జమునా హేచరీస్ భూముల వ్యవహారంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు షాక్ తగిలింది. ఆ భూముల్లో సీలింగ్ ల్యాండ్స్ ఉన్నట్లుగా మెదక్ కలెక్టర్ హరీశ్ ఆధ్వర్యంలోని కమిటీ తేల్చింది. పౌల్ట్రీ ఫాంకు పీసీవో అనుమతి లేదని కలెక్టర్ వెల్లడించారు. 56 మందికి చెందిన 76 ఎకరాల 30 గుంటల భూమిని ఈటల దౌర్జన్యంగా లాక్కున్నట్లుగా తాము గుర్తించామని మెదక్ కలెక్టర్ వెల్లడించారు. ఆ భూముల్లో ఎలాంటి అనుమతులు లేకుండానే భారీ షెడ్లు నిర్మించారని వివరించారు. సర్వే నెంబరు 97లో పౌల్ట్రీ పరిశ్రమ నిర్వహించారని వివరించారు. ఈటల భూముల అంశంపై కలెక్టర్‌ మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. 


మెదక్ కలెక్టర్ హరీశ్ ఈ అంశంపై సోమవారం మాట్లాడుతూ.. ‘‘జమునా హేచరీస్ భూములు తమ నుంచి లాక్కుని వ్యవసాయం చేసుకోనివ్వట్లేదని కొంత కాలం క్రితం ఒక ఫిర్యాదు వచ్చింది. దాంతో అప్పుడు ప్రాథమిక నివేదిక ఇచ్చాం. ఆ నివేదికలో 66 ఎకరాల అసైన్డ్ భూమి కబ్జాకు గురైందని అంచనా వేశాం. ఇప్పుడు సమగ్ర సర్వే చేశాక 70 ఎకరాల 30 గుంటలు అసైన్డ్ ల్యాండ్స్, సీలింగ్ ల్యాండ్ కబ్జా చేసుకున్నట్లుగా స్పష్టం అయింది. 56 మంది అసైనీల భూములను కబ్జా చేసినట్లు తేలింది. అచ్చంపేట, హకీంపేట పరిధిలో అసైన్డ్‌ భూముల కబ్జా జరిగింది. జమునా హేచరీస్‌ యాజమాన్యం అక్రమంగా కబ్జా చేసింది. అసైన్డ్‌ భూములను వ్యవసాయేతర అవసరాలకు వాడుతున్నారు’’ అని కలెక్టర్‌ చెప్పారు.’’ అని కలెక్టర్ హరీశ్ తెలిపారు.










Also Read: Hyderabad Omicron: హైదరాబాద్ వచ్చిన బ్రిటన్ మహిళకు ఒమిక్రాన్ ఉందా? రిపోర్ట్‌లో ఏం తేలిందంటే..


Also Read: Rythubandhu: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. త్వరలో మీ ఖాతాల్లోకి రైతుబంధు నిధులు


Also Read: Karimnagar: కరీంనగర్ లో కరోనా కలకలం... 46 మంది వైద్య విద్యార్థులకు పాజిటివ్


Also Read: Mahabubabad: కూతురి ముందే తండ్రిని కొట్టిన ఖాకీలు.. ప్లీజ్ మా డాడీని కొట్టొద్దంటూ ఏడ్చేసిన చిన్నారి.. వీడియో


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి