తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఇంటి వద్ద భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. కాంగ్రెస్‌ పార్టీ విద్యార్థి, నిరుద్యోగ జంగ్‌సైరన్‌ ర్యాలీకి పిలుపునిచ్చింది. ఈ ర్యాలీకి రేవంత్ రెడ్డి వెళ్లకుండా అడ్డుకొనేందుకు జూబ్లీహిల్స్‌లోని రేవంత్‌ నివాసం వద్ద పోలీసు బలగాలు మోహరించాయి. రాష్ట్రంలో విద్యార్థి, నిరుద్యోగుల సమస్యలపై కాంగ్రెస్‌ పార్టీ  జంగ్ సైరన్ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. దిల్‌సుఖ్‌నగర్‌- ఎల్బీనగర్‌ రూట్‌లో ఈ ర్యాలీకి అనుమతి లేదని, ట్రాఫిక్‌ జాం అవుతుందని పోలీసులు స్పష్టంచేశారు. ర్యాలీ నిర్వహించకుండా కట్టుదిట్టమైన పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ ర్యాలీ ఎలాగైనా చేపట్టి తీరుమతాని రేవంత్‌ తెలిపారు. 






పెద్ద ఎత్తున పోలీసుల మోహరింపు


కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు దిల్‌సుఖ్‌నగర్‌కు చేరుకునేందుకు సమాయత్తమవుతున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్‌ రెడ్డిని అడ్డుకొనేందుకు దాదాపు 100 మందికి పైగా పోలీసులు ఆయన నివాసం వద్ద మోహరించారు. కాంగ్రెస్‌ శ్రేణులు ప్రగతిభవన్‌ వైపు వెళ్లే అవకాశం కూడా ఉండటంతో అక్కడ కూడా పెద్ద ఎత్తున పోలీసులు మోహరించినట్టు సమాచారం.  కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన ‘విద్యార్థి, నిరుద్యోగ జంగ్‌సైరన్‌’ ర్యాలీకి వెళ్లకుండా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని ఆయన నివాసం వద్దే పోలీసులు అడ్డుకున్నారు. దిల్‌సుఖ్ నగర్‌ వెళ్లేందుకు ఇంట్లో నుంచి బయటకు వచ్చిన రేవంత్‌ను గేటు వద్దే పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు కాంగ్రెస్‌ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ శ్రేణులు నినాదాలు చేశాయి.  గృహనిర్బంధం చేస్తే ఆర్డర్‌ కాపీ చూపించాలని రేవంత్ రెడ్డి డిమాండ్‌ చేశారు. తెలంగాణ కోసం అమరుడైన శ్రీకాంత్‌ ఆచారికి గాంధీజీ జయంతి రోజున నివాళులు అర్పించే హక్కు లేదా? అని ప్రశ్నించారు.








Also Watch : సర్పంచ్‌లు ఏమైపోతారోనని ఓ భయముంది: అసెంబ్లీలో కేసీఆర్


ర్యాలీకి అనుమతి లేదు: రాచకొండ సీపీ


తెలంగాణ కాంగ్రెస్ చేపట్టిన ‘జంగ్‌ సైరన్‌’ ర్యాలీకి అనుమతి లేదని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. తెలంగాణలో నిరుద్యోగ జంగ్‌ సైరన్ పేరుతో ఇవాళ కాంగ్రెస్‌ చేపడుతున్న నిరసన ర్యాలీకి అనుమతి లేదన్నారు. దిల్‌సుఖ్‌నగర్‌ నుంచి ఎల్బీనగర్‌ వరకు కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించబోయే జంగ్‌ సైరన్‌ ర్యాలీకి అనుమతి లేదని వెల్లడించారు. విద్యార్థి, నిరుద్యోగ సమస్యలపై ‘విద్యార్థి, నిరుద్యోగ జంగ్‌ సైరన్‌’ పేరిట కాంగ్రెస్‌ పార్టీ ర్యాలీ చేపట్టతున్నారు. అంతకుముందు ర్యాలీ గురించి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. పోలీసులు అడ్డుకుంటే నేనే ముందుంటా, లాఠీ తగిలినా.. తూటా తగిలినా ముందు తనకే తగులుతుంది అని రేవంత్‌ వ్యాఖ్యానించారు. మరోవైపు దిల్‌సుఖ్‌నగర్‌ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. అక్కడ దుకాణాలను మూసివేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలువురు కాంగ్రెస్‌ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దిల్‌సుఖ్‌నగర్‌ మెట్రో స్టేషన్‌ను మూసివేశారు.


Also Read: టీఆర్ఎస్ గూండాళ్లాగా పోలీసులు.. జంగ్ సైరన్ భగ్నం చేయాలని కుట్ర.. మధు యాష్కీ ఆరోపణ


కేసీఆర్, కేటీఆర్ అనుమతి తీసుకోవాలా?


ఒక ఎంపీకి నియోజకర్గంలో పర్యటించే హక్కు లేదా అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. విద్యార్థి, నిరుద్యోగ జంగ్ సైరన్‌లో పాల్గొనేందుకు వెళ్తోన్న రేవంత్ ను జూబ్లీహిల్స్​లోని ఆయన నివాసం వద్దే పోలీసులు అడ్డుకున్నారు. గృహ నిర్భంధం చేయడంపై రేవంత్​ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శ్రీకాంత్‌చారికి నివాళి అర్పించే స్వేచ్ఛ కూడా లేదా అని పోలీసులను నిలదీశారు. తనను అడ్డుకోవాలనే ఉత్తర్వులు చూపిస్తే తిరిగి వెళ్తానన్నారు. ఎంపీ విధులకు భంగం కలిగిస్తున్నందుకు పోలీసులు చట్టపరంగా పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని రేవంత్ హెచ్చరించారు. శ్రీకాంత్‌చారికి నివాళి అర్పించాలంటే కేసీఆర్‌, కేటీఆర్‌ అనుమతి తీసుకోవాలా అని ప్రశ్నించారు. నివాళి అర్పించేందుకు వెళ్తానంటే పోలీసులు భద్రత కల్పించాలి కానీ అడ్డుకోవడం ఏమిటన్నారు. శ్రీకాంత్‌చారి విగ్రహానికి దండం పెడితే కేసీఆర్‌, కేటీఆర్‌కు కోపం ఎందుకన్నారు. 




ఎల్బీ నగర్ కూడలిలో కాంగ్రెస్ కార్యకర్త ఆత్మహత్యయత్నం



ఎల్‌బీనగర్‌ కూడలిలో కాంగ్రెస్‌ కార్యకర్త ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. పెట్రోల్‌ పోసుకుని విద్యార్థి కల్యాణ్‌ ఆత్యహత్యకు యత్నించారు. కల్యాణ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. శ్రీకాంత్‌చారి విగ్రహానికి నివాళి అర్పించేందుకు వచ్చిన కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్టుచేశారు. కాంగ్రెస్ విద్యార్థి, నిరుద్యోగి జంగ్ సైరన్ చేపట్టింది. 


కేసీఆర్ నియతృత్వ పాలనకు ఇది నిదర్శనం : మాణిక్యం ఠాగూర్


కాంగ్రెస్ కార్యకర్తలపై పోలీసుల చర్యను తప్పుపట్టారు కాంగ్రెస్ నేత మాణిక్యం ఠాగూర్ తప్పుబట్టారు. కాంగ్రెస్ కార్యకర్తను విచక్షణారహితంగా కొట్టారని ఆ ఫొటోలను ట్విట్టర్ లో షేర్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వం పాలన ఇంత క్రూరంగా ఉందని పేర్కొన్నారు. కొవిడ్ విపత్కర పరిస్థితుల్లో పాలుపంచుకున్న కాంగ్రెస్ కార్యకర్తలకు కేసీఆర్ ఇచ్చిన బహుమతి అని ట్వీట్ చేశారు. 




Also Read: ముగిసిన బండి సంజయ్ తొలిదశ పాదయాత్ర... సీఎం కావాలని పాదయాత్ర చేయడంలేదన్న సంజయ్... వచ్చే ఎన్నికల్లో బీజేపీదే అధికారమని ధీమా



ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి