వాళ్లు కనిపించడానికి "ముసలి మొగుడు - పడుచు పెళ్లాం" టైప్‌లో ఉంటారు. కానీ వేషాలు మాత్రం ఓ రేంజ్‌లో ఉంటాయి. టిక్‌టాక్‌లు, షార్ట్‌ వీడియోలతో చూసే వారందర్నీ టెంప్ట్ చేస్తారు. బిల్డప్ అయితే హై ఫైగా ఉంటుంది. వారి మాయలో పడిపోయిన వారికి అరి అసలు స్వరూపం తెలిసే సరికి చేతి చమురు మొత్తం వదులుతుంది. ఈ కన్నింగ్ కపుల్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు.  వారి పేర్లు మామిడాల శ్రీధర్,చేరుకుమిల్లి గాయత్రి. ఏ ఊరు అంటే.. ఎక్కడ  మోసం చేయడానికి అమాయకులు దొరుకుతారో అదే వాళ్ల ఊరు.

Also Read : రూ.కోటి కొట్టేసి.. బిచ్చగాళ్లకు రూ.500 నోట్లు పంచేశారు.. కానీ పానీపూరి ఫోన్ కాల్ పట్టించేసింది


ఖమ్మం జిల్లా పాల్వంచ వద్ద శ్రీధర్, గాయత్రి అనే దంపతుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి కారణం తన బిడ్డకు విదేశాల్లో చదువుకునేందుకు సీటిప్పిస్తానని చెప్పి  రూ. 44 లక్షలు వసూలు చేసి మోసం చేశారని గౌరీ శంకర్ అనే వ్యక్తి తూర్పుగోదావరి జిల్లా గోకవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు ఖమ్మం జిల్లా పాల్వంచ దగ్గర ఉన్నారని తెలుసుకున్న పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే వారి అరెస్ట్ విషయం తెలిసిన తర్వాత వారి పై ఉన్న కేసులన్నీ ఆటోమేటిక్‌గా బయటకు వచ్చాయి. వరుసగా వారు చేసిన మోసాల సంఖ్య బయటకు వస్తూండటంతో రాసుకోలేక పోలీసుస్టేషన్ రైటర్లు తంటాలు పడాల్సి వస్తోంది.


Also Read : ఇంట్లో ప్రియుడితో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన కోడలు.. చూసేసిన మామయ్య, చివరికి దారుణం


శ్రీధర్, గాయత్రి దపంతులకు వేరే వ్యాపారం, ఉద్యోగం ఏమీ లేదు. వారి పని మోసం చేయడమే. ఎవరైతే నమ్ముతారో వాళ్లను అడ్డంగా మోసం చేస్తారు. ఆ నమ్మవాళ్ల అవసరాల్ని కనిపెట్టి.. వారికి సాయం చేస్తామని చెబుతారు. అది వాళ్ల పిల్లల చదువా, లేకపోతే  సబ్సిడీ రుణాలా అనేది వాళ్ల మాటల ద్వారా తెలుసుకుంటారు. తమకు తెలిసిన వాళ్లు ఉన్నారని ఇట్టే పని చేయిస్తామని కొంత ఖర్చు అవుతుందని చెబుతారు. అలా ప్రారంభించి... ఎంత ఇస్తే ఇంత వరకూ పిండుకుంటారు. చివరికి జెండా ఎత్తేస్తారు. వీరిని నమ్మించడానికి ఈ దంపతులు వేసే వేషాలు అన్నీ ఇన్నీ కావు.


Also Read : ప్రియుడి మోజులో పెంచిన తల్లిని హత్య... కొబ్బరితాడుతో ఉరి వేసి దారుణం...


వీరు తమను మోసం చేశారంటూ గోకవరంతో పాటు రాజమండ్రి ,జగ్గంపేట, కిర్లంపూడి, గోకవరం, ప్రకాష్ నగర్,బొమ్మూరు  పలు పోలీస్ స్టేషన్ లలో కేసులు నమోదు అయ్యాయి. పోలీసులు వీరి గురించి ఆరా తీసి వీరి ఫోన్లను చెస్తే వీరి వేషాలన్నీ బయటపడ్డాయి. ఎక్కడైనా మోసం చేసి ఆ మోసం బయటపడే సమయంలో జెండా ఎత్తేయడం వీరి స్టైల్.  రాజమండ్రి  ,బొమ్మూరు సమీపంలోని రాజవోలు ఇలా అనేక చోట్లకు తిరిగారు. మొత్తంగా ఏడేళ్ల నుంచి వీరి మోసాలు సాగుతున్నాయి.


పోలీస్ కేసులు పడకుండా అప్పుడప్పుడు పోలీసులతో కలిసి తిరుగుతున్నట్లుగా షో చేసేవారు. ఆ పనికి.. ఈ పనికి విరాళాలిస్తున్నట్లుగా స్టేషన్లకు వెళ్లేవారు. పోలీసులతో ఫోటోలు దిగి ప్రచారం చేసుకునేవారు.


ప్రస్తుతానికి వీరిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. కానీ వారి బాధితులు మాత్రం అనేక ముంది ఫిర్యాదు చేయడానికి వస్తున్నారు. వారి వేషాలు చూసి మోసాలు కాదు.. ఇంకా ఏవేవో భాగోతాలు నడిపి ఉంటారని పోలీసులు కూపీ లాగుతున్నారు. 


Also Read : 25 సార్లు లేచిపోయి తిరిగివచ్చినా ఆదరిస్తున్న భర్త ! ప్రేమంటే ఇదేనా ?