దేశంలో కరోనా పరిస్థితి, వ్యాక్సినేషన్​పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో కేంద్ర మంత్రులు సహా అధికారులు పాల్గొన్నారు. కొవిడ్​ మూడో వేవ్ ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా మోదీ చెప్పినట్లు సమాచారం. వ్యాక్సినేషన్ వేగాన్ని మరింత పెంచాలని అధికారులకు ప్రధాని సూచించారు.






థర్డ్ వేవ్ వస్తుందనే..






రెండో వేవ్ లో ఆక్సిజన్ సహా పడిన ఇతర సమస్యలు థర్డ్ వేవ్ లో దేశం పడకూదని అధికారులతో మోదీ వెల్లడించినట్లు సమాచారం. వ్యాక్సినేషన్ వేగాన్ని మరింత పెంచి.. థర్డ్ వేవ్ వచ్చే లోపు వీలైనంత మంది టీకా తీసుకునేలా చర్యలు చేపట్టాలన్నారు.


కొవిడ్ పై ఎలాంటి అలసత్వం ప్రదర్శించకుండా ప్రజలు నిబంధనలు పాటించేలా చూడాలని సూచించారు. పండుగలు సహా ఎలాంటి బహిరంగ వేడుకలకు ప్రజలు గుమిగూడకుండా చూడాలన్ మోదీ వెల్లడించినట్లు తెలుస్తోంది.


కరోనా కేసులు..


దేశంలో రోజువారీ కేసుల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. కొత్తగా 34,973 కరోనా కేసులు నమోదుకాగా, 260 మంది మృతి చెందారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.


యాక్టివ్ కేసుల సంఖ్య 3,90,646కి చేరింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 1.18గా ఉంది. రికవరీ రేటు 97.49కి పెరిగింది. వీక్లీ పాజిటివిటీ రేటు 2.31 శాతంగా ఉంది. గత 77 రోజుల్లో వీక్లీ పాజిటివిటీ రేటు 3 శాతం కంటే తక్కువే ఉంది. డైలీ పాజిటివిటీ రేటు 11 రోజులుగా 3 శాతం కంటే తక్కువగా నమోదైెంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 53.86 కోట్ల కరోనా పరీక్షలు నిర్వహించారు.