నిజామాబాద్‌లో బీజేపీ నేత పరాయి మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఘటన వెలుగులోకి రావడం రచ్చ రేపింది. బీజేపీ కార్పొరేటర్ భర్త అక్రమ సంబంధం పెట్టుకోవడంతో అమ్మాయి తరపు వారు అతణ్ని చెప్పుతో కొట్టారు. దీనికి సంబంధించిన వీడియోలు బయటికి రావడంతో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. పూర్తి వివరాలివీ..


Also Read: Jubilee Hills: భార్య వేలు కట్ చేసి పారిపోయిన భర్త.. వెతుకుతున్న జూబ్లీహిల్స్‌ పోలీసులు


స్థానికులు, బాధితులు వెల్లడించిన వివరాల ప్రకారం.. నిజామాబాద్‌లోని వినాయక నగర్‌ ప్రాంతంలో బీజేపీ కార్పొరేటర్ భర్త ఆకుల శీను మరో యువతితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఆకుల శీను కొంత కాలంగా తమ కూతురికి మాయ మాటలు చెప్పి మోసం చేశాడని యువతి తల్లిదండ్రులు ఆవేదన చెందారు. వినాయక నగర్‌లోని బీజేపీ కార్పొరేటర్ భర్త ఇంటి ముందు బాధితులు బుధవారం విపరీతంగా ఆందోళన చేయడంతో ఈ విషయం బయటకు పొక్కింది.


Also Read: Hyderabad: తల పగలగొట్టుకొని, గాజు పెంకులు నమిలి, బ్లేడుతో కోసుకొని వ్యక్తి నానా బీభత్సం..


అయితే, కార్పొరేటర్ భర్త తీరుపై గతంలోనూ బాధిత తల్లిదండ్రులు ఎన్నోసార్లు గుట్టుగా బెదిరించారని, అయినా ఆయన వినలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో నిన్న రాత్రి కార్పొరేటర్ భర్త తన కూతురిని ఎత్తుకెళ్లాడని అమ్మాయి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే బూతులు తిడుతూ దేహశుద్ధి చేశారు. తమకు న్యాయం చేయాలంటూ అమ్మాయి తల్లిదండ్రుల ఆవేదన చెందారు. ఎత్తుకెళ్లిన అమ్మాయిని కాంగ్రెస్ సర్పంచ్ శేఖర్ గౌడ్ ఇంట్లో బీజేపీ కార్పొరేటర్ భర్త ఉంచినట్లుగా తెలుస్తోంది. తమ అమ్మాయిని అప్పగించాలంటూ తల్లిదండ్రుల ఆందోళన చేస్తున్నారు.


Also Read: Hyderabad Theft: ఇంట్లో చోరీ.. వృద్ధురాలి తెలివితో వెంటనే పట్టుబడ్డ దొంగ, ఆ టెక్నిక్ ఏంటంటే..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి