ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 47,884 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేయగా.. 4,348 కేసులు నమోదయ్యాయి. వైరస్ తో మరో ఇద్దరు మృతి చెందారు. కరోనా కొత్తగా 261 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 14,204 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. వైరస్ వ్యాప్తి దృష్ట్యా పండగ సమయాల్లో ప్రజలు కరోనా జాగ్రత్తలు పాటించాలని వైద్యారోగ్యశాఖ అధికారులు సూచిస్తున్నారు.






 


దేశంలో కరోనా కేసులు


రికార్డు స్థాయిలో దేశంలో కరోనా కేసులు సంఖ్య పెరిగింది. ఇరవై నాలుగు గంటల వ్యవధిలో రెండు లక్షల నలభై ఏడు వేల నాలుగు వందల పదిహేడు కేసులు నమోదయ్యాయి. రోజు వారి పాజిటివిటీ రేటు కూడా భారీగా పెరిగింది. ఆ పాజిటివిటీ రేటు 13.11 శాతంగా ఉన్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. 


గత ఇరవై నాలుగు గంటల కేసులతో పోలిస్తే ఈ సంఖ్య ఇరవై ఏడు శాతం పెరిగినట్టు. ఇది నిన్నటి కంటే సుమారు యాభై వేలు కేసులు ఎక్కువగా రిజిస్టర్ అయ్యాయి. ఈ సంఖ్య ఇంకా పెరిగే ఛాన్స్ ఉందని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. 


మే 26 తర్వాత ఈ స్థాయిలో కేసులు పెరగడం ఇదే మొదటి సారి. ఇప్పటి వరకు ఒక్కరోజులో ఈ స్థాయిలో కేసులు పెరిగింది లేదు. 2021 ఏప్రిల్‌ 27న అంతకు ముందు రోజు కంటే 43,196 కేసులు రిజిస్టర్ అయ్యాయి. ఇప్పటి వరకు ఇదే అత్యధికంగా ఉండేది ఇప్పుడు మాత్రం ఆ రికార్డును బ్రేక్ చేసి ఏకంగా యాభై వేలు పెరిగాయి. ఇదే ఆందోళన కలిగించే అంశం. బుధవారం ఒక్కరోజు 203 మంది చనిపోయారు. అక్టోబర్‌ 27 తర్వాత చనిపోయిన వారి సంఖ్య పెరగడం కూడా ఇదే ఎక్కువ. 


Also Read: Covid Updates: పండుగ స‌మ‌యంలో జాగ్రత్త... ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు రావొద్దు... కిమ్స్ ఐకాన్ వైద్యులు సూచన