Assam Eloped Wife : 25 సార్లు లేచిపోయి తిరిగివచ్చినా ఆదరిస్తున్న భర్త ! ప్రేమంటే ఇదేనా ?

అస్సాంకు చెందిన ఓ మహిళ భర్తను వదిలేసి 25 సార్లు పరాయి మగాళ్లతో వెళ్లిపోయింది. అన్నీ సార్లు త్వరగానే తిరిగి వచ్చింది. అయినా ఆమె భర్త ఒక్క మాట అనుకుండా ఆదరిస్తూనే ఉన్నారు.

Continues below advertisement


ఆమెకు పెళ్లయింది. కానీ  భర్త నచ్చలేదు. ఆ భర్త చేస్తున్న ఉద్యోగం నచ్చలేదు. అందుకే ఎవరైనా వచ్చి మనం వెళ్లిపోదాం అంటే తట్టాబుట్టా సర్దుకునేది. కానీ అలా తీసుకెళ్లిన వాళ్లు నెలకో ..రెండు నెలలకో వదిలేసి వెళ్లిపోతే మళ్లీ ఆమె భర్త దగ్గరకు వస్తుంది. అయితే అలా వెళ్లిపోయిన భార్యను ఎవరైనా ఆదరిస్తారా..? ఆ భర్త ఆదరిస్తాడు. ఒక సారి కాదు రెండు సార్లు కాదు..పది సార్లు కాదు.. ఇరవై ఐదు సార్లు ఇలా జరిగింది. అన్నీ సార్లు ఆదరించాడు. ఇప్పుడు కూడా ఆమె ఓ పశువుల కాపరితో వెళ్లిపోయింది. తిరిగి వస్తే ఆదరిస్తానని చెబుతున్నాడు. ఆమె వస్తుందని ఎదురు చూస్తున్నాడు. Also Read : సాయి ధరమ్ తేజ్ తాజా ఆరోగ్య పరిస్థితి ఇదే..

Continues below advertisement

ఇదంతా విన్న తర్వాత ఓ గొప్ప  ప్రేమికుడైన భర్తకథతో వచ్చిన సినిమాలాగా అనిపిస్తుంది కదూ.. కనీసం సినిమా స్టోరీ అని అయినా అనుకుంటారు .. వెబ్ సిరీస్‌గా అయితే పాతిక ఎపిసోడ్స్ తీయవచ్చు. కానీ ఇది రియల్ స్టోరీ. నిజంగానే పాతిక సార్లు లేచిపోయిన భార్య ఉంది. ఆన్ని సార్లు తిరిగి వచ్చినా ఆదరించిన భర్త ఉన్నాడు. విదేశాల్లో కాదు ఇండియాలోనే. అస్సాంలో నాగావ్ జిల్లాలోఆ భార్య భర్తలు ఉన్నారు. Also Read : సాయి ధరమ్ తేజ్‌కు యాక్సిడెంట్ ఎలా జరిగిందంటే..?

సెంట్రల్ అస్సాంలోని ధింగ్ లహ్కర్ గ్రామానికి చెందిన మహిళ కనిపించకుండా పోయింది. ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. చిన్న బిడ్డకు మూడు నెలల వయసు మాత్రమే. భర్త ఉద్యోగం నుంచి వచ్చే సరికి బిడ్డ గుక్క పెట్టి ఏడుస్తోంది కానీ ఆమె లేదు. దాంతో చుట్టుపక్కల వారి సాయంతో  ఎక్కడకు వెళ్లిందో తెలుసుకునే ప్రయత్నం చేశాడు. అయితే అదే సమయంలో మేకల కాపరి కూడా ఆచూకీ లేకపోవడం వారిద్దరూ వెళ్తున్నట్లుగా గ్రామస్తులు చూడటంతో  లేచిపోయిందని అంచనాకు వచ్చారు. ఎందుకంటే ఆమె ఇప్పటికి అలా వెళ్లిపోవడం ఇరవై ఐదో సారి . Also Read : టాలీవుడ్ హీరోలకు బైకులంటే ఎందుకంత మోజు ?

ఎన్ని సార్లు వెళ్లి పోయినా ఆమె చాలా త్వరగానే తిరిగి వస్తుంది. వెళ్లినప్పుడల్లా  ఇంట్లో ఉండే కొంత మొత్తాన్ని తీసుకుని వెళ్లిపోయింది. గత వారం వెళ్లిపోయినప్పుడు కూడా ఆమె రూ. ఇరవై రెండు వేలను తీసుకెళ్లిపోయిందని భర్త ఆవేదనగా చెప్పాడు. అన్ని సార్లు వెళ్లిపోతున్నా మళ్లీ ఎందుకు ఆదరిస్తున్నారంటే.. ఆ భర్త తన పిల్లల కోసమేనని చెబుతున్నాడు. తాను డ్రైవర్‌గా ఉద్యోగం చేస్తానని.. ఉద్యోగానికి వెళ్తే పిల్లల్ని ఎవరు చూసుకుంటారని ఆయన అమాయకంగా ప్రశ్నిస్తున్నాడు. ఇప్పటికీ తన భార్య తిరిగి వస్తే  ఆదరిస్తానని.. సమస్యలేమీ లేవని ఆయన భర్త చెబుతున్నాడు. ఎప్పట్లాగే అయితే ఆమె మరో వారంలో తిరిగి వస్తుందని..తీసుకెళ్లిన డబ్బులు అయిపోయిన తర్వాత వచ్చేస్తుందని ఆశలు పెట్టుకున్నాడు. మూడు నెలల బిడ్డను చూసుకుని భార్య రాక కోసం చూస్తున్నాడు. ఆ భర్త గురించి తెలిసి అందరూ హజ్బెండ్ ఆఫ్ ది డికేడ్ బిరుదు ఇవ్వాల్సిందేనని పొగుడుతున్నారు.

Also Read : తేజ్ భైక్ ఖరీదు ఎంతో తెలుసా ?

Continues below advertisement