ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ నివాసంపై కొందరు దుండగులు దాడి చేశారు. దిల్లీలోని అశోక రోడ్డులో ఉన్న ఆయన ఇంటిపై దాడి జరిగింది. కిటికీ అద్దాలు పగులగొట్టినట్లు తెలుస్తోంది. ప్రహరీ గోడ, గేటును ధ్వంసం దుండగులు చేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న దిల్లీ పోలీసులు ఒవైసీ ఇంటి వద్దకు చేరుకొని ఐదుగురిని అరెస్ట్ చేశారు. అసదుద్దీన్ ఒవైసీ ఇంటిపై దాడికి పాల్పడిన మొత్తం ఐదురుగు నిందితులను అరెస్టు చేశామని డీసీపీ దీపక్ యాదవ్ తెలిపారు. ఎంపీ కొద్దిరోజుల క్రితం చేసిన వ్యాఖ్యల కారణంగా ఈ దాడి చేసినట్లు నిందితులు విచారణలో తెలిపారు. తదుపరి విచారణ చేస్తున్నామన్నారు.
ఐదుగురు అరెస్టు
దిల్లీలోని ఎంపీ అసదుద్దీన్ అధికారిక నివాసంపై మంగళవారం దాడి జరిగింది. హిందూ సేనకు చెందిన సభ్యులుగా అనుమానిస్తున్న కొందరు ఈ దాడి చేసినట్లు సమాచారం. దాడికి పాల్పడిన ఐదుగురిని దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. 34 అశోకా రోడ్‌లోని అసదుద్దీన్ ఒవైసీ నివాసానికి వచ్చిన ఏడు, ఎనిమిది మంది దుండగులు నివాసం ముందున్న నేమ్ ప్లేట్‌ను ధ్వంసం చేశారు. విద్యుత్ దీపాలు, కిటికీలు పగలగొట్టారు. ఈ ఘటన జరిగిన సమయంలో అసదుద్దీన్ ఒవైసీ ఆ భవనంలో లేరు.
Also Read: PM Modi: 'గూండాలు, అవినీతిపరుల పాలన అంతం.. అభివృద్ధి వైపు యూపీ పరుగులు'
యూపీ ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలు
కొందరు దుండగులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ అసదుద్దీన్ నివాసంపై ఇటుకలతో దాడి చేశారని బంగ్లా వద్ద ఉన్న సెక్యురిటీ సిబ్బంది తెలిపారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులుదాడికి పాల్పడిన ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఏ సంస్థకు చెందినవారని వారిని ప్రశ్నిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఈ దాడి జరినట్లు తెలుస్తోంది. త్వరలో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందుకోసం యూపీలో అసదుద్దీన్ ఒవైసీ విస్తృత ప్రచారం చేస్తున్నారు.
Also Read: 2022 UP Election: యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ వ్యూహమిదే.. !