తెలంగాణలో రేపటి నుంచి.. ఫీవర్ సర్వే నిర్వహించనున్నట్టు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. కరోనా కేసుల పెరుగుతున్న.. అధికారులతో మంత్రులు.. హరీశ్‌రావు, కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు కాన్ఫరెన్స్ నిర్వహించారు. కొవిడ్ నియంత్రణపై మంత్రులు దిశానిర్దేశం చేశారు.
ఫీవర్ సర్వేతో జ్వర లక్షణాలు ఉన్నవారిని గుర్తించి మెడికల్ కిట్లను పంపిణీ చేస్తామని హరీశ్‌రావు అన్నారు. సర్వే చేపట్టి.. పకడ్బందీగా.. కట్టడి చేసేలా ప్రణాళికలు.. రూపొందించాలని.. మంత్రి హరీశ్ రావు అన్నారు. ఫీవర్ సర్వేలో వ్యాధి లక్షణాలు గుర్తిస్తే.. హోం ఐసోలేషన్ కిట్లు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. సెకండ్ వేవ్ సమయంలో ఫీవర్ సర్వే.. దేశానికే ఆదర్శంగా ఉందని హరీశ్ రావు అన్నారు. ఇప్పుడు కూడా ఫీవర్ సర్వే చేసి... మెడికల్ కిట్లు ఇస్తామన్నారు.
కరోనా సోకినా కొంతమందిలో వ్యాధి లక్షణాలు కనిపించడం లేదని హరీశ్ రావు అన్నారు. కొంతమంది భయం కారణంగానో.., ఇతర కారణాలతో కరోనా పరీక్షకు.. ముందుకు రావడం లేదన్నారు. ప్రజల వద్దకు వెళ్లి సర్వే చేపడుతామని అన్నారు. ఇందులో భాగంగానే.. ముందు జాగ్రత్తగా జనవరి 21 నుంచి ఫీవర్ సర్వే నిర్వహిస్తున్నట్టు హరీశ్ రావు చెప్పారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ నెలరోజుల క్రితమే టెస్టింగ్, హోం ఐసోలేషన్ కిట్లు సిద్ధం చేసుకోవాలన్నారు. 2 కోట్ల టెస్టింగ్ కిట్లు, కోటి హోం ఐసోలేషన్ కిట్లు రెడీగా ఉన్నాయి. అన్ని జిల్లాల్లోని ఏరియా ఆస్పత్రులు, పీహెచ్‌సీలకు పంపించాం. మందులు కూడా అందుబాటులో ఉంచాం. 27 వేల పడకలను ఆక్సిజన్ బెడ్లుగా మార్చాం. 76 ఆస్పత్రుల్లో ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లు నిర్మించాం.
- హరీశ్ రావు, వైద్యారోగ్య శాఖ మంత్రి