LPG Price Reduced: వాణిజ్యపరంగా కమర్షియల్ సిలిండర్లను వాడే వారికి నేడు కాస్త ఉపశమనం లభించింది. నేడు వాణిజ్య LPG సిలిండర్ల (19 కిలోలు) ధరలు తగ్గాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC) కమర్షియల్ LPG సిలిండర్ల ధరలను తగ్గించింది. ఆ ప్రకారం నేడు ఢిల్లీలో ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.36 తగ్గింది. ఢిల్లీలో ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.36 తగ్గిన తర్వాత ప్రస్తుతం ఒక్కో సిలిండర్ ధర రూ.1,976.50గా మారింది. గతంలో ఈ సిలిండర్‌ రేటు రూ.2012.50 గా ఉండేది.





  • కోల్‌కతాలో ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.36.50 తగ్గిన తర్వాత ఒక్కో సిలిండర్ రూ.2095.50గా మారింది. గతంలో దీని ధర సిలిండర్ రూ.2132 గా ఉండేది.

  • ముంబయిలో LPG సిలిండర్ ధర రూ.36 తగ్గిన తర్వాత, సిలిండర్‌పై రూ.1936.50గా ఉంది. గతంలో ఈ సిలిండర్ ధర రూ.1972.50గా ఉంది.

  • చెన్నైలో ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.36.50 తగ్గిన తర్వాత ఒక్కో సిలిండర్ రూ.2,141గా మారింది. గతంలో దీని ధర సిలిండర్ రూ.2177.50 గా ఉండేది.


ఎవరు ప్రయోజనం పొందుతారు
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అంటే ఐఓసీ వెబ్‌సైట్‌లో ఇచ్చిన సమాచారం ప్రకారం, 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ.36 వరకు తగ్గింది. రెస్టారెంట్లు, హోటళ్లు, ధాబాలు, ఇతర వాణిజ్య అవసరాలకు 19 కేజీల సిలిండర్ వాడే వారికి ఈ రూ.36 తగ్గింపు ప్రయోజనం కలగనుంది.


దేశీయ ఎల్‌పిజి సిలిండర్ ధర
నాన్-సబ్సిడీ గృహ LPG సిలిండర్ల ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. 14.2 కిలోల డొమెస్టిక్ ఎల్‌పీజీ సిలిండర్ గత జూలై 6న ధర రూ.50 వరకూ పెరిగింది. అప్పటి నుంచి దానిలో ఎటువంటి మార్పు చేయలేదు. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల ధరలను పరిశీలిస్తే.. ఢిల్లీలో రూ.1053, ముంబయిలో రూ.1053, కోల్‌కతాలో రూ.1079, చెన్నైలో రూ.1068.50 గా ఉంది. తాజాగా వాణిజ్య సిలిండర్ ధరలు మాత్రమే పెంచగా, డొమెస్టిక్ సిలిండర్ ధరలు నిలకడగా ఉన్నాయి.