Adilabad KGBV Food Poison: ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని కస్తూరిబా గాంధీ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. 22 మంది విద్యార్థులు అస్వస్థత గురయ్యారు. అస్వస్థతకు గురైన విద్యార్థులను అంబులెన్స్ లో ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. రిమ్స్ ఆసుపత్రిలో విద్యార్థులకు చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న అధికారులు KGBV కి వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. గత రాత్రి తిన్న చికెన్ తోనే ఫుడ్ పాయిజన్ జరిగినట్టు సమాచారం తెలుస్తోంది. తరుచూ అన్నంలో పురుగులు వస్తున్నాయని విద్యార్థులు వాపోతున్నారు. ఈ విషయం బయటకు చేబితే టిసి ఇచ్చి పంపుతారన్న భయంతో విద్యార్థులు బయటకు సమాచారం చెరవేయలేదని పలువురు విద్యార్థులు చెబుతున్నారు. 


ఆదిలాబాద్ జిల్లా బేల మండల కెజిబివి పాఠశాలలో మొత్తం 240 మంది విద్యార్థులున్నారు. అయితే గత మూడు రోజుల నుండి ఆహారంలో తరుచూ పురుగులు వస్తున్నాయని విద్యార్థులు తెలిపారు. కాగా.. నిన్న చికెన్ తిన్నట్లు విద్యార్థులు చెబుతున్నారు. రాత్రి నుండి విద్యార్థులు వాంతులు విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన విద్యార్థులను అంబులెన్స్ లో ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.


బేల కెజిబివి పాఠశాలలో ఉన్న మిగత విద్యార్థులు అస్వస్థతకు గురైన విద్యార్థులను చూసి భయాందోళనకు గురవుతున్నారు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ కూడా చేయలేదు. అయితే వారికి ధైర్యం కల్పించెందుకు మిగత టీచర్స్ వారి ముందు ఉదయం చేసిన మంచి భోజనాన్ని క్లాస్ రూమ్ లోకి వెళ్ళి వారి ముందు తింటున్నారు. ఈ భోజనం బాగుంది తినొచ్చని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు.


Also Read: NIA Raids in Nizamabad: నిజామాబాద్‌లో ఎన్ఐఏ సోదాలు, ఇద్దరికి పాక్‌తో లింకులున్నాయని దర్యాప్తు ముమ్మరం


ఇటీవల బాసరలోనూ..
బాసర ట్రిపుల్ ఐటీలోనూ ఇటీవల ఫుడ్ పాయిజన్ జరిగిన సంగతి తెలిసిందే. రెండు వారాల క్రితం ఆర్జీయూకేటీలోని మెస్ లో ఫ్రైడ్ రైస్ తిన్న 150 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 40 మంది పరిస్థితి మరింత ఆందోళన కరంగా ఉండటంతో అత్యవసర వైద్యం కోసం నిజామాబాద్ కు తరలించారు. పీయూసీ-1, పీయూసీ-2 విద్యార్థుల మెస్‌ల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. 


భోజనం తిన్న తర్వాత విద్యార్థులకు వాంతులు, విరేచనాలు అయ్యాయి. కొందరు స్పృహ తప్పి పడిపోయారు. విద్యార్థుల పరిస్థితిని చూసి అధికారులు అప్రమత్తమై, క్యాంపస్‌లోనే ప్రాథమిక వైద్యం అందించారు. ఫుడ్ పాయిజన్ విద్యార్థుల సంఖ్య పెరగుతుండటంతో నిర్మల్‌, భైంసా నుంచి డాక్టర్లను పిలిపించారు. 


Also Read: Gas Cylinder Rate Down: గుడ్‌న్యూస్, దిగొచ్చిన గ్యాస్ సిలిండర్ ధర - తాజా రేటు ఎంతంటే


ఈ ఘటనపై తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించి, ట్రిపుల్ ఐటీ డైరెక్టర్, జిల్లా కలెక్టర్ తో మాట్లాడారు. ఆస్పత్రిలో చేరిన విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. ఫుడ్ పాయిజన్ కారణాలపై విచారణకు ఆదేశించారు. అందుకు అనుగుణంగా కారకులైన వారి లైసెన్సును రద్దు చేశారు.