యాక ఆయా రంగాల్లో లబ్ధిదారులకు రెండు వారాల నుంచి ఆరు వారాల్లోపు శిక్షణ ఇవ్వనున్నారు. లబ్ధిదారులను ప్రభుత్వమే వివిధ ప్రాంతాల్లో పర్యటనకు తీసుకెళ్లనుందని ప్రకటించింది. ఆయా రంగాల్లో విజయవంతమైన వారితో లబ్ధిదారులకు అవగాహన కల్పించనున్నారు. 


Also Read: అప్పుడు పదివేలు కూడా ఇవ్వని కేసీఆర్.. ఇప్పుడు పది లక్షలు ఇస్తా అంటే నమ్ముతున్నారా?


యూనిట్లను బట్టి గ్రూపులుగా వర్గీకరణ


దళిత బంధు లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ పూర్తయ్యాక ప్రత్యేకంగా బ్యాంకు ఖాతా తెరవాలని, సంబంధిత పాసుపుస్తకాలను లబ్ధిదారులకు అందించాలని ప్రభుత్వం తెలిపింది. ఆ ఖాతాలోకి రూ.10 లక్షలను కలెక్టర్ బదిలీ చేయాలని పేర్కొంది. లబ్దిదారులకు యూనిట్లను బట్టి గ్రూపులుగా వర్గీకరించాలని తెలిపింది. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు, రవాణా రంగం, తయారీ పరిశ్రమల రంగం, రిటైల్ దుకాణాలు, సేవలు సరఫరా రంగంగా విభజించాలని తెలిపింది. పది లక్షల రూపాయల యూనిట్ వ్యయం అయ్యే ప్రాజెక్టులను రీసోర్స్ బృందాలు రూపొందించాలని తెలిపింది. పది లక్షలు విలువ చేసేలా రెండు సబ్ యూనిట్లు కూడా ఉండవచ్చని తెలిపింది. ఒకరి కంటే ఎక్కువ మంది లబ్దిదారులు కలిసి పెద్ద మొత్తంలో  పెద్ద యూనిట్​కు ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని పేర్కొంది. 


Also Read: చివరి రక్తపు బొట్టు వరకు దళితుల అభివృద్ధికి కృషి : కేసీఆర్


లబ్దిదారులకు శిక్షణ


కలెక్టర్ రీసోర్ట్ బృందాలతో లబ్దిదారులకు వెళ్లాలని ప్రభుత్వం తెలిపింది. లబ్ధిదారుని ప్రాధాన్యం, ఆసక్తి, అనుభవం, యూనిట్ ఆర్థిక సాధ్యాసాధ్యాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉందని వెల్లడించింది. యూనిట్ల ఖరారు అనంతరం లబ్దిదారులకు శిక్షణ ఇవ్వాల్సి ఉంటుందని తెలిపింది. కలెక్టర్ అభిప్రాయం మేరకు ఆయా రంగాలు, యూనిట్ల అవసరాల మేరకు రెండు నుంచి ఆరు వారాల పాటు శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం తెలిపింది. లబ్ధిదారులకు ఆయా రంగాల్లో విజయవంతమైన వారిచే అవగాహన కల్పించాలని సూచించింది. లబ్ధిదారుల కుటుంబాలకు యూనిట్లపై పూర్తి అవగాహన కల్పించి, పూర్తి స్థాయిలో నడిపించేందుకు సిద్ధమయ్యారని కలెక్టర్, రీసోర్స్ బృందం సంతృప్తి చెందితే యూనిట్​ను వారికి అందించాలన్నారు. యూనిట్ల నిర్వహణలో రీసోర్స్ బృందాలు లబ్ధిదారులకు తగిన సహకారం అందించాల్సి ఉంటుంది. యూనిట్లన్నీ మంజూరై పూర్తి స్థాయిలో నడిచేలా పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేయాలని జిల్లా కలెక్టర్, రీసోర్స్ బృందాలకు ప్రభుత్వం స్పష్టం చేసింది.


Also Read: ఏ పథకానికీ లేని చట్టబద్ధత ‘దళిత బంధు’కు ఎందుకు? గతంలో చట్టబద్ధత కల్పించిన "బంగారు తల్లి" ఏమయింది ?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి