ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో నేడు వాతావరణం పొడిగానే ఉంటుందని వాతావరణ విభాగం అధికారులు ప్రకటించారు. అమరావతిలోని వాతావరణ కేంద్రం ప్రకటించిన వివరాల మేరకు.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రధానంగా ఈశాన్య గాలులు తక్కువ ఎత్తులో వీస్తున్నాయి. దీని ఫలితంగా ఆంధ్రప్రదేశ్‌లో రాగల మూడు రోజులు వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా ఆంధ్ర, యానం, దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలు అంతగా ఎలాంటి వర్ష సూచన లేదని అమరావతి వాతావరణ కేంద్ర సంచాలకులు వెల్లడించారు. ఈ మేరకు బుధవారం వారు ట్వీట్ చేశారు.






మత్స్యకారులు వేటకు కూడా వెళ్లవచ్చని సూచించారు. ఈ నెల 23 వరకూ ఏపీ తీర ప్రాంతం సహా బంగాళాఖాతంలో వారు చేపల వేటకు వెళ్లవచ్చని, ఎలాంటి ప్రమాద హెచ్చరికలు లేవని వెల్లడించారు.


Also Read: Hyderabad: క్రెడిట్ కార్డు గురించి ఈ డీటైల్స్ గూగుల్‌లో అస్సలు వెతకొద్దు! అలా చేసినందుకు రూ.1.3 లక్షలు లూటీ






తెలంగాణలో ఇలా..
హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించిన వివరాల మేరకు.. హైదరాబాద్ సహా పరిసర ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. ఉదయం సమయంలో పొగమంచు ఏర్పడే అవకాశం ఉంటుంది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 31 డిగ్రీల సెంటీగ్రేడ్.. కనిష్ఠం 15 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. వాయువ్య ఉపరితల గాలుల వేగం గంటకు 6 నుంచి 8 కిలో మీటర్లు ఉంటుంది. హైదరాబాద్‌లో గరిష్ఠ ఉష్ణోగ్రత 30.6 డిగ్రీల సెల్సియస్‌గా.. కనిష్ఠ ఉష్ణోగ్రత 15.2 డిగ్రీలుగా నమోదైంది. 






ఇక తెలంగాణ వ్యాప్తంగా 23వ తేదీ వరకూ ఎలాంటి వర్ష హెచ్చరికలు గానీ లేవు. రాష్ట్రమంతా వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేశారు. చలి తీవ్రత మాత్రం ఉంటుందని వివరించారు. 






Also Read: Fake Pregnancy: ఫేక్ ప్రెగ్నెన్సీతో భర్త, అత్తింటివారిని బోల్తా కొట్టించిన మహిళ.. ఎందుకో తెలిసి అవాక్కైన పోలీసులు


Also Read: ప్రగతిభవన్‌ వద్ద జేసీ దివాకర్ రెడ్డి హల్ చల్.. లోనికి వెళ్లే ప్రయత్నం.. వెనక్కి పంపేసిన పోలీసులు !


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి