కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న నిధుల విషయంపై తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ మధ్య సవాళ్ల సమరం నడుస్తోంది. పాదయాత్రలో  బండి సంజయ్ తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంమలో పలు పథకాల నిర్వహణకు బీజేపీ కేంద్ర ప్రభుత్వం నిధులు పంపుతుంటే సీఎం కేసీఆర్ తన ఫొటోలు పెట్టుకుని ప్రచారం చేసుకుంటున్నారని బండి సంజయ్ ఆరోపిస్తున్నారు. రోడ్లు, కరోనా వ్యాక్సిన్, బియ్యం, హరితహారం, ఇలా ప్రతి దానికీ పైసలు ఇచ్చేది కేంద్రమే అని ప్రతీ చోటా చెబుతున్నారు. Also Read: Ganesh Nimajjan: హైదరాబాద్‌లో నిమజ్జనంపై రంగంలోకి కేసీఆర్.. ఆ రెండు ప్లాన్‌లకు మొగ్గు!


దీనికి మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. గత ఆరున్నరేళ్లలో రాష్ట్రం నుంచి కేంద్రానికి రూ.2.72 లక్షల కోట్లు వెళ్లాయి. రాష్ట్రానికి కేంద్రం రూ.1.42 లక్షల కోట్లు మాత్రమే ఇచ్చింది. ఇది నిజం కాకపోతే నేను రాజీనామా చేస్తాను. బండి సంజయ్ ఎంపీ పదవికి రాజీనామా చేస్తారా? అని మంత్రి కేటీఆర్‌ సవాల్‌ విసిరారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలకు మొత్తం నిధులు కేంద్రమే ఇస్తే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ పథకాలు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ పన్నులను ఇతర రాష్ట్రాల్లో ఖర్చు చేస్తున్నారని కేటీఆర్ మమండిపడ్డారు. గద్వాల పర్యటనలో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.


Also Read: Love Story Movie: ‘లవ్ స్టోరీ’లో ఆ డైలాగ్‌తో.. తెలంగాణ ప్రభుత్వానికి సెటైర్?


కేంద్ర నిధులపై కేటీఆర్ చేసిన సవాల్‌పై మెదక్ జిల్లాలో పాదయాత్ర కొనసాగిస్తున్న తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. కేటీఆర్ తుపాకీ రాముడని మండిపడ్డారు. సవాల్ చేసే స్థాయి ఆయనకు లేదని దమ్ముంటే కేసీఆర్ రాజీనామాకు సిద్ధమని సవాల్ చేయాలని తాను సిద్ధమని ప్రకటించారు. తెలంగాణలో అనేక పథకాలకు నిధులు ఇస్తోంది కేంద్రమేనని స్పష్టంచేశారు. కేంద్రం ఇస్తున్న నిధులపై ఎప్పుడూ తెలంగాణలో రాజకీయ దుమారం రేగుతూనే ఉంటుంది. బీజేపీ ముఖ్య నేతలు ఎవరు వచ్చినా కేంద్రం తెలంగాణకు ఎన్ని నిధులు ఇచ్చిందో లెక్క చెబుతారు. ఆ లెక్కల్ని టీఆర్ఎస్ నేతలు ఖండిస్తారు. Also Read: Cheating Couple : వీళ్ల వేషాలు చూసి ఫ్లాటయితే బుక్కయినట్లే ! ఈ జంట ఎన్ని కోట్లకు జనాల్ని ముంచారో తెలుసా..?


ప్రజలు చెల్లించే పన్నుల్లో కొంత రాష్ట్రానికి, కొంత కేంద్రానికి వెళ్తాయి. కేంద్రానికి వెళ్లే పన్నులు మళ్లీ రాష్ట్రాలకే కేటాయిస్తారు. బాగా అభివృద్ధి చెందిన రాష్ట్రాలు, పారిశ్రామికంగా ముందున్న రాష్ట్రాల నుంచి కేంద్రానికి పన్నులు ఎక్కువగా వెళ్తాయి. అయితే కేటాయింపులు మాత్రం భిన్నమైన పద్దతుల్లో చేస్తూంటారు. వెనుకబడిన రాష్ట్రాలకు సాయం ఎక్కువగా అందుతూ ఉంటుంది. కేంద్రం అలా ఇచ్చే నిధుల్నే బీజేపీ తమ ఘనతగా చెప్పుకుంటూండటంతో రాజకీయంగా దుమారం రేగుతోంది. తాజాగా ఇది సవాళ్లకు దారి తీసింది. సహజంగా ఇలాంటి సవాళ్లన్నీ రాజకీయంగానే ఉండిపోతాయి. లెక్కలు బయట పెట్టేందుకు రెండు వర్గాలూ సిద్దం కావు.


Also Read: Nellore News: రూ.కోటి కొట్టేసి.. బిచ్చగాళ్లకు రూ.500 నోట్లు పంచేశారు.. కానీ పానీపూరి ఫోన్ కాల్ పట్టించేసింది