ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు స్థిరంగా నమోదవుతున్నాయి. 24 గంటల్లో 30,979 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. అందులో కొత్తగా 154 పాజిటివ్‌ కేసులు నమోదైనట్టు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. కొవిడ్ తో కొత్తగా  గుంటూరులో ఇద్దరు, కృష్ణా, చిత్తూరు జిల్లాల్లో ఒక్కొక్కరు మృతి చెందారు. కరోనా బారి నుంచి కొత్తగా 177 మంది కోలుకున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 2,122 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.






ఏపీ కరోనా కేసులు


దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. కొత్తగా 8,895 కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య మాత్రం దారుణంగా పెరిగింది. గత 24 గంటల్లో 2,796 మంది వైరస్ కారణంగా మృతి చెందారు. యాక్టివ్ కేసుల సంఖ్య 99,155కు చేరింది.
కేరళ, బిహార్‌లో సవరించిన లెక్కలతో మరణాల సంఖ్య భారీగా పెరిగింది. గత 24 గంటల్లో 6918 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 


మొత్తం కేసులు: 3,46,33,255
మొత్తం మరణాలు: 4,73,326
యాక్టివ్​ కేసులు: 99,155
మొత్తం కోలుకున్నవారు: 3,40,60,774


పెరిగిన ఒమిక్రాన్ కేసులు..
దేశంలో ఒమిక్రాన్ కేసులు కూడా పెరుగుతున్నాయి. ఇప్పటివరకు 5 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు బయటపడ్డాయి. కర్ణాటక, ముంబయి, గుజరాత్‌, దిల్లీలో ఈ కేసులు వెలుగుచూశాయి. టాంజానియా నుంచి దిల్లీకి వచ్చిన ఓ వ్యక్తికి ఒమిక్రాన్ వేరియంట్ స్పష్టమైంది.
వీరిని ఐసోలేషన్‌లో ఉంచారు. ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌లను వెతికే పనిలో ఉన్నారు అధికారులు. అనుమానితుల శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపారు. ఈ ఫలితాలు ఇంకా రాలేదు.


అయితే ఒమిక్రాన్ వేరియంట్‌ వ్యాప్తి అధికంగా ఉంటుందని కానీ దాని వల్ల ఇప్పటివరకు ఎక్కడా మరణాలు సంభవించలేదని నిపుణులు అంటున్నారు.


Also Read: Karimnagar: కరీంనగర్ లో కరోనా కలకలం... 46 మంది వైద్య విద్యార్థులకు పాజిటివ్


Also Read: Konijeti Rosaiah: ముగిసిన రోశయ్య అంత్యక్రియలు.. కొంపల్లి ఫామ్ హౌస్ లో అంత్యక్రియలు పూర్తి


Also Read: మూడో భార్యతో ఉంటూ.. రెండో భార్యను చంపాలని భర్త క్షుద్రపూజలు.. చేతబడికి పాస్ పోర్ట్ సైజ్ ఫొటో