కర్ణాటక రాజధానిలో బెంగళూరులో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బెంగళూరు ఐఐఎమ్ సమీపంలోని దేవర చిక్కనహళ్లి ఆశ్రిత్ అపార్ట్‌మెంట్‌లో ఈ ప్రమాదం జరిగింది. మంటల్లో చిక్కుకుని ఇద్దరు సజీవ దహనమయ్యారు. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకున్నారు. మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మూడు ఫైర్ ఇంజిన్లు మంటలను ఆర్పుతున్నాయి. మూడో అంతస్తులోని ఓ ఫ్లాట్​లో చిక్కుకున్న మహిళ సజీవ దహనమైన వీడియో వైరల్​గా అయ్యింది. సిలిండర్ పేలుడు ఈ అగ్ని ప్రమాదానికి కారణమని అధికారులు ప్రాథమిక నిర్థారణకు వచ్చారు.

Continues below advertisement

Continues below advertisement

Also Read: Breaking News: గజ్వేల్‌లో భారీ అగ్ని ప్రమాదం.. రూ.50 కోట్ల వరకూ ఆస్తి నష్టం!

మంటలు క్షణాల్లోనే ఇతర ఫ్లాట్లకు మంటలు వ్యాపించాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అగ్ని ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పలువురిని ఆసుపత్రికి తరలించామని అగ్నిమాపక అధికారి ఒకరు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉందని ఆయన అన్నారు. 

Also Read: Fire Accident: కృష్ణా జిల్లా గన్నవరంలో భారీ అగ్ని ప్రమాదం.. కాలిబూడిదైన ప్లాస్టిక్ సంచుల పరిశ్రమ... రూ.కోట్లలో ఆస్తి నష్టం

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి