జనవరి 1 నుంచి.. వస్త్ర పరిశ్రమపై విధించబోయే అదనపు జీఎస్పీ.. ప్రతిపాదనను విరమించుకోవాల్సిందిగా.. మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. ప్రజా వ్యతిరకమైన నిర్ణయాన్ని పున:సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. జీఎస్పీ కౌన్సిల్ మీట్ లో పన్ను పెంపు ప్రతిపాదనను విరమించుకోవాలని .. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు మంత్రి కేటీఆర్ లేఖ రాశారు.
వాటిపై జీఎస్టీ విధించడం వల్ల.. దేశంలోని వస్త్ర, చేనేత పరిశ్రమకు పూర్తిస్థాయిలో నష్టం జరుగుతుందని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. వస్త్ర పరిశ్రమపై ఆదారపడిన అనేకమంది కార్మికులపై ఈ నిర్ణయంతో ప్రభావం ఉంటుందని వివరించారు. ఈ కారణంగా వారి జీవితాలు.. దెబ్బతింటాయని ఆవేదన వ్యక్తం చేశారు. జీఎస్టీ పన్ను పెంపు విషయంలో వస్తున్న వ్యతిరేకతను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. లేకపోతే.. టెక్స్‌టైల్, అప్పారెల్ యూనిట్లు నష్టాలపాలవుతాయని, దీంతో.. ఆ పరిశ్రమలు మూతపడే అవకాశం ఉందని కేటీఆర్ అన్నారు.
కేంద్రం ఈ జీఎస్టీ పన్ను పెంపు విషయంలో వెనక్కుతగ్గకుంటే.. వ్యవసాయ చట్టాల విషయంలో రైతన్నలు.. తిరగబడినట్టే.. దేశంలోని నేతన్నలు కూడా తిరగబడతారని కేటీఆర్ చెప్పారు. పన్ను పెంపు ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం విరమించుకునే వరకు ఈ విషయంలో వస్త్ర పరిశ్రమ పారిశ్రామిక వర్గాలకు, నేతన్నలకు తెలంగాణ తరఫున అండగా ఉంటామని కేటీఆర్ చెప్పారు. జీఎస్టీ పన్ను పెంపు ద్వారా 80 నుంచి 85 శాతం దేశంలోని చేనేత జౌళి పరిశ్రమ ఉత్పత్తులపై ప్రభావం పడుతుందన్నారు. ధరలు పెరిగి సామాన్యులు ఇబ్బంది పడతారని కేటీఆర్ చెప్పారు.
Also Read: రైతుకు పొలంలో దొరికిన గుప్తనిధులు.. పూనకంతో ఊగిపోయిన మహిళ.. వాటా కావాలని వచ్చిన సోదరుడు.. చివరకు
Also Read: EC Press Conference Highlights: యూపీ ఎన్నికలు యథాతథం.. ఎన్నికల సంఘం కీలక ప్రకటన
Also Read: Covid 19 Cases in India: దేశంలో భారీగా పెరిగిన కరోనా వ్యాప్తి.. 1000కి చేరువైన ఒమిక్రాన్ కేసులు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి.