తెలంగాణ విద్యార్థులకు శుభవార్త. కొత్త ఉద్యాన పాలిటెక్నిక్‌ కళాశాలల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం-2007 చట్ట సవరణ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. సవరణ బిల్లును వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యాన విశ్వవిద్యాలయం ద్వారా అటవీ కళాశాల, పరిశోధనా సంస్థలు, కీలక ఉద్యాన రంగంలో ప్రైవేటు పాలిటెక్నిక్‌ కళాశాలల ఏర్పాటుకు అవకాశం కలిగింది. అటవీ కళాశాల, పరిశోధనా సంస్థ ద్వారా అటవీ రంగంలో బహుళ డిగ్రీ, డిప్లొమో కోర్సులు అందించడానికి ఈ విశ్వవిద్యాలయానికి ప్రభుత్వం వీలు కల్పించింది. 


Also Read: Huzurabad News: హుజూరాబాద్‌లో ప్రచార వ్యూహాలు షురూ.. మార్నింగ్ వాక్‌లో మంత్రి, గ్రౌండ్‌లో ఎక్సర్‌సైజులు


వృత్తి, విద్యా నిపుణులకు ఉపాధి అవకాశాలు


ఫలితంగా ఇక్కడ చదివే విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందని ప్రభుత్వం తెలిపింది. అటవీ విద్య, పరిశోధన కోసం ఆయా రంగాల నిపుణులకు విస్తృతమైన అవకాశాలు లభిస్తాయి. తెలంగాణలో ఉద్యానరంగానికి ఉన్న అవకాశాల దృష్ట్యా ఉద్యాన విశ్వవిద్యాలయం ద్వారా వృత్తి విద్యా నిపుణులకు మంచి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. 


Also Read: వర్క్ ఫ్రం హోం ఇక ముగిసినట్లే.. ఆఫీసులు తెరవనున్న దిగ్గజ కంపెనీల జాబితా ఇదే..


విద్యార్థులను హరితనిధిలో భాగస్వామ్యం


విద్యార్థులను హరితనిధిలో భాగస్వామ్యం చేయాలనే ఆలోచన ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్​అన్నారు. ప్రాథమిక పాఠశాల విద్యార్థుల ప్రవేశాలప్పుడు రూ.5 జమ చేయాలని సీఎం సూచించారు. అలాగే హైస్కూల్‌ విద్యార్థులు రూ.15, ఇంటర్‌ విద్యార్థులు రూ.25, డిగ్రీ విద్యార్థులు రూ.50, వృత్తి విద్యా కోర్సుల విద్యార్థులు రూ.100 జమచేయాలని సూచించారు. లైసెన్స్‌ల రెన్యువల్‌ సమయంలో హరితనిధి జమకు భావిస్తున్నామన్నారు. వ్యాపారులు, బార్లు, మద్యం దుకాణదారులు జమ చేయాలని సీఎం కేసీఆర్ అన్నారు.​రెన్యువల్‌ సమయంలో రూ.వెయ్యి జమకు ప్రతిపాదన చేశామని సీఎం తెలిపారు. రాష్ట్రంలో నిత్యం 8 వేలకు పైగా రిజిస్ట్రేషన్లు జరుగుతాయన్నారు. భూముల రిజిస్ట్రేషన్ల సమయంలో రూ.50 జమ చేయాలన్నారు. పోడు భూముల వ్యవహారం పరిష్కారానికి గిరిజనులకు ప్రభుత్వం హామీ ఇచ్చిందని తెలిపారు. 


Also Read: మీ మాటలు వింటే జాలిగా ఉంది.. కేసీఆర్ అసంతృప్తి, అందరికీ అన్ని వివరాలిస్తామని వెల్లడి


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్‌ చేయండి