స్నేహమేరా జీవితం...స్నేహమేరా శాశ్వతం అని నిరూపించారు మహబూబాబాద్ జిల్లాకు చెందిన యువకులు. రోడ్డు ప్రమాదంలో తమ మిత్రుడిని కోల్పోయమన్న బాధను దిగమింగుకుని అతడి బర్త్ డే వేడుకలు నిర్వహించారు. మిత్రుడి సమాధిపై అతడిని గుర్తుచేసుకుంటూ తల్లిదండ్రుల చేత కేక్ కట్ చేసి నివాళులు అర్పించారు.
Also Read: TRS : రైతుల కోసం జైలుకెళ్లడానికైనా కేసీఆర్ సిద్ధమే .. కేంద్రానికి భయపడేది లేదన్న టీఆర్ఎస్
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం రాజీవ్ నగర్ తండాకు చెందిన బాలాజీ అనే డిగ్రీ విద్యార్థి నెల రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. అతని పుట్టిన రోజు సందర్భంగా బాలాజీ స్నేహితులు శ్మశానవాటికలో సమాధి దగ్గర పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. బాలాజీ తల్లిదండ్రుల చేత కేక్ కట్ చేయించి నివాళులు అర్పించారు. స్నేహితుడి సమాధి వద్ద కేక్ కట్ చేసి శోకసంద్రంలో ఉండిపోయారు. హెల్మెట్ లేకపోవడం వలనే బాలాజీ ప్రమాదంలో చనిపోయారు. బైక్ డ్రైవింగ్ లో ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలని స్నేహితులు విజ్ఞప్తి చేశారు.
మా మిత్రుడిలా మరొకరికి కాకూడదు
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం రాజీవ్ నగర్ తండాకు చెందిన బాలాజీ గత ఏడాది డిసెంబర్ 10 రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఎంతో సరదాగా ఉండే స్నేహితుడి అకాల మరణాన్ని తోటి స్నేహితులు తట్టుకోలేకపోయారు. ప్రాణ స్నేహితుడి లేని లోటును మరిచిపోలేకపోయారు. జనవరి 10న బాలాజీ పుట్టినరోజు. ప్రతి ఏడాది స్నేహితులతో ఎంతో వేడుకగా బాలాజీ పుట్టినరోజును జరుపుకునేవాడు. ఈ విషయం గుర్తుచేసుకున్న తోటి స్నేహితుల గుండె బరువెక్కింది. స్నేహితుడి గుర్తుగా బర్త్ డే నిర్విహించి నివాళులు అర్పించాలని నిర్ణయించుకున్నారు. దీంతో తమ ప్రాణ స్నేహితుడు తమ మధ్య లేకపోయినా పుట్టిన రోజు వేడుకలను నిర్వహించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో బాలాజీ పుట్టినరోజును శ్మశాన వాటికలో సమాధి వద్ద కేక్ కట్ చేసి నిర్వహించారు. అంతకు ముందు సమాధిని పూలతో అలంకరించారు. స్నేహితుడుతో గడిపిన మధుర జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. మిత్రుడు తమ మధ్య లేడని కన్మీరుమున్నీరుగా విలపించారు. ఇక ప్రతీ ఒక్కరూ తప్పకుండా హెల్మెట్ ధరించండని, తమ స్నేహితుడిలా మరొకరికి కాకూడదని యువకులు వేడుకున్నారు.
Also read: కేసీఆర్ జాతీయ రాజకీయాలపై కేటీఆర్ కామెంట్.. కేంద్ర ఐటీ శాఖ మంత్రిగా చేయాలని కోరిన నెటిజన్