ఆర్మూర్‌లోని జియాయత్ నగర్ లో నదీమ్ అనే వ్యక్తి ఇంట్లో NIA తనిఖీలు
నదీమ్ బ్యాంకు ఖాతాలోకి విదేశాల నుంచి నగదు బదిలీ అయినట్టు సమాచారం
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో ఇద్దరిని అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ
ఇద్దరి బ్యాంకు ఖాతాలో అనుమానిత లావాదేవీల గుర్తింపు
ఉగ్రవాద సంబంధ కోణంలో అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ బృందం
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో ఎన్ఐఏ (National Investigation Agency) బృందం సోదాలు కొనసాగిస్తోంది. ఎన్ఐఏ అధికారులు ఆకస్మిక దాడులు జరిపి ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. పాకిస్థాన్ నుంచి నిధుల రాకపై అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. ఆర్మూర్ పట్టణంలోని జియాయత్ నగర్‌కు చెందిన నవీద్ ఓ చికెన్ సెంటర్ లో పని చేసేవాడు. రెండు నెలల కిందట అక్కడ పని మానేశాడు. అతడికి పాకిస్థాన్ నుంచి ఓ ఫోన్ కాల్ వచ్చింది. దాంతో పాటు నిధులు అందుతున్నాయని ఎన్ఐఏ అనుమాని స్తోంది.
పాక్ నుంచి ఫోన్ కాల్..
పక్కా సమాచారంతో శనివారం సాయంత్రం నిజామాబాద్ జిల్లాకు చేరుకున్న ఎన్ఐఏ ఎస్పీ ఆధ్వర్యంలోని అధికారుల బృందం.. ఆదివారం ఉదయం జిరా యత్నగర్ ప్రాంతానికి చేరుకుంది. నిర్మల్ జిల్లా భైంసాకు వెళ్లిన నవీద్.. మధ్యాహ్న సమయంలో ఇంటికి చేరుకోగానే అదుపులోకి తీసుకుని విచారించారు. పాకిస్థాన్ నుంచి నిధులు అందాయా, అక్కడినుంచి ఎవరు ఫోన్ చేశారు, వారు ఏ పనులు అప్పగించారన్న విషయాలపై ప్రశ్నించినట్లు తెలిసింది. అలాంటిదేమీ లేదని నవీద్ సమాధానం ఇచ్చాడని తెలుస్తోంది.
గెస్ట్ హౌస్‌కు తీసుకెళ్లి విచారణ..
నవీద్ ఇంట్లో సోదాలు నిర్వహించిన అనంతరం నవీద్‌ను నిజామాబాద్ పోలీస్ గెస్ట్ హౌస్ కు తీసుకువెళ్లి విచారిస్తున్నారు. పాకిస్థాన్‌కు చెందిన ఉగ్ర సంస్థలతో సంబంధాలపై ఆరా తీస్తున్నట్లు తెలిసింది. అలాగే నవీద్ బ్యాంకు అకౌంట్, లావాదేవీలపైనా అధికారులు ఆరా తీస్తున్నారు. నవీద్ కుటుంబ సభ్యులను విచారణ చేపట్టిన గెస్ట్ హౌస్ లోనికి అనుమతించలేదు. దీంతో వారు బయటే నిరీక్షిస్తున్నారు. సుమారు నాలుగు గం టలకుపైగా విచారించిన అనంతరం ఎన్ఐఏ అధికారులు నవీద్‌ను అతడి కుటుంబ సభ్యులకు అప్పగించారు. దర్యాప్తులో భాగంగా అవసరమైనప్పుడు విచారణకు రావాలని సూచించారు.
Also Read: Chikoti Praveen: చికోటి ప్రవీణ్ ఇంటి వద్ద గుర్తుతెలియని వ్యక్తుల పహారా, ఆందోళనలో కుటుంబ సభ్యులు!
ఇద్దరు వ్యక్తులకు ఉగ్ర లింకులు !
నవీద్ అనే వ్యక్తితో పాటు మరొకరికి పాకిస్థాన్ నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయని, వారికి విదేశాల నుంచి బ్యాంకు ఖాతాల్లోకి నగదు బదిలీ అయినట్లు ఎన్ఐఏ అధికారులు భావిస్తున్నారు. ఇద్దరు అనుమానితుల కదలికలపై ఎన్ఐఏ నిఘా ఉంచింది. వారి నుంచి బ్యాంకు ఖాతాల వివరాలు, పాక్ నుంచి కాల్స్ వచ్చాయా అనే కోణంలో విచారణ కొనసాగుతోంది.
మరోవైపు పీఎఫ్ఐ కేసు విచారణ
నిజామాబాద్ జిల్లాలో ఇటీవల కలకలం రేపిన పీఎఫ్ఐ కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు. పీఎఫ్ఐ కార్యకలాపాలపై ఆరా తీసే పనిలో పడ్డారు. పీఎఫ్ఐ సభ్యులను అరెస్టు తర్వాత ఆ సంస్థకు చెందిన సభ్యుడు అబ్దుల్ ఖాదర్‌ను కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. అరెస్టై రిమాండ్‌లో ఉన్న ఉగ్రసంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ట్రైనర్ అబ్దుల్ ఖాదర్‌ను పోలీసులు కోర్టు ద్వారా అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఉగ్ర కార్యకలాపాలు ఎక్కడెక్కడ నిర్వహించారు. ఎక్కడెక్కడ శిక్షణ ఇచ్చారనే అంశాలను ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. నిజామాబాద్ పీఎఫ్ఐ శిక్షణ ఇచ్చిన 200 మంది సభ్యులు ఎక్కడి నుంచి వచ్చారు. వారికి ఎక్కడ స్థావరం కల్పించారనే దానిపై పోలీసులు విచారించినట్లు సమాచారం. పీఎఫ్ ఐ సభ్యులు విచారణకు సహకరించకుంటే రిమాండ్‌లో ఉన్న నలుగురిని ఎన్‌ఐఏకు అప్పగించాలని పోలీసులు నిర్ణయానికి వచ్చిన ట్లు సమాచారం.