తెలంగాణలో గిరిజనులకు, అటవీ అధికారులకు మధ్య తరచూ ఉద్రిక్త వాతావరణం సృష్టిస్తున్న పోడు భూముల సమస్యను పరిష్కరించేందుకు కేసీఆర్ 23వ తేదీన ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. జిల్లా  రోజంతా సుదీర్ఘంగా జరిగే ఈ సమావేశంలో అటవీ ప్రాంతాల్లో పోడు వ్యవసాయం చేస్తున్న ఆదివాసీలు, గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను  పరిష్కరించడంతో పాటు అడవి త రిగి పోకుండా ఉండేందుకు కావాల్సిన అన్ని చర్యల గురించి చర్చించి సమగ్ర కార్యాచరణ రూపకల్పన చేస్తారు.  సమావేశానికి అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ తో పాటు  సంబందిత శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులు, అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా కన్జర్వేటర్లు, డిఎఫ్‌ఓలను రావాలని ఆదేశించారు. 


Also Read : యాదాద్రి ల‌క్ష్మిన‌రసింహస్వామిని ద‌ర్శించుకున్న కేసీఆర్.. ఆలయంలో పనులు పరిశీలన


సమావేశానికి కంటే ముందే మూడు రోజుల పాటు ఉన్నతాధికారులు అటవీ ప్రాంతాలను పరిశీలిస్తారు. 20, 21, 22 తేదీలలో పోడు భూముల సమస్యను అధ్యయనం చేయడం కోసం క్షేత్ర స్థాయి వాస్తవాలను తెలుసుకోవడానికి అటవీశాఖ, గిరిజన సంక్షేమ శాఖ ఉన్నతాధికారుల బృందం హెలికాప్టర్‌ ద్వారా సంబంధిత అటవీ ప్రాంతాలను సందర్శించి పరిశీలిస్తారు. ఎన్నికల ప్రచారసభల్లో  తెలంగాణ సీఎం కేసీఆర్ పోడు భూముల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అయితే సమస్యలు పరిష్కారం కాలేదు. 


Also Read : జానారెడ్డి కన్నా ఈటల పెద్ద లీడరా ? 9 నెలలు పార్టీ పని మీదే ఉంటామన్న కేటీఆర్ !



తెలంగాణలో దాదాపుగా రెండు లక్షల మంది గిరిజన రైతులు అటవీ భూములు సాగు చేసుకుంటున్నారు. తమకు ఏరోజైనా హక్కులు వస్తాయన్న ఆశతో  రైతులు దుక్కులు దున్నుతుంటే.. అవే భూముల్లో హరితహారం కింద ఫారెస్ట్‌‌‌‌ ఆఫీసర్లు మొక్కలు నాటుతున్నారు. దీంతో అనేకచోట్ల ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయి.   ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో రోజుకోచోట ఘర్షణలు జరుగుతున్నాయి. కేసీఆర్ హామీ ఇచ్చిన మేరకు తమకు హక్కు పత్రాలు వస్తాయని గిరిజన రైతులు ఎదురుచూస్తున్నారు. 


Also Read : కేసీఆర్ మాటలకు అర్థాలే వేరా ? తెలంగాణలో ముందస్తు ఖాయమేనా ?


2006లో ఉమ్మడి ఏపీలో అప్పటి సీఎం వైఎస్సార్‌‌‌‌ రాష్ట్రవ్యాప్తంగా పోడు భూములకు ఫారెస్ట్  రైట్‌‌‌‌ యాక్ట్ హక్కు పత్రాలు అందించారు. 1,83,107 మంది దరఖాస్తు చేసుకుంటే 93,494 మందికి హక్కు పత్రాలు అందించారు. 80,890 అప్లికేషన్లను తిరస్కరించారు. వైఎస్‌‌‌‌ హయాంలో రైతులకు ఇచ్చేందుకు నిరాకరించిన 3.30 లక్షల ఎకరాల అటవీ భూములు ఇప్పటికీ రైతుల అధీనంలోనే ఉన్నాయి. వీటికి తోడు గడిచిన పదేళ్లలో మరో 4.06 లక్షల ఎకరాల భూములు ఇతరుల చేతిలో ఉన్నట్టు గూగుల్​ మ్యాప్​లు, సర్వేల ద్వారా ఫారెస్ట్ విభాగం గుర్తించింది. మొత్తం 7.36 లక్షల ఎకరాల అటవీ భూములు ఇతరుల అధీనంలో ఉన్నాయని ప్రభుత్వం గుర్తించింది. ఈ భూములకు పట్టాలివ్వాలని గిరిజన రైతులు కోరుతున్నారు.అలా ఇస్తే అడవి తరిగిపోతుదంని ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. ఈ సమస్ పరిష్కారానికే కేసీఆర్ 23న కేసీఆర్ సమావేశం నిర్వహిస్తున్నారు. 


Also Read : గుర్తులతో గుబులు... దుబ్బాక సీన్ రిపీట్ అవుతుందా..?... ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో ఆందోళన


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి