నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి శివారులో ఉన్న తెలంగాణ యూనివ‌ర్సిటీ (టీయూ) వివాదాలకు కేరాఫ్‌గా మారింది. యూనివర్సిటీ వీసీ నియామకం మొదలు ప్రతి విషయం వార్తల్లోకెక్కుతూనే ఉంది. వర్సిటీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీలో అక్రమాలు జరుగుతున్నాయని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఔట్ సోర్సింగ్ ఉద్యోగ నియామకాలు ఎలాంటి నోటిఫికేషన్లు లేకుండానే చేపడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఎదురు చూస్తుంటే అక్రమ మార్గంలో డబ్బులు తీసుకొని ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారని విద్యార్థి సంఘాలు విమర్శిస్తున్నాయి.


టీయూ ఎగ్జిక్యూటివ్ సభ్యుల సమావేశం కూడా నిర్వహించకుండా ఉద్యోగాలు భర్తీ చేయడమేంటని విద్యార్థి సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. నియామక ప్రక్రియకు సంబంధించి ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు కూడా లేవని.. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు అత్యవసరం పేరుతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారని ఆరోపించారు. టీయూలోని వివిధ శాఖలలో ఇటీవల అటెండర్లు, జూనియర్‌ అసిస్టెంట్లు తదితర పోస్టులను ఔట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేశారని చెబుతున్నారు. సిబ్బంది కొరత ఉండటంతో అత్యవసర విధానంలో ఉద్యోగాలను భర్తీ చేసినట్లు వీసీ చెబుతున్నారని ఆరోపిస్తున్నారు. 



Also Read: పండక్కి ఊరెళ్తున్నారా? ఈ పని తప్పక చేయండి.. లేదంటే.. పోలీసులు హెచ్చరిక 


పోస్టుకు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలు.. 
టీయూలో ఇటీవల 65 మందిని అక్రమ మార్గంలో రిక్రూట్ చేసుకున్నారని విద్యార్థి సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. జూనియర్ అసిస్టెంట్ పోస్టుకు రూ.2,00,000 నుంచి రూ.3,00,000 వసూలు చేశారని చెబుతున్నారు. అటెండర్ పోస్టులకు రూ.లక్షన్నర.. స్వీపర్ సెక్యూరిటీ గార్డ్ పోస్టులకు రూ.లక్ష.. ప్రోగ్రామర్ పోస్టుకు రూ.3,00,000.. ల్యాబ్ అసిస్టెంట్ పోస్టుకు రూ.2,00,000 చొప్పున వసూలు చేశారని తెలిపారు. ఈ నియామకాల విషయాన్ని మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ దృష్టికి తీసుకువెళ్లినట్లు పేర్కొన్నారు. గతంలో కూడా ఇదే మాదిరి అక్రమ నియామకాలు చేపడితే అవి రద్దయ్యాయని.. గుర్తు చేశారు.


ఎన్నో పోరాటాల ఫలితంగా టీయూ ఏర్పడిందని పేర్కొన్నారు. అక్రమ నియామకాలు చేపడితే ఊరుకోబోమని స్పష్టం చేశారు. దీనిపై ఉన్నత విద్యా మండలి అధికారులు స్పందించి.. వర్సిటీ వీసీ, రిజిస్ట్రార్‌లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. 


Also Read: ఆర్టీసీ బస్సులకి కూడా ‘అయ్యయ్యో వద్దమ్మా..’ ఈ టైంలో సజ్జనార్ ప్లాన్ మామూలుగా లేదుగా..!


పని భారం, సిబ్బంది కొరత వల్లే.. 
పని భారం, సిబ్బంది కొరత వల్ల నాన్ టీచింగ్ ఉద్యోగుల‌ను నియమించామని తెలంగాణ యూనివర్సిటీ వీసీ డి.రవీందర్ వెల్లడించారు. ఏజెన్సీ నుంచి ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాలను భర్తీ చేశామని తెలిపారు. దీనిపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. వర్సిటీలో ఏదైనా పద్ధతి ప్రకారంగానే జరుగుతుంని స్పష్టం చేశారు. 


Also Read: టీఆర్ఎస్ అధ్యక్షుడి ఎన్నికకు ముహూర్తం ఫిక్స్, తేదీ ఎప్పుడంటే.. కేటీఆర్ ప్రకటన


Also Read: హుజురాబాద్‌లో 30, బద్వేలులో 15 మంది ! ఉపఎన్నికల్లో అభ్యర్థుల తుది జాబితా ఖరారు !



ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి