నల్లగొండ జిల్లా.. రామన్నపేట.. మండలంలోని కుంకుడుపాముల గ్రామంలో ఓ రైతు పొలం పనులు చేసుకుంటున్నాడు. అయితే పనిలో భాగంగా.. గట్లు తీస్తున్న సమయంలో.. మెుదట మట్టిపాత్ర దొరికింది. ఆ తర్వాత ఓ చిన్న ఇనుప పెట్టెసైతం దొరికింది. అప్పటికే ఏదో ఉంది అందులో అనే ఆత్రుత మెుదలైంది రైతుకు. ఆ పక్కనే తన సోదరుడి పొలం ఉంది. వాళ్లు ఉన్నది పట్టించుకోకుండా.. వాటిని తెరిచాడు ఆ రైతు.

Continues below advertisement


మట్టిపాత్రలో 38 వెండి నాణేలు, 5 వెండి పట్టీలు కనిపించాయి. విరిగిపోయిన 14 వెండి రింగులు కూడా ఉన్నాయి. ఇక ఇనుప పెట్టే తెరిచి చూసేసరికి.. అందులో.. 19 బంగారు బిళ్లలు, ఐదు చిన్నచిన్న బంగారు గుండ్లు కనిపించాయి. అయితే అందులో దొరికిన వెండి నాణేలపై.. ఉర్దూ పదాలు రాసి ఉన్నాయి. ఆ రైతు సోదరుడి పొలంలోకి పనికి వచ్చిన కొంత మంది మహిళలు.. నాణేలను తలా ఒకటి తీసుకున్నారు.  ఈ సమయంలో ఓ మహిళ.. తనకు పూనకం వచ్చినట్టు ఊగి.. వాటిని ముట్టుకోవద్దని హెచ్చరించింది. వాటిని తీసుకుంటే... మంచిది కాదని చెప్పింది. దీంతో భయపడిన మహిళలు.. వాటిని అక్కడే వదిలేశారు. 


పొలంలో దొరికిన వాటిని ఆ రైతు తీసుకెళ్లి.. పెంటకుప్పలో పెట్టాడు. ఈ విషయం తెలిసిన రైతు సోదరుడు వచ్చి.. గట్టుపై దొరికింది కాబట్టి.. తనకూ వాటా కావాలని చెప్పాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య గొడవ మెుదలైంది. విషయం ఆ ఊరి పెద్ద వరకు వెళ్లింది.  సమానంగా పంచుకుంటే.. ఇద్దరికీ మంచిదని .. పెద్దమనిషి సూచించాడు. అయినా.. ఈ గుప్త నిధులపై సమస్య పోలేదు. గొడవలు ఇంకా ఎక్కువ అవ్వడం మెుదలయ్యాయి. దీంతో చేసేదేమీ లేక.. తనకు పొలంలో దొరికిన గుప్త నిధులను తీసుకెళ్లి రామన్నపేట పోలీసులకు అప్పజెప్పాడు ఆ రైతు. గుప్తనిధి వివరాలను రెవెన్యూ అధికారులకు అందించామని పోలీసులు తెలిపారు.


Also Read: Nizamabad News: సన్‌ఫ్లవర్‌ విత్తనాలు బ్లాక్‌లో అమ్ముతున్నారు... తెలంగాణ మంత్రిపై బీజేపీ ఎంపీ సంచలన ఆరోపణలు


Also Read: Hyderabad Traffic: రేపు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు... ఫ్లైఓవర్లు మూసివేత, ఓఆర్ఆర్ పై కార్లకు నో ఎంట్రీ... ఆంక్షలు ఉల్లంఘిస్తే డ్రైవింగ్‌ లైసెన్స్‌ రద్దు


Also Read: Omicron in Telangana: కొద్దిరోజుల్లో TSలో తార స్థాయికి ఒమిక్రాన్.. 90 శాతం మందికి లక్షణాల్లేవు: డీహెచ్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి