బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ముగిసింది. బండి సంజయ్  తొలిదశ పాదయాత్ర ముగిసిందని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ప్రకటించారు. ఆగస్ట్‌ 28న హైదరాబాద్ ఛార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం వద్ద ప్రారంభమైన బండి సంజయ్ పాదయాత్ర 36 రోజులపాటు 8 జిల్లాలు 19 అసెంబ్లీ నియోజకవర్గాలు 6 పార్లమెంట్‌ నియోజకవర్గాలలో 438 కిలోమీటర్లు సాగింది. 


వచ్చే ఎన్నికల్లో బీజేపీదే అధికారం


వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. తొలిదశ పాదయాత్ర ముగింపు సభలో ఆయన ప్రసగించారు. పాదయాత్రలు చేసేది సీఎం పదవి కోసం కాదన్న ఆయన తాను సీఎంలను అందిస్తానన్నారు. రాష్ట్రంలో ఎక్కడి వెళ్లినా సమస్యలు ఉన్నాయన్నారు. కేంద్రం ధాన్యం కొనమని ఎప్పుడూ చెప్పలేదన్నారు. వరి వేస్తే ఉరి అని ఎందుకు ప్రభుత్వం బెదిరిస్తోందన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే వైద్య, విద్య రంగాల అభివృద్ధి పథకాలపై తొలిసంతకం చేస్తానని బండి సంజయ్ అన్నారు. 








Also Read: తెలంగాణ ఆడపడుచులకు పండుగ కానుక.. బతుకమ్మ చీరల పంపిణీ ప్రారంభం... నేతన్నల జీవనస్థితి మారిందన్న మంత్రి కేటీఆర్


ఈటల రాజేందర్ గెలుపు తథ్యం


సీఎం కావాలని పాదయాత్ర చేయడం లేదని, ప్రజాసమస్యలు తెలుసుకోవడానికి అని పాదయాత్ర చేస్తున్నానని బండి సంజయ్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ స్కూళ్లను టీఆర్ఎస్‌ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక సౌకర్యాలు, తగిన సిబ్బంది లేరన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత బీజేపీపై ఉందన్నారు. టీఆర్ఎస్‌ ఎన్ని కుట్రలు చేసినా హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ గెలుపును అడ్డుకోలేరని స్పష్టం చేశారు.




Also Read: టీఆర్ఎస్ గూండాళ్లాగా పోలీసులు.. జంగ్ సైరన్ భగ్నం చేయాలని కుట్ర.. మధు యాష్కీ ఆరోపణ


నిరుద్యోగ భృతి ఏమైంది : కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ


బండి సంజయ్‌ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్ర తొలివిడత సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ముగిసింది. తొలిదశలో 36 రోజుల పాటు పాదయాత్ర సాగింది. ఈ సందర్భంగా హుస్నాబాద్‌లో ఏర్పాటు చేసిన బహిరంగసభకు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ హాజరయ్యారు. ప్రధాని మోదీ ప్రభుత్వం 80 కోట్ల మంది పేదలకు ఉచిత రేషన్‌ అందించిందన్నారు. కరోనా వేళ ఉచిత రేషన్‌తో ఇచ్చి పేదల ఆకలి తీర్చారన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కొన్నేళ్లుగా ఉద్యోగాలు భర్తీ చేయడంలేదన్నారు. నిరుద్యోగులకు రూ.3 వేల భృతి ఇస్తామన్న సీఎం కేసీఆర్‌ ఎందుకు ఇవ్వడంలేదన్నారు. ఎంఐఎం అంటే టీఆర్ఎస్ కు భయమని ఆరోపించారు. ఆ పార్టీ నేత చెప్పినట్టే కేసీఆర్‌ నడుచుకుంటారని విమర్శించారు. ఎంఐఎంకు భయపడి టీఆర్ఎస్ ప్రభుత్వం సెప్టెంబరు 17న విలీనదినం నిర్వహించట్లేదన్నారు. 




Also Read: తెలంగాణ కాంగ్రెస్ విద్యార్థి, నిరుద్యోగ జంగ్ సైరన్.. రేవంత్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత.. ర్యాలీకి అనుమతి లేదన్న సీపీ


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి