కష్టాల్లో ఉన్న ఆర్టీసీని  లాభాల బాట ఎక్కించే ప్రయత్నం ప్రారంభమైందని, గాడిలో పడుతున్న నేపథ్యంలో కరోనా వ్యాప్తి, డీజిల్ ధరల పెరుగుదల కారణంగా తిరిగి నష్టాల్లో కూరుకుపోవడం బాధాకరమని తెలంగాణ సీఎం కె. చంద్రశేఖర్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని రకాల చర్యలు చేపట్టి ఆర్టీసీని తిరిగి నిలబెట్టుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఆర్టీసీ పరిస్థితిపై మంగళవారం హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. కరోనా వ్యాప్తి, లాక్ డౌన్ సమస్యలతో పాటు కేంద్రం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరల కారణంగా ఆర్టీసీ ఆర్ధికంగా నష్టాల్లో కూరుకుపోతున్నదని, ఈ సంక్షోభం నుంచి ఆదుకోవాలని రవాణా శాఖ మంత్రి సహా ఆర్టీసీ చైర్మన్, ఎండీ సజ్జనార్, ఉన్నతాధికారులు సీఎం కేసీఆర్‌కు విన్నవించుకున్నారు.


కేవలం ఏడాదిన్నర కాలంలో  డీజీల్ ధరలు లీటరుకు రూ. 22 రూపాయలు పెరగడం వల్ల ఆర్టీసీపై రూ. 550 కోట్లు అధనపు ఆర్ధిక భారం పడుతున్నదని అధికారులు కేసీఆర్‌కు వివరించారు. డీజిల్‌తో పాటు టైర్లు ట్యూబులు తదితర బస్సు విడిభాగాల ధరలు పెరగడం కూడా ఆర్టీసీని నష్టాల్లోకి నెడుతున్నాయని చెప్పారు. మొత్తంగా ఆర్టీసీ రూ.600 కోట్ల ఆర్థిక భారాన్ని మోయాల్సి వచ్చిందన్నారు. కరోనాతో పాటు డీజిల్ ధరలు పెరగడం, ఆర్టీసీపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. ఈ నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ల వల్ల ఆర్టీసీ సుమారుగా 3000 కోట్ల రూపాయల ఆదాయాన్ని నష్ట పోయిందని ఆర్టీసీ అధికారులు తెలిపారు.  కేవలం హైద్రాబాద్ పరిథిలోనే నెలకు రూ.90 కోట్ల  వరకు ఆర్థిక నష్టం కలుగుతున్నదని తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న మొత్తం 97 డిపోలు కూడా నష్టాల్లోనే నడుస్తున్నాయని సీఎం కేసీఆర్‌కు వివరించారు.


Also Read: MP Asaduddin Owaisi House: ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ నివాసంపై దాడి... ఐదుగురు అరెస్ట్.. ఆ వ్యాఖ్యలే కారణమా?


ఈ కష్టకాలంలో ఆర్టీసీ చార్జీలు పెంచక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయనీ, చార్జీలు పెంచాల్సిన ఆవశ్యకతను రవాణాశాఖ మంత్రి సహా ఆర్టీసీ ఉన్నతాధికారులు సీఎం కేసీఆర్‌కు విన్నవించుకున్నారు. 2020 మార్చిలో అసెంబ్లీలోనే ప్రభుత్వం ఆర్టీసీ చార్జీలను పెంచుతామని ప్రకటిందని, కరోనా కారణంగా చార్జీలను పెంచలేదని ఈ సందర్భంగా కేసీఆర్‌కు గుర్తుచేశారు. ఉద్యోగుల సంక్షేమానికి పాటుపడుతూనే సంస్థను పటిష్టం చేసేదిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని కేసీఆర్ అన్నారు. పెరిగిన డీజిల్ ధరల ప్రభావం నుంచి బయటపడి భవిష్యత్తులో ఆర్టీసీ మనుగడ సాధ్యం కాదనే విషయాన్ని అధికారులు సీఎం కేసీఆర్ కు స్పష్టం చేశారు. ఛార్జీలు పెంచడం సహా ఇతర ఆదాయ మార్గాలను ఎంచుకోవాల్సి ఉందని అధికారులు భావిస్తున్నారు. 


Also Read: రేవంత్ రెడ్డిపై కేటీఆర్ రూ.కోటి పరువు నష్టం దావా... మధ్యంతర ఉత్తర్వులు జారీ... రేవంత్ రెడ్డికి నోటీసులు


ఆర్టీసీని లాభాల బాట పట్టించేందుకు అన్ని రకాల ప్రతిపాదనలను రాబోయే కేబినెట్ సమావేశంలో తేవాలని, అందులో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని సీఎం కేసీఆర్ తెలిపారు. విద్యుత్తు అంశంపై విద్యుత్ శాఖమంత్రి జగదీశ్ రెడ్డి, సిఎండీ ప్రభాకార్ రావు సీఎంతో చర్చించారు. గత ఆరేండ్లు గా విద్యత్ చార్జీలను సవరించలేదని, విద్యుత్ శాఖను గట్టెక్కించడానికి విద్యుత్ ఛార్జీలు పెంచాలని కేసీఆర్‌ను కోరారు. ఆర్టీసీ ఛార్జీలతో పాటు విద్యుత్ ఛార్జీల పెంపు విషయంపై వచ్చే కేబినెట్ భేటీలో తగు నిర్ణయం తీసుకుంటామని కేసీఆర్ వారికి హామీ ఇచ్చారు. 


Also Read: వైఎస్ షర్మిల అరెస్టు... నిరుద్యోగ దీక్షకు అనుమతి నిరాకరించడంపై షర్మిల ఆగ్రహం... సీఎం కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి