కరీంనగర్ జిల్లాలోని ఓ ప్రైవేట్ వైద్య కళాశాలలో కరోనా కలకలం రేగింది. వైద్య కళాశాలలో 46 మంది విద్యార్థులకి కరోనా సోకింది.  దీంతో కళాశాలలో మిగతా విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. కళాశాలకి యాజమాన్యం సెలవు ప్రకటించింది. కరీంనగర్‌ రూరల్ మండలం బొమ్మకల్‌లోని వైద్య కళాశాలలో కరోనా కేసులు కలకలం రేపాయి. కళాశాలలోని 46 మంది విద్యార్థులకు కోవిడ్ నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. దీంతో యాజమాన్యం కళాశాలకు సెలవులు ప్రకటించింది. కళాశాలలో వారం రోజుల క్రితం స్నాతకోత్సవం నిర్వహించారు. కరోనా లక్షణాలు ఉన్న ఒకరిద్దరు విద్యార్థుల నుంచి మిగిలిన వారికి కరోనా వ్యాపించి ఉంటుందని యాజమాన్యం భావిస్తుంది. శనివారం నిర్వహించిన పరీక్షల్లో 18 మంది విద్యార్థులకు కోవిడ్ నిర్ధారణ అయింది. ఆదివారం నిర్వహించిన పరీక్షల్లో 28 మందికి పాజిటివ్‌ వచ్చింది. కొందరు విద్యార్థుల్లో ఎలాంటి లక్షణాలు లేకపోయినా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో కరోనా లక్షణాలు లేని విద్యార్థులకు కోవిడ్ పరీక్షలు చేస్తున్నారు. 


Also Read: ఏపీలో కొత్తగా 154 కరోనా కేసులు నమోదు.. వైరస్ కారణంగా నలుగురు మృతి


కర్ణాటకలో పెరుగుతున్న కరోనా కేసులు 


కర్ణాటకలో పెద్ద ఎత్తున కరోనా కేసులు నమోదవుతున్నాయి. చిక్‌మగళూరు జిల్లాలోని జవహర్‌ నవోదయ విద్యాలయంలో విద్యార్థులకు కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో 40కి పైగా విద్యార్థులకు కరోనా సోకినట్లు తేలింది. దీంతో శివమొగ్గలోని ఓ ప్రైవేటు నర్సింగ్‌ కళాశాలలో 29 మంది విద్యార్థులకు పాజిటివ్‌ వచ్చింది. విద్యార్థుల్లో చాలా మందికి కోవిడ్ లక్షణాలు లేవని స్థానిక డిప్యూటీ కమిషనర్‌ తెలిపారు. దీంతో ఈ ప్రాంతాలను క్లస్టర్‌లుగా ప్రకటించారు. ఇక్కడ హాస్టళ్లను మూసివేసి శానిటేషన్ చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. కరోనా వ్యాప్తి చెందకుండా చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. కర్ణాటకలో కరోనా వ్యాప్తి కట్టడికి ఎక్కువ కోవిడ్ కేసులు వచ్చిన ప్రాంతాన్ని క్లస్టర్‌గా పరిగణిస్తామని సీఎం బసవరాజ్ బొమ్మై ప్రకటించారు. కర్ణాటకలో రెండు ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. 


Also Read:కరీంనగర్ లో కరోనా కలకలం... 46 మంది వైద్య విద్యార్థులకు పాజిటివ్


Also Read: లైట్‌గా జలుబు ఉందా? లైట్ తీసుకోవద్దు.. ఒమిక్రాన్‌కు అదే ప్రధాన లక్షణమట!


Also Read: మూడో భార్యతో ఉంటూ.. రెండో భార్యను చంపాలని భర్త క్షుద్రపూజలు.. చేతబడికి పాస్ పోర్ట్ సైజ్ ఫొటో




ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి