వైద్యుల నిర్లక్ష్యం ఓ నిండు గర్భిణి ప్రాణం తీసింది. ప్రసవం చేసే సమయంలో మహిళ కడుపులో వైద్యులు దూది మరచిపోవడంతో ఆమె మృతి చెందింది. ఏడాది క్రితం రాయగిరికి చెందిన మహిళకు యాదాద్రి భువనగిరిలోని కె.కె. ఆసుపత్రిలో ప్రసవం జరిగింది. ఆ తర్వాత నుంచి మహిళ కడపునొప్పితో బాధపడుతోంది. దీంతో బంధువులు ఆమెను ఇటీవల చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షల్లో మహిళ కడుపులో వైద్యులు దూదిని గుర్తించారు. తొలి కాన్పు సమయంలో కడుపులో వైద్యులు దూది మరిచిపోయినట్లు తేలింది. కాగా చికిత్స పొందుతూ ఆరు నెలల గర్భిణి ఇవాళ మృతి చెందింది. మహిళ కడుపులో దూది కారణంగా పేగులు దెబ్బతిన్నట్లు వైద్యులు వెల్లడించారు. దీంతో గర్భిణీకి తొలి కాన్పు చేసిన ఆస్పత్రి ఎదుట బంధువులు ఆందోళనకు దిగారు. మహిళ మృతికి ఆస్పత్రి వైద్యులే కారణమని ఆగ్రహం వ్యక్తంచేశారు. 


Also Read: Kakinada: కాకినాడలో వైద్య విద్యార్థిని హత్య.. ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తే కారణం


కడుపులో దూది


వైద్యుల నిర్లక్ష్యం ఓ మ‌హిళ నిండు ప్రాణాల‌ు తీసింది. ఏడాది పాప‌ను అనాథ చేసి కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది. యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా రాయ‌గిరి గ్రామానికి చెందిన ఓ గ‌ర్భిణి కాన్పు కోసం ఏడాది క్రితం భువ‌న‌గిరి కేకే ఆస్పత్రిలో చేరింది. ఆమెకు వైద్యులు స‌ర్జరీ నిర్వహించి డెలివరీ చేశారు. ప్రస‌వం మ‌హిళ తీవ్ర క‌డుపునొప్పితో బాధ‌ప‌డింది. క‌డుపునొప్పి ఇంకా తీవ్రం అవ్వడంతో ఇటీవ‌లే చికిత్స కోసం హైద‌రాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. వైద్యులు ఆమెకు అన్ని ర‌కాల మెడిక‌ల్ టెస్టులు చేయగా క‌డుపులో దూది ఉన్నట్లు తెలిసింది. 


Also Read: Hyderabad: మీకు పని మనిషి ఉన్నారా? తస్మాత్ జాగ్రత్త! మీకూ ఇలా జరగొచ్చు.. ఇదో కొత్త రకం మోసం


బంధువుల ఆందోళన


తొలికాన్పు స‌మ‌యంలో ఆమె కడుపులో దూది మరిచిపోయి కుట్లు వేశారు. ఆ దూది అలాగే ఉండ‌టంతో పేగులు దెబ్బతిని తీవ్రమైన క‌డుపునొప్పికి కారణమైంది. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మహిళ చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో ఆమెకు తొలి కాన్పు చేసిన భువ‌న‌గిరి కేకే ఆస్పత్రి ఎదుట మృత‌దేహంతో కుటుంబ స‌భ్యులు, బంధువులు ఆందోళ‌న‌కు చేశారు. మ‌హిళ మృతికి ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యమే కార‌ణ‌మ‌ని బంధువులు ధ‌ర్నాకు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. 


Also Read: Bangalore Fire Accident: బెంగళూరులో భారీ అగ్ని ప్రమాదం... మంటల్లో ఇద్దరు సజీవ దహనం.. వైరల్ అవుతున్న ప్రమాద వీడియోలు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి