Traffic AT Panthangi Toll Plaza: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ సందడి వాతావరణం కనిపిస్తోంది. ముఖ్యంగా పండుగ దగ్గర పడుతున్న కొద్దీ తమ సొంతూళ్లకు చకా చకా వెళ్లిపోతున్నారు. ఈ క్రమంలో ఎదురయ్యే సమస్య ట్రాఫిక్ ఇబ్బందులు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే దారిలో సంక్రాంతి పండుగ సమయంలో ప్రతి ఏడాది ట్రాఫిక్ సమస్య తీవ్రతరం అవుతోంది.
జనం పల్లెబాట పడుటుండటంతో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ గేట్ వద్ద వాహనాల రద్దీ పెరిగింది. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ నేపథ్యంలో కొన్ని సంస్థలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వగా.. విద్యార్థులు, ఉద్యోగులకు పండుగ సెలవులు రానే వచ్చాయి. హైదరాబాద్ నుంచి ఏపీ వాసులు సొంతూళ్లకు ప్రయాణం కావడంతో ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేట్ ట్రావెల్స్ సైతం కిటకిటలాడుతున్నాయి. సంక్రాంతి రద్దీ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం దాదాపు 50 శాతం వరకు బస్సు టికెట్ ఛార్జీలు పెంచగా.. తెలంగాణ సర్కార్ మాత్రం అలాంటి పని చేయడం లేదని స్పష్టత వచ్చింది.
ఇదివరకే కొందరు తమ సొంతూళ్లకు వెళ్లిపోగా.. నేటి సాయంత్రం ట్రాఫిక్ మరింత అధికం కానుంది. దీంతో పంతంగి టోల్ ప్లాజా వద్ద గంటల కొద్ది వాహనాలు బారులు తీరే అవకాశం కనిపిస్తోంది. ఫాస్టాగ్ వంటి డిజిటల్ విధానం ద్వారా ట్రాఫిక్ సమస్య కొంత మేర తగ్గనుంది. మరోవైపు అదే తీరుగా ప్రజలు తమ సొంత వాహనాలలో ప్రయాణానికి మొగ్గు చూపుతున్నారు. వ్యక్తిగత వాహనాలు ఓ వైపు పెరుగుతున్నా.. ఆర్టీసీ, ప్రైవేట్ ట్రావెల్స్ సైతం సంక్రాంతి పండుగ సీజన్లలో మంచి కలెక్షన్లు రాబట్టుకుంటున్నాయి.
సాధారణ సమయం కంటే పండుగ పూట ప్రత్యేకంగా అదనపు సర్వీసులను ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు నడుపుతాయి. పగటిపూట ట్రాఫిక్ సమస్య కాస్త తక్కువగా ఉన్నా, రాత్రి వేళ మాత్రం వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోతాయి. ఫాస్టాగ్‌లో నగదు చెల్లింపుతో టోల్‌ప్లాజాల వద్ద రాకపోకలు సాఫీగా సాగితే పంతంగి వద్ద ట్రాఫిక్ కష్టాలు తీరినట్లేనని రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు.
Also Read: MP Raghurama: ఎంపీ రఘురామ ఇంటికి ఏపీ సీఐడీ పోలీసులు.. Hydలోని ఇంటి ఎదుట హడావుడి
Also Read: Viral News: మీ టూత్‌పేస్ట్‌లో ఉప్పుందా? ఉప్పే కాదు అంతకుమించి! ఈ షాకింగ్ విషయాలు చూడండి!
Also Read: Horoscope Today 12th January 2022: ఈ రాశుల వారికి ఈ రోజంతా శుభసమయమే... మీ రాశి ఫలితం
Also Read: OMICRON: ఒమిక్రాన్ వేరియంట్‌ను అణిచేయాలంటే బూస్టర్ డోస్ అవసరం... చెబుతున్న కొత్త పరిశోధన